Commonwealth Games:రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది
ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల నుంచి కలిపి కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం 11 మంది భారత్ కి ప్రాతినిథ్యం వహించనున్నారు. నిఖిల్ జరీన్, జ్యోతి యెర్రాజీ, ఆకుల శ్రీజ,సబినేని మేఘన కామన్వెల్త్ గేమ్స్ లో మొదటిసారి పోటీ పడుతున్నారు.
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2018 లో 13 మంది క్రీడాకారులు భారత్ కు ఆడటం జరిగింది.టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఫ్లాగ్ బేరర్ గా ఎంపిక చేయడం జరిగింది, కానీ అతని గాయం కారణంగా నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ కి దూరమయ్యాడు.దాంతో 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో ఫ్లాగ్ బేరర్ ఉన్న సింధుకి మరో అవకాశం వచ్చింది.
అథ్లెటిక్స్: జ్యోతి యొరజీ(ఆంధ్రప్రదేశ్: మహిళ 100 మీటర్ల హర్డిల్స్)
బ్యాడ్మింటన్ : శ్రీకాంత్ , కిడాంబి సింధు, స్వాతిక్ సాయిరాజ్ ( ఆంధ్రప్రదేశ్ సుమీత్ రెడ్డి, గాయత్రి గోపీచంద్ ( తెలంగాణ).
బాక్సింగ్ : నిఖిల్ జరీన్ (తెలంగాణ: మహిళలు 50 కేజీలు), హుసాముద్ధీన్ (తెలంగాణ: పురుషుల 57 కేజీలు).
మహిళల హకీ :రజిని ఇటిమరుపు(ఆంధ్రప్రదేశ్: రెండో గోల్ కీపర్)
టేబుల్ టెన్నిస్: ఆకుల శ్రీజ (తెలంగాణ)
మహిళల టి20 క్రికెట్: సద్దినేని మేఘన(ఆంధ్ర ప్రదేశ్)