Curd Benefits: పెరుగు వల్ల కలిగే ఉపయోగాలు
Curd Benefits: ప్రస్తుత కాలంలో అందర్నీ బాధిస్తున్న సమస్య స్థూలకాయం. ఇది ప్రపంచమంతటా వ్యాపించి అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఎక్కువగా మహిళలలో కనిపిస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన వెయిట్ లాస్ అవ్వక చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక ఎక్కువ వెయిట్ పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎన్ని రకాల డైట్ లు ఫాలో అయిన, అదేవిధంగా వ్యాయామాలు చేసిన ప్రయోజనం లేకుండా ఉంటుంది.
అందువల్ల చాలామంది ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. కొందరైతే డాక్టర్లను సంప్రదించవలసి వస్తుంది. ఇవన్నీ కాకుండా ఇంట్లోనే ఈజీగా వెయిట్ లాస్ అయ్యే మార్గాలు చాలానే ఉన్నాయి. వీటిలో భాగంగా ప్రతిరోజు వాకింగ్ చేయడం. అలాగే వ్యాయామం చేయడం. అదేవిధంగా పెరుగును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం. ప్రతిరోజు పెరుగున ఆహారంగా తీసుకోవడం ద్వారా త్వరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు. అదేవిధంగా పెరుగుతో తయారుచేసిన ఈ వంటకాల వల్ల త్వరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
1. ఓట్స్ దహి మసాలా:
ఓట్స్ లో పెరుగును కలిపి ఓట్స్ దహిమసాలాను తయారు చేసుకొని తినవచ్చు. ఓట్స్ బరువును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే. అందువల్ల ఓట్స్ లో పెరుగును కలిపి తినడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
2. దహి చనా చాట్ మసాలా:
ఉడికించిన శనగలను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా తొందరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు. ఎక్కువ శాతం ఉడికించిన శనగలను చాట్ మసాలాతో కలిపి తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఉడికించిన శనగలకు చాట్ మసాలాతో పాటు, పెరుగును కలిపి తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
3. దహీ చికెన్:
బరువును తగ్గించుకోవడానికి లంచ్ చేయడానికి సరిపోయే వంట దహి చికెన్. చికెన్ తో పెరుగు కలిపి చికెన్ కర్రీ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల బరువును తొందరగా తగ్గించుకోవచ్చు.
4. మిక్స్ వెజ్ రైతా:
మిక్స్ వెజ్ రైతా అనగా పెరుగు పచ్చడి. ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ త్వరగా అవ్వచ్చు. పెరుగులో క్యారెట్, బీట్రూట్, దోసకాయ, ఉల్లిపాయ ముక్కలు లాంటి అనేక రకాల కూరగాయలను కలిపి తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే త్వరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు.
5. ప్లాక్స్ సీడ్ రైటా:
అనగా అవిస గింజలను పెరుగుతో కలిపి చేయడాన్ని ప్లాక్స్ సీడ్ రైటా అంటారు. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మరియు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు.
ఈ విధంగా ఏదో ఒక రూపంలో పెరుగును ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మనం తినే ఆహార పదార్థాలు చాలా ఉన్నప్పటికీ పెరుగు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్న పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. భోజనం తినేటప్పుడు పెరుగు తినకపోతే భోజనం చేసినట్టు ఉండదు. కొందరికైతే ఏది ఉన్నా లేకపోయినా కచ్చితంగా పెరుగు ఉండవలసిందే. పెరుగు లేకపోతే భోజనం కూడా చేయరు. అంత ప్రాముఖ్యత పెరుగుకు ఉంటుంది. పెరుగు పాల నుండి వచ్చే పదార్థం కాబట్టి దీన్ని ఎవరైనా తినవచ్చు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇష్టంగా ఆస్వాదించవచ్చు. పెరుగును తినడమే కాకుండా వంటలలో కూడా ఉపయోగిస్తారు. పెరుగు లేదా పాలను జ్యూస్లలో ఉపయోగిస్తారు. అలాగే వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు పెరుగును తినడం ద్వారా మన శరీరానికి అనేక రకాల లాభాలు ఉన్నాయి .
పెరుగు యొక్క ఉపయోగాలు:
- పెరుగు పాలతో తయారయ్యే పదార్థం .విటమిన్ బి 2, విటమిన్ బి 12, పొటాషియం ,మెగ్నీషియం వంటి అనేక పోషకాలు శరీరానికి లభిస్తాయి.
- పాలతో పోలిస్తే పెరుగు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అవుతుంది.
- పెరుగు బ్యాక్టీరియా ల సమూహం అందువల్లనే జీర్ణ వ్యవస్థను వృద్ధి చేస్తుంది.
- కడుపు మంటను కూడా తగ్గిస్తుంది. అలాగే కడుపు నొప్పిని నివారిస్తుంది.
- ప్రతిరోజు 200 గ్రాముల పెరుగు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఆస్ట్రేలియాలోని వీయన్న విశ్వ విద్యాలయంలోని సైంటిస్టులు పెరుగుపై పరీక్షలు చేసి రోగనిరోధక శక్తి పెంచే టాబ్లెట్స్ లా ఉపయోగపడుతుందని తెలిపారు.
- పెరుగును ప్యాక్ లాగా మొహానికి వేసుకుంటే మొటిమలు తగ్గించి, ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
- పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, ఎక్సోఫోలియేటర్ గా పనిచేసి ముఖంపై మృత కణాలను మరియు నల్లటి మచ్చలను కూడా తీసివేస్తుంది.
- పెరుగును ప్రతిరోజు తినడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుందని అమెరికన్ హాట్ అసోసియేషన్ చేసిన రీచార్జ్ ద్వారా బయటపడింది.
- కొవ్వు అధికంగా లేని పెరుగును ఎక్కువగా తినే వారిలో రక్తపోటు పెరిగేలా చేసే అవకాశం 31 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలిపారు.
- మహిళలకు పెరుగు చాలా ముఖ్యమైనది. పెరుగులో ఉండే లాక్టో బాసిల్లన్, అసిడో ఫిలాస్ అనే బ్యాక్టీరియా శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉత్పత్తి చేయడం వల్ల సూక్ష్మజీవులను(ఫంగస్) నివారిస్తుంది.
- స్త్రీలలో ఎక్కువగా వచ్చే యోని ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
- యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ఒక కప్పు పెరుగులో 275 mg కాల్షియం ఉంటుంది 13.అందువల్ల ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకలను బలపరుస్తుంది.
- ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా తొందరగా బరువు తగ్గించుకోవచ్చు.
- పెరుగులో కొవ్వు పదార్థాలు మరియు కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే కాల్షియం విటమిన్ డి, ప్రోటీన్లు, మరియు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉన్నందున అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు తినే పండ్లు కూరగాయలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి లాగే పెరుగును కూడా తీసుకోవచ్చు.
- పెరుగులో అన్ని పోషకాలతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ ఉన్నవారు వెన్న తీసిన ప్యాకెట్ పెరుగు తినడం ద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇవే కాక త్వరగా బరువును తగ్గించుకోవాలంటే పెరుగుతో చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.