Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో మరణించిన సైరస్
Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ అయినా సైరస్ మిస్త్రీ హఠాత్మరణం. ముంబై లోని పాల్ఘర్‌లో జరిగిన అనుకుని రోడ్డు ప్రమాదంలో ఈ బిజినెస్ టైకూన్ మృత్యు బారిన పడ్డారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాల్ఘర్ సమీపంలోని చరోటి దగ్గర సైరన్ ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పి డివైడర్ కు గుద్దుకుంది.
ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆయనను హాస్పిటల్ కి తరలించ లోపే మరణించారు. కాగా పాల్ఘర్ దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోయినప్పటికీ కార్ డ్రైవర్ స్పీడుగా కారుని డ్రైవ్ చేయడంతో కారు కంట్రోల్ తప్పి డివైడర్ కు గుద్దుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు.
సైరస్ తో పాటు మరోకరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అలాగే అందులో వున్న మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.వీరిని దగ్గరలో ఉన్నా ఆసుపత్రికి తరలించే చికిత్సలు ఇస్తున్నారు. కాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం షాపూర్ జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ.ఈయన ముంబైలో 1968 జులై 4న జన్మించాడు.
ముంబైలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న సైరస్ ఇంతకుమించి చదువుల కోసం లండన్ వెళ్లారు. ఉన్నత చదువులను లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కొనసాగించారు. టాటా గ్రూప్ బోర్డులో 2006లో చేరారు. 18 శాతం వాటా టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ లో పల్లోంజీ కుటుంబానికి వుంది. రతన్ టాటా చైర్మన్ తర్వాత చైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టలి అని చాలా కసరత్తు జరిగింది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి ఎవరిని ఎంపిక చేసింది. అలా టాటా గ్రూప్ ఆరవ చైర్మన్గా 2012 డిసెంబర్ 28న బాధ్యతలు చేపట్టారు. అలా 2012 నుంచి 2016 మధ్య టాటా గ్రూప్ చైర్మన్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. రతన్ టాటా తో కొన్ని విభేదాల కారణంగా ఆయనను బయటకు పంపించారు.
ప్రస్తుతం షాపూర్ జి, పల్లోంజి సంస్థల బాధితులను చూసుకుంటున్నారు. సైరస్ తండ్రి,వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ఈ సంవత్సరం జూన్ 28న మరణించారు. సైరస్ మరియు అతని తండ్రి మరణం తర్వాత,అతను అతని తల్లి ప్యాట్సీ పెర్రిన్ దుబాస్,షాపూర్ మిస్త్రీ మరియు ఇద్దరు సోదరీమణులు లైలా మిస్త్రీ మరియు అల్లు మిస్త్రీలతో సైరస్ కలిసి ఉంటున్నారు. కానీ అంతలోపే హఠాత్మరణానికి ఆయన గురయ్యారు.