Digital Banking: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను దేశవ్యాప్తంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.
Digital Banking: ప్రతిరోజు మనకు ఉండే అవసరాలు తీర్చుకోవడానికి కొంత డబ్బు అనేది అవసరం అవుతుంది. ఈ డబ్బును ప్రతి ఒక్కరు రకరకాల పనులు చేస్తూ సంపాదిస్తూ ఉంటారు. ఇలా వచ్చిన డబ్బు ద్వారా కొంత అవసరాలకు వినియోగించుకొని మరికొంత దాచుకుంటూ ఉంటారు. ఇలా దాచుకున్న డబ్బును భవిష్యత్తులో ఎప్పుడైనా అత్యవసర అవసరాలు ఇస్తే ఆ సమయంలో వినియోగించుకుంటారు.
ఇలా డబ్బులు దాచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ రంగం వినియోగిస్తున్నారు. ఈ బ్యాంకులో డబ్బులు రకరకాలైన పద్ధతుల ద్వారా దాచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనకు కావాల్సిన వస్తువులను దుకాణాల్లో తీసుకొని వాటికి సరిపడినంత డబ్బును నగదు రూపంలో అతనికి అందిస్తూ ఉంటాం. ఈ విధానం ప్రస్తుతం నడుస్తుంది. ప్రస్తుతం భారత గవర్నమెంటు ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదే డిజిటల్ బ్యాంకింగ్ విధానం. ఈ డిజిటల్ బ్యాంకింగ్ విధానం ద్వారానే స్థిర వృద్ధి అనేది సాధ్యమవుతుంది.
ఈ డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని భారత గవర్నమెంటు తీసుకురావడానికి కారణం-
-పేదలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం.
-2014 సంవత్సరానికి ముందు ఫోన్ బ్యాంకింగ్ విధానానికి సంబంధించి చాలా రాజకీయాలు నడుస్తూ ఉండేవి.
-ఒక మంచి పరిపాలన చేయడానికి, మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి మాధ్యమంగా బ్యాంకింగ్ ను ఉపయోగిస్తారని మోడీ చెప్పడం జరిగింది.
-భారతదేశం మొత్తంలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభం కానున్నాయి.
–ఆంధ్రప్రదేశ్లో రెండు, తెలంగాణలో మూడు యూనిట్ల ప్రారంభానికి శ్రీకారం.
పేదలకు బ్యాంకింగ్ సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ను(డి బి యు) ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. ఆదివారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను భారత జాతికి అంకితం ఇస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు. 2014 సంవత్సరానికి ముందు వరకు ఫోన్ బ్యాంకింగ్ విధానం అమల్లో ఉండేది.
2014 తర్వాత ఈ ఫోన్ బ్యాంకింగ్ విధానాన్ని వినియోగించకుండా గత 8 ఏళ్లుగా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని వినియోగిస్తున్నారు. దీని కారణంగా దేశము స్థిరమైన వృద్ధిని సాధించింది అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎంత బలంగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే దృఢంగా ఉంటుంది. అంతే స్థాయిలో పురోగతిని కూడా సాధిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ తాము ప్రభుత్వంలోకి వచ్చాక బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నోట్ల రద్దు అనే కార్యక్రమం చేయడం, దీని ద్వారా ఎక్కడెక్కడి నల్ల ధనమంతా బయటికి రావడం జరిగింది.
అక్రమంగా ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తులను వారంతకు వారే బయటకు వచ్చే విధంగా ఈ నోట్ల రద్దు కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా ఇంతకుముందు ఉన్న వెయ్యి రూపాయల నోటు 500 రూపాయల నోటు రద్దు కావడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని ఎవ్వరూ తీసుకురానని మార్పులు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారంతా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని, డిజిటల్ లావాదేవీలను వినియోగించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ డిజిటల్ బ్యాంకింగ్ విధానం గురించి, డిజిటల్ లావాదేవీల గురించి బ్యాంకులు వ్యాపారులకు వివరించాలని ప్రధాని సూచించారు. మన ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ నేతృత్వంలో అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చెప్పడం జరిగింది.
డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ( డిబియు) ద్వారా ఫలిత0–
భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఈ ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ఈ యూనిట్లను ప్రారంభించింది. ఈ యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేటు రంగ బ్యాంకులు, ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకు ను కూడా బాగం చేసింది. ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో ప్రజలు పొదుపు ఖాతాను (సేవింగ్ ఖాతాను) తెరవవచ్చు.
ఇలా చేసిన తర్వాత వారి ఖాతాలో ఎంత డబ్బు ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు. మన బ్యాంకు పాస్ బుక్ లో మన ఖాతాలో ఉన్న డబ్బుకు సంబంధించిన ప్రింట్ అనేది మన పాస్ బుక్ లో తీసుకొని వెళ్లొచ్చు. ఇతరుల ఖాతాలోకి డబ్బులు పంపించవచ్చు.
క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు బ్యాంకులో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ బ్యాంకింగ్ విధానానికి సంబంధించి ప్రతి ఒక్క రికి అవగాహన కల్పించడం కోసం డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించి ఈ విధానాన్ని బ్యాంకుల ద్వారా ప్రజలకు వివరిస్తూ దీని ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని సూచించడం జరిగింది.