Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Digital Rupee: డిజిటల్ ( e ₹), కొత్త చెల్లింపు విధానం

Digital Rupee: సరికొత్త డిజిటల్ రూపాయిని విడుదల చేస్తున్న ఆర్ బీఐ!

ప్రతిరోజు మనకు వుండే అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బు అనేది అవసరమవుతుంది. ఈ డబ్బును ప్రతి ఒక్కరు రకరకాల ఉద్యోగాలు చేస్తూ, రకరకాల కూలి పనులు చేస్తూ, అలాగే వివిధ రకాల పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బుతో మనకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకుంటున్నారు. అలాంటి డబ్బుకు సంబంధించి పూర్వం నాణ్యాల నుంచి కాగితపు పేపర్ ద్వారా డబ్బులు తయారు చేసే విధానం వరకు డబ్బు అనేది రకరకాలుగా మార్పు చెందుతూ వచ్చింది.

డిజిటల్ ( e ₹), కొత్త చెల్లింపు విధానం
డిజిటల్ ( e ₹), కొత్త చెల్లింపు విధానం

ప్రస్తుతం కాగితపు పేపర్ ద్వారా డబ్బును ముద్రిస్తున్నారు. ప్రజెంట్ కాగితపు నోట్లు , కొన్ని నాణ్యాలు కూడా చలామణిలో ఉన్నాయి. అయితే ఈ డబ్బుకు సంబంధించి (ఆర్ బి ఐ) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. అది డిజిటల్ రూపాయి ( e ₹) విధానం.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే డిజిటల్ రూపాయిని (ఇ-రూపి/Rs) ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఒక సపోర్ట్ ఇస్తూ, చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు డిజిటల్ రూపాయి ని ఆర్ బి ఐ తీసుకొస్తుంది. ఇలాంటి ప్రతిపాదనను ఆర్ బి ఐ చేసింది. డిజిటల్ రూపాయి కి సంబంధించి నమూనా పత్రం విడుదల చేసిన ఆర్ బి ఐ . టోకు, రిటైల్ అవసరాలకు డిజిటల్ రూపాయిని వినియోగించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సి బి డి సీ )’గా వ్యవహరించే ఇ-రూపీ కి సంబంధించి కాన్సెప్ట్ నోటును ఆర్ బి ఐ విడుదల చేసింది.

Digital Rupee రెండు రకాలు:

ప్రస్తుత చెల్లింపు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కాకుండా, అదనపు చెల్లింపు అవకాశం గా ఇది మారుతుందని పేర్కొంది. సి బి డి సీ లో రూపాయి ద్వారా చెల్లింపుల విధానమనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ లేదా రీటైల్(సి బి డి సీ- ఆర్) అవసరాలకు వినియోగించేదిగా మరొకటి టోకు అవసరాలకు వినియోగించేదిగా వర్గీకరిస్తారు. రిటైల్ సి బి డి సీ నీ అందరూ వినియోగించుకోవచ్చు.టోకు సి బి డి సీ నీ ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగించుకోవాలి. ఆర్ బీ ఐ విడుదల చేసిన కాన్సెప్ట్ నోట్లో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60 కేంద్ర బ్యాంకులు సిబిడిసి విధానంపై ఆసక్తి చూపారని పేర్కొంది.

  • ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లు, నాణ్యాల నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి
  • నగదు చలామణి తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థను సాధించడానికి
  • చెల్లింపులకు సంబంధించి వినూత్నత, సామర్థ్యం, పోటీ తత్వాన్ని పెంచడానికి
  • విదేశానికి సంబంధించిన లావాదేవీలను మరింత మెరుగుపరచుకోవడానికి
  • క్రిప్టో ఆస్తుల నుంచి సామాన్యులను రక్షించడానికి దేశీయ కరెన్సీ పై విశ్వాసం పెంచడానికి ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది.

ఇప్పుడు డిజిటల్ రూపంలో నగదు ఉంది కదా

నగదును డిజిటల్ రూపంలోనికి మార్చుకుని వినియోగించుకునే విధానానికి వాణిజ్య బ్యాంకులు బాధ్యత వహిస్తే, సి బి డి సి చెల్లింపుల విధానానికి సంబంధించి ఆర్ బి ఐ బాధ్యత వహిస్తుంది.

డిజిటల్ రూపీ వల్ల ఉపయోగాలు

సి బి డి సి అనేది కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీ. ఆర్ బి ఐ బ్యాలెన్స్ సీట్లలో ఇది కనిపిస్తుంది అందరూ పౌరులు, కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు చట్టబద్ధ చెల్లింపులకు ఈ విధానాన్ని వాడుకోవచ్చు. వాణిజ్య బ్యాంకుల నగదుతో దీన్ని మార్చుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ కి ఆదరణ పెరిగింది . అయితే వాటి వల్ల మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడం వంటివి చేసే అవకాశం ఉంది. అందుకే సి బి డి సి ని అభివృద్ధి పరిచి ప్రజలకు నష్ట భయం లేని వర్చువల్ కరెన్సీని అందించడమే తమ ఉద్దేశమని ఆర్.బి.ఐ కాన్సెప్ట్ నోట్ వివరిస్తుంది.

కరెన్సీ ని తయారు చేయు విధానం

ప్రతిరోజు మనకు వుండే అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బు అనేది అవసరమవుతుంది. ఈ డబ్బును ప్రతి ఒక్కరు రకరకాల ఉద్యోగాలు చేస్తూ, రకరకాల కూలి పనులు చేస్తూ, అలాగే వివిధ రకాల పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బుతో మనకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకుంటున్నారు. అలాంటి డబ్బుకు సంబంధించి పూర్వం మొదట వస్తు మార్పిడి విధానం ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ఇతరులకు కావాల్సిన వస్తువులనుఇచ్చి తెచ్చుకునేవారు .

కాలక్రమమైన తర్వాత రసీదుల ద్వారా తర్వాత నాణ్యాల ద్వారా చివరిగా కాగితపు పేపర్ ద్వారా డబ్బును ముద్రించేవారు. పై విధంగా ఒకదాని తర్వాత ఒకటి మార్పు చెందుతూ ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లు రూపంలోకి డబ్బు మార్పు చెందింది అలా వస్తు మార్పిడి విధానం నుంచి కాగితపు పేపర్ ద్వారా డబ్బులు తయారు చేసే విధానం వరకు డబ్బు అనేది రకరకాలుగా మార్పు చెందుతూ వచ్చింది. ప్రస్తుతం కాగితపు పేపర్ ద్వారా డబ్బును ముద్రిస్తున్నారు. ప్రజెంట్ కాగితపు నోట్లు , కొన్ని నాణ్యాలు కూడా చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లు లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. విధి తయారీకి నిర్వహణకు ఎక్కువ మొత్తంలో డబ్బు లేదా ఖర్చు అవుతుంది.

ఆర్.బి.ఐసరికొత్త డిజిటల్ (e ₹) ప్రవేశపెట్టబోతుంది

ప్రస్తుతం అయితే డబ్బుకు కొంతవరకు విలువ తగ్గుతూ వస్తుంది.అయితే ఈ డబ్బుకు సంబంధించి (ఆర్ బి ఐ) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. అది డిజిటల్ రూపాయి ( e ₹) విధానం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే డిజిటల్ రూపాయిని (ఇ-రూపి/Rs) ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఒక సపోర్ట్ ఇస్తూ, చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు డిజిటల్ రూపాయి ని ఆర్ బి ఐ తీసుకొస్తుంది. ఇలాంటి ప్రతిపాదనను ఆర్ బి ఐ చేసింది. డిజిటల్ రూపాయి కి సంబంధించి నమూనా పత్రం విడుదల చేసిన ఆర్ బి ఐ . టోకు, రిటైల్ అవసరాలకు డిజిటల్ రూపాయిని వినియోగించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సి బి డి సీ )’గా వ్యవహరించే ఇ-రూపీ కి సంబంధించి కాన్సెప్ట్ నోటును ఆర్ బి ఐ విడుదల చేసింది.

సి బి డి సి అనేది కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీ

నగదును డిజిటల్ రూపంలోనికి మార్చుకుని వినియోగించుకునే విధానానికి వాణిజ్య బ్యాంకులు బాధ్యత వహిస్తే, సి బి డి సి చెల్లింపుల విధానానికి సంబంధించి ఆర్ బి ఐ బాధ్యత వహిస్తుంది. సి బి డి సి అనేది కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీ. ఆర్ బి ఐ బ్యాలెన్స్ సీట్లలో ఇది కనిపిస్తుంది అందరూ పౌరులు, కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు చట్టబద్ధ చెల్లింపులకు ఈ విధానాన్ని వాడుకోవచ్చు.

వాణిజ్య బ్యాంకుల నగదుతో దీన్ని మార్చుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ కి ఆదరణ పెరిగింది . ఇప్పుడున్న కరెన్సీ నోట్లకు జతగా డిజిటల్ రూపాయి వస్తుంది. అక్రమ నగదు చలామణిలు , క్రిప్టో ద్వారా సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.అయితే వాటి వల్ల మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడం వంటివి చేసే అవకాశం ఉంది. అందుకే సి బి డి సి ని అభివృద్ధి పరిచి ప్రజలకు నష్ట భయం లేని వర్చువల్ కరెన్సీని అందించడమే తమ ఉద్దేశమని ఆర్.బి.ఐ కాన్సెప్ట్ నోట్ వివరిస్తుంది. డిజిటల్ రూపాయి విధానం రావడం ద్వారా చాలావరకు మంచి ఉపయోగం ఉంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker