Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Electric Scooters: బైక్స్ కంటే ఫాస్ట్ గా అమ్ముడుపోతున్న స్కూటర్లు

గతేడాది ఏప్రిల్ జూలైలో దేశవ్యాప్తంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జులైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదయింది. అంటే 72.5% అధికం మోటార్ సైకిల్ వృద్ధికే 27% పరిమితమైంది. భారత్ లో స్కూటర్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు తెలుస్తుంది. ఈ గణాంకాలే  నిదర్శనం.

బైక్స్ కంటే ఫాస్ట్ గా అమ్ముడుపోతున్న స్కూటర్లు

తక్కువ బరువు ఉండడం సులువుగా నడపడం ఈ స్కూటర్ల యొక్క ప్రత్యేకత. నగరాలలో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్ లో గేర్ లెస్ వాహనాలే నయం అనే భావన ప్రజల్లో ఉంది. స్కూటర్ల డిజైన్ పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బ్యాటరీతో నడిచే స్కూటర్ల అమ్మకం క్రమంగా అధికంగా పెరుగుతుంది.

కంపెనీని బట్టి స్కూటర్లలో అమ్మకం15.437% వృద్ధి నమోదు చేశాయి. మోటార్ సైకిల్  కంటే ఎక్కువ అధికం ఈ ఏడాది  జూలై లో 49.79%  వాటాలతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో రీ ఎంట్రీ ఇచ్చిన బజాజ్ ఆటో 9261 యూనిట్లతో ఏకంగా 439.49% వృద్ధిని సాధించింది.

ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాదిలో ఏప్రిల్ జూలైలో మోటార్ సైకిల్  స్కూటర్స్ ఇండియా 78.39% అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 108.14% వృద్ధితో 4,08,036 యూనిట్లు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా 30.03% దూసుకెళ్లి 2,21 931 యూనిట్లతో హీరో మోటో కార్స్ 15.42% అధికమై 1,04,885 యూనిట్లు ఇండియా యమహా మోటర్ 60.32%  హెచ్చి 57,525 యూనిట్లను సాధించాయి.

క్రమంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం టూవీలర్ వాహన అమ్మకాల్లో ఈ టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్‌ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్‌ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ-టూవీలర్లు విక్రయం అయ్యాయి.

హీరో మోటోకార్ప్‌ పెట్టుబడి చేసిన ఏథర్‌ ఎనర్జీ 2022 ఏప్రిల్‌-జూలైలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 25,77,474 యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో ఈ సంఖ్య 27.07 శాతం రెట్టింపుతో 32,75,256 యూనిట్లుగా ఉంది. ఈ కాలంలో మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో బజాజ్‌ 5.53 శాతం, సుజుకీ 5.69 శాతం తిరోగమన వృద్ధి చెందాయి.

హీరో 29.31 శాతం, హోండా 55.56, టీవీఎస్‌ 13.58, యమహా 67.19, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 41.81 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా 2021-22లో భారత్‌లో 1,34,66,412 యూనిట్ల టూవీలర్ వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2025 నాటికి టూవీలర్స్‌ పరిశ్రమ దేశంలో2.49 కోట్ల యూనిట్కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker