Ola Electric Scooter: భారీ రేంజ్ లో బుకింగ్స్ అవుతున్న ఓలా స్కూటర్స్గత సంవత్సరం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎంత డిమాండ్ ఉందో అప్పటి బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది.కానీ ఈ మధ్యకాలంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల పై చాలా ఫిర్యాదులు రావడంతో, వీటికి డిమాండ్ తగ్గిందనే భావన చాలామందిలో నెలకొంది.
కానీ తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త స్కూటర్ బుకింగ్స్ చూస్తుంటే ఈ కంపెనీ స్కూటర్ డిమాండ్ తగ్గిందని కాదు పెరిగిందని చెప్పవచ్చు.ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఒక్కరోజులోనే S1 ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఏకంగా రికార్డ్ స్థాయిలో 10,000 బుకింగ్స్ నీ అందుకుంది.ఆగస్టు 2022లో ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను 99,999 రూపాయల ధరతో కంపెనీ రీలాంచ్ చేసింది.
బుకింగ్స్ అయిన స్కూటర్లను సెప్టెంబర్ 7న నాటికి డెలివరీ చేయడం మొదలుపెడతామని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించింది.Ola S1 స్కూటర్ ను ఓలా యాప్, ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.కేవలం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు 2,999 EMI కడుతూ స్కూటర్ ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ స్కూటర్ లో గత సంవత్సరం లాంచ్ అయిన స్కూటర్ లో దాదాపు అన్ని ఫీచర్లు అందించారు.
ప్రధానంగా మ్యూజిక్ ప్లే బ్యాక్, నావిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి MoveOS ఫీచర్లు కంపెనీ కొత్తగా లాంచ్ అయిన ఓలా S1 ఆఫర్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ లో MoveOS 3.0 అప్డేట్ కూడా అందించబోతుంది. లిక్విడ్ సిల్వర్, ఫోర్సీలిన్ వైట్, జెట్ బ్లాక్, కోరల్ గ్లామ్, నియోమింట్ వంటి ఐదు కలర్ ఆప్షన్స్ తో ఓలా S1 స్కూటర్ అందుబాటులో ఉంది.
3KWh లిథియం అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి రావడంతో S1కొనుగోలుదారులు అవసరాలకు తగిన వేగాన్ని అందిస్తుంది. ఓలా ప్రకారం ఈ స్కూటర్ నార్మల్ మోడ్ లో 101 కి.మీ, స్పోర్ట్స్ మోడ్ లో 90 కి.మీ, ఎకో మోడ్ లో 128 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 95 ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ ఎండ్ వేరియంట్ S1 pro ను 1,39,999 రూపాయల ధరకు కంపెనీ నిర్ణయించింది.