Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Jio 5G: జియో 5జి ఫోన్ యొక్క ప్రత్యేకతలు

గతేడాది ఫీచర్ ఫోన్ తీసుకొచ్చిన జియో,మరిన్ని హంగులతో 5జి ఫోన్ ఈ ఏడాదిలోపు జియో 5g ఫోన్ వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ధర 12 వేల నుంచి ఉండొచ్చని అంచనా వేశారు.టెలికాం దిగ్గజం రిలయన్స్ నుంచి జియో 5g ఫోన్ వస్తోంది. ఈ ఏడాదిలోపు 5g ఫోన్ తీసుకొచ్చేందుకు జియో కొత్త సంసిద్ధనాలు చేస్తుంది.

జియో 5జి ఫోన్ యొక్క ప్రత్యేకతలు

వీలైతే కొత్త ఫోన్ దసరాకి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇది ఐదు రకాల 5జి బ్యాండ్ ను సపోర్టు చేస్తుంది. దీని ధర కూడా పలు వర్గాలకు అందుబాటులో కూడా ఉంటుంది. 10వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకు ఉండొచ్చని ఓ అంచనా,ఫీచర్స్ విషయంలో జియో ఎక్కడ రాజీపడకుండ జనరేషన్ తగ్గట్టుగా కొత్త కొత్త టెక్నాలజీ తో మరియు ఫీచర్స్ తో జియో యొక్క ఫోను ద్వారా ప్రజలను ఆకర్షించుకుంటుంది.

ఇందులో ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ (ఐపీఎస్) ఎల్సిడి డిస్ ప్లే ఏర్పాటు చేయడం విశేషం. దీని యొక్క స్క్రీన్ సైజు 6.5 అంగుళాలు. ఇందులో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రవేశపెట్టారు. వెనుక భాగంలో ప్రైమరీ కెమెరా 13 ఎంపీ తో పాటు 2 ఎంపి కెమెరా ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఇస్తున్నట్లు సమాచారం. జియో 5జి ఫోన్ లో 4gb RAM 32gb ఇంటర్నల్ స్టోరేజ్ తో ఒక కొత్త వేరియంట్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇది ప్రగతి ఓ ఎస్ తో కూడా నడుస్తోంది. ప్రగతి ఓ ఎస్ ను జియో సంస్థ గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. వేగవంతమైన కార్యకలాపాల కోసం స్నాప్ డ్రాగన్ 480 5 జి ప్రాసెసర్ పొందుపరిచినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో సుదీర్ఘమైన పవర్ బ్యాక్అప్ కోసం 500mah బ్యాటరీ కలదు. జియో నెక్స్ట్ ఫీచర్ ఫోను తరహా లోనే ఇందులో జియో యాప్స్ గూగుల్ ఉచితంగా ఫోన్ తో పాటే లభిస్తాయి.ఈ ఫైవ్ జి ఫోన్లలో నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది.

భారత్ లో ఇటీవల 5g స్పెక్టమ్ వేలం నిర్వహించడం జరిగినది. అయితే మరికొన్ని నెలల్లో భారత్ లో 5జి సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జియో కూడా 5జి తో పాటు ప్రత్యర్ధులు పోటీ పడడానికి కూడా సిద్ధమవుతున్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker