Gold Price:హైదరాబాద్ లో భారీగా పెరిగిన బంగారం ధర
Gold cost in hyderabad 24k: బంగారం ధర హైదరాబాదులో బాగా పెరిగింది. వారం రోజుల ముందు కన్నా ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారు నగలకు డిమాండ్ తగ్గబోతుందని చెప్పడం విశేషం. 22 క్యారెట్ బంగారం తో పాటు 24 క్యారెట్ గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం పై రూ.700 వరకు పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ నెలలో బంగారు ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే కానీ వారం రోజులుగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో బంగారం ధరలు స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 700 పెరిగి రూ.50,680 నుంచి రూ.51, 380 ధరకు పెరగడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర పెరిగి రూ.46,450 నుంచి రూ.47,100 ధరకు పెరగడం జరిగింది.
ఈనెల ప్రారంభం నుంచి బంగారం ధరలు తగ్గుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ధరలు తగ్గడం జూలై 21 వరకే కొనసాగింది. అప్పటి నుంచి బంగారం ధరలు బాగా పెరుగుతూ వస్తున్నాయి. జూలై 21 నుంచి 22 క్యారెట్ బంగారం ధర రూ.1,100 పెరగగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.1, 200 పెరిగింది. బంగారం ధర మాత్రమే కాదు వెండి ధర కూడా బాగా పెరగడం జరిగింది. కిలో వెండి ధర రూ.1, 200 పెరిగి రూ.60,000 నుంచి రూ.61,200 వరకు పెరగడం జరిగింది.
బంగారంపై బేసిక్ ఇంపోర్ట్ టాక్స్ ను 7.5 నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. దీని కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. కానీ అనుకోని విధంగా బంగారం ధరలు బాగా తగ్గడం జరిగాయి. ఇప్పుడు బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. పండుగలు,పెళ్లిళ్లు,ఫంక్షన్స్ సీజన్,శ్రావణమాసం ప్రారంభం కావడం తో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అయితే 2002లో బంగారం నగలకు డిమాండ్ తగ్గుతుందంటూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పడం విశేషం. ఇంకా చైనాలో కోవిడ్ జీరో పాలసీ అమలవుతుండటం రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం లాంటి కారణాల వల్ల ప్రాధాన్యత తగ్గొచ్చని వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం అతిపెద్ద మార్కెట్లలో బలహీనమైన ఆర్థిక వృద్ధి కారణంగా బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గొచ్చు