Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Google Pixel 7: ప్రీ ఆర్డర్ తో ₹10,000 ఆదా

Google Pixel 7: గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ భారతదేశంలో అడుగుపెట్టింది. గూగుల్ పిక్సెల్ 7 అండ్ పిక్సెల్ 7 ప్రో విడుదలయ్యాయి. గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ అదిరిపోయే స్పెసిఫికేషన్లోనూ కలిగి ఉంది. టెన్ సర్ జి 2 లేటెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్, వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు లేటెస్ట్ కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే ₹10,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర సుమారు ₹59,999 గా ఉంది.

ఈ కామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 7 ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. అక్టోబర్ నెల 13వ తేదీన ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. లెమన్ గ్రాస్, స్నో, ఒబ్సిడియన్ కలర్ ఆప్షన్ లలో గూగుల్ పిక్సెల్ 7 అందుబాటులోకి వచ్చింది.

Google-Pixel-7
Google-Pixel 7

ప్రి- ఆడర్ కోసం గూగుల్ పిక్సెల్ సెవెన్ ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డులతో గూగుల్ పిక్సెల్స్ 7 ఫ్రీ ఆర్డర్ చేసుకుంటే ₹10,000 డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే గూగుల్ పిక్సెల్ సెవెన్ ₹49,999 కె పొందవచ్చు.

ఓపెన్ సెల్ కు వచ్చాక ₹6,000 వరకు తగ్గింపు ఉంటుందని గూగుల్ తెలిపింది. టెన్సార్ G2 పవర్ఫుల్ ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. ఒక ఈ-సిమ్ కు మరియు ఓ ఫిజికల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది.

Unboxing Pixel 7:

గూగుల్ పిక్సెల్ సెవెన్, 90Hz రిఫ్రెష్ రేట్, 6.32 అంగుళాల FHD+ AMOLED Display తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. గూగుల్ పిక్సెల్ 7 కి వెనక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా,12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి.

వీడియో కాల్ సెల్ఫీల కోసం 10.8 మేగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సినిమాటిక్ బార్లాంటి ఆధునిక కొత్త ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్లో చూడవచ్చు. జిపిఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి పోర్ట్, 5G,4G LTE, బ్లూటూత్ అండ్ WiFi 6e కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్లో 4270 mAh బ్యాటరీ ఉంది. వైర్లెస్, వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా గూగుల్ పిక్సెల్ సెవెన్ కలిగి ఉంది. బెస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ ఉంది. మూడు మైక్రోఫోన్లో, స్టీరియో స్పీకర్స్ ను కలిగి ఉంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker