Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా మిడ్ సైజ్ SUV తో వచ్చేసింది.

Maruti Suzuki Grand vitara: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరొక కొత్త కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. మిడ్ సైజ్ యు ఎస్ వి లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కొత్త గ్రాండ్ విటారాను సోమవారం విడుదల చేసింది.

దీని ధర సుమారు ₹10.45 లక్షల నుంచి ₹19.65 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు స్ట్రాంగ్ మెటల్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగి ఉన్న ఈ గ్రాండ్ విటారా మొత్తం 11 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది.

ఈ మిడ్ ఎస్ యు వి విభాగంలో మిగిలిన కంపెనీలతో పోలిస్తే మారుతి సుజుకి కాస్త వెనకబడి ఉంది. ఆ లోటును గ్రాండ్ విటారా తో పూడ్చుకోవాలని మారుతి సుజుకి కంపెనీ భావిస్తుంది. కియా సెల్తోస్, హుండాయ్ క్రెటా, టాటా హ్యరియర్ లకు ఇది గట్టి పోటీని ఇస్తుంది.

Maruti Suzuki Grand Vitara

ఇప్పటికే ఈ గ్రాండ్ విటారా మోడల్ కు 57,000 బుకింగ్స్ వచ్చినట్లు మారుతి సుజుకి ప్రకటనలో ఇచ్చింది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది.

1.5 లీటర్ ట్రీమ్స్ ధర సుమారు ₹10.45 లక్షల నుంచి ₹17.05 లక్షల వరకు ఉంటుంది. ఇది ఒక లీటర్ ఇంధనానికి 21.11 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి పేటెంట్ కలిగి ఉన్న ఆల్ గ్రూప్ టెక్నాలజీతో వస్తున్న మరో ట్రిమ్ యొక్క ధర సుమారు ₹16.89 లక్షలు ఉంటుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ తో వస్తున్న ఈ ట్రిమ్స్ ధరలు సుమారు ₹17.99 లక్షలు నుంచి ₹19.65 లక్షల వరకు ఉంటాయని కంపెనీ తెలిపింది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న 420 నెక్సా డీలర్ షిప్స్ వద్ద విక్రయించనుంది.