Mahindra XUV700: ఇండియాలో ఆటోమొబైల్ రంగంలో బాగా పుంజుకుంటుంది. చాలా కంపెనీలు ఇటీవల అత్యధిక అమ్మకాలను నమోదు చేశారు. ఇటీవల కాలంలో మహేంద్ర కార్లకు చాలా డిమాండ్ పెరిగింది. కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడల్ లలో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
మహేంద్ర కార్ల డిమాండ్ ఎలా ఉందంటే సుమారు రెండు సంవత్సరాల వెయిటింగ్ చేయవలసి వస్తుంది. ఎక్స్యువి 700, స్కార్పియో వంటి మోడల్ ఏకంగా సుమారు రెండు సంవత్సరాలు వెయిటింగ్ చేయవలసి ఉంటుంది. ఈ రెండు కార్లు ఇండియాలో చాలా ప్రాచుర్యం పొందాయి.
అయితే ఈ వెయిటింగ్ టైం అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది అని మహీంద్రా కంపెనీ పేర్కొంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా స్కార్పియో ఎన్ అదిరిపోయే లుక్, ప్రీమియం డిజైన్ తో మన అందరిని ఆకట్టుకుంది.
అంతేకాకుండా కొనుగోలుదారులకు అనుగుణంగా ఉండే విధంగా పవర్ ట్రైన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన జెడ్ 6, జెడ్ 8 వేరియంట్స్ కు అధిక డిమాండ్ ఉంది. వీటికి వెయిటింగ్ లిస్ట్ రెండు సంవత్సరాలు ఉంది.
మహేంద్ర థర్ 4X4 మాడల్ విషయానికి వస్తే కొత్త మహేంద్ర తార అనేది దేశంలో అత్యంత చవకైన ఎస్యుబీలో ఒకటి మాత్రమే కాదు, బలమైన ఆ రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఫోర్స్ గూర్ఖా వంటి ప్రత్యర్థులకు కూడా బలమైన పోటీని అందిస్తుంది.
మహేంద్ర కార్ ప్రస్తుతం పెట్రోల్ పవర్ ట్రైన్, డీజిల్ వేరియంట్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ టైం అనేది ఆధారపడి ఉంటుంది. ఆరు నెలల లేదా రెండు సంవత్సరముల అనేది ఆధారపడి ఉంటుంది.
బొలెరో అనేది ఇండియాలోనే అత్యంత ప్రజాదారణ పొందిన ఎస్సీవేళలో ఇది ఒకటి. ఇంకా బ్రాండ్ సేల్స్ వాల్యూమ్ చార్ట్ పై ఆధిపత్యం చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో బొలెరో నియో, బొలెరో కోసం వేచి ఉండే కాలం మూడు నెలలు వరకు ఉంటుంది.