Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

75th Independence Day:ఎర్రకోట లో జరిపే వేడుకల్లో ఎప్పుడు లేని విధంగా గన్ సెల్యూట్

స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను (75th INDEPENDECE DAY) ఘనంగా జరుపుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర వేడుకలలో 21 తుపాకులతో చేసే గన్ సెల్యూట్ కు(gun salute) స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఆధునిక తుపాకులను ఉపయోగించనున్నారు. ఇందుకోసం భారత రక్షణ పరిశోధన (DRDO) అభివృద్ధి చేసిన అడ్వాన్స్ టోవుడ్ ఆర్టిలేరి గన్ సిస్టం(ATGS) ఫిరంగులను ఉపయోగించినట్లు రక్షణ శాఖ  సెక్రెటరీ అజయ్ కుమార్ వెల్లడించారు.

ఎర్రకోట లో జరిపే వేడుకల్లో ఇప్పుడు లేని విధంగా గన్ సెల్యూట్
ఎర్రకోట లో జరిపే వేడుకల్లో ఇప్పుడు లేని విధంగా గన్ సెల్యూట్

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో ఎర్రకోటలో జరిగే కార్యక్రమంలో గన్ సెల్యూట్ కోసం బ్రిటిష్ ఇప్పటివరకు తుపాకులనే వాడుతున్నారు. ఈ ఏడాది మాత్రం వాటితో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ తయారుచేసిన ఏటిఏజిఎస్ తుపాకులను వాడుతామని రక్షణ కార్యదర్శి వెల్లడించారు.అయితే సాధారణంగా దేశ సరిహద్దులలో ఉపయోగించే వీటిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఉపయోగించేందుకు వీలుగా ఏటిఏజిఏస్ తూపాకులకు కొన్ని మార్పులు చేస్తున్నారు. పూణేలో డిఆర్డిఓ శాస్త్రవేత్తలతో పాటు ఉన్నతఅధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశీయంగా గాను ఆయుధాలను భారత రక్షణ శాఖ అభివృద్ధి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు భారత్ ఉపయోగిస్తున్న పాత ఫిరంగుల స్థానంలో ఆధునిక 155 ఎంఎం అర్టిలేరి తుపాకులును ఏర్పాటు చేసే ఏటి ఏజీఎస్ ప్రాజెక్ట్ కు DRDO 2013లో శ్రీకారం చుట్టింది. దీన్ని అర్టిలేరి   కంబాట్   కమాండ్ కంట్రోల్ సిస్టం ఫైర్ ప్లానింగ్ వంటి ఈ4ఐ వ్యవస్థలకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు.

అఖ్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం సులువుగా చేదించేలా  తయారు చేసిన ఈ ఏటిఏజిఎస్ తుపాకీ ప్రయోగం గతంలోనే విజయవంతంగా పూర్తయ్యాయి.మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి (NCC cadets) ఆహ్వానించామని రక్షణ శాఖ సెక్రెటరీ అజయ్ కుమార్ వెల్లడించారు. Candets తో పాటు అంగన్వాడి వర్కర్లు వీధి వ్యాపారులు ముద్ర రుణాలు పొందిన వారు మార్చురీ వర్కర్లతోపాటు రంగాలలో చేస్తున్న సేవలకు గుర్తుగా పలు విభాగాలకు  చెందిన వారిని కూడా ఆహ్వానించమన్నారు. వీరికి అదనంగా 14 దేశాలకు చెందిన 127 మంది candets ను ఈ వేడుకలకు ఆహ్వానించామని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ వెల్లడించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker