Hair growth;మీ హెయిర్ బాగా పెరగడానికి తప్పనిసరిగా చేయవలసిన పని ఇదే…
సాధారణంగా మనం మన వెంట్రుకల కోసం చాలా చాలా రకాల రెమిడిలు చేస్తూ ఉంటాం. సాధారణంగా మనం వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. వాటికోసం రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలామందికి వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
అందులో వెంట్రుకలు రాలిపోవడం మొదటిది. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం. అలాగే చుండ్రు ఎక్కువగా ఉండటం. వెంట్రుకలు రాలిపోవడం వల్ల తల పలుచబడి జడ సన్నగా అవుతుంది. ఇలా వెంట్రుకలు రాలకుండా ఉండడం కోసం, ఒత్తుగా పొడవుగా పెరగడానికి, చుండ్రు సమస్య తగ్గడానికి, అలాగే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి అనేక రకాల ప్యాక్స్ ను అప్లై చేస్తూ ఉంటారు.
చుండ్రు తగ్గిపోవడానికి, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, అలాగే వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి చక్కటి పరిష్కారం మీకు అందిస్తున్నాం.
హెయిర్ గ్రోత్ కు కావలసినవి:
మునగాకు ఒక కప్పు
మందారమాకు ఒక కప్పు
బృంగరాజ్ ఒక కప్పు (గుంటగరగరాకు)
కలబంద ముక్కలు ఒక కప్పు
తులసి ఆకులు ఒక కప్పు
వేపాకు ఒక కప్పు.
హెయిర్ గ్రోత్ కోసం కావాల్సిన పేస్టు తయారు చేయడం:
మనం తీసుకున్న మునగాకు, మందారమాకు గుంటగరగరాకు, కలబంద ముక్కలు, తులసి ఆకులు, వేపాకు అన్నిటిని శుభ్రం చేసుకోవాలి. మునగాకులో పేరడీ గ్లోస్ పిరమిడ్ అనే పదార్థం ఉంటుంది.
ఈ పదార్థం వెంట్రుకల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తలలో ఉండే చుండ్రులు కూడా తగ్గిస్తుంది. అలాగే మునగాకులో విటమిన్” e” ఉంటుంది. అందులో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల మెలోడీ అనే ద్రవం ఉంటుంది. దీనివల్ల మన వెంట్రుకలు నల్లగా మారుతాయి. కలబంద వాడడం ద్వారా వెంట్రుకలు సాఫ్ట్ గా పెరుగుతాయి.
తులసి ఆకుల రసం వెంట్రుకలు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే తలలో ఉండే ఇన్ఫెక్షన్స్ తొలగిస్తుంది. వెంట్రుకలకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది. వీటన్నింటి కంటే గుంటగరగరాకు వెంట్రుకలు ఎక్కువ చాలా బాగా పెరిగేలా ఉపయోగపడుతుంది. గుంటగరగరాకుతో నూనెలు కానీ ఫ్యాక్స్ కానీ, సిరమ్ లు కానీ తయారు చేసుకోవచ్చు.
గుంటగరగరాకును ఏ విధంగా వాడిన మంచి ఫలితాలను పొందవచ్చు. వేపాకు లో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిలో ముఖ్యంగా గుంటగరగరాకు. వేపాకు. మునగాకు మందారమాకు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వీటన్నిటినీ బాగా కడిగి మిక్సీ పట్టి పేస్టు తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నూనె పట్టించిన వెంట్రుకలకైతే అలాగే పూసుకోవచ్చు.
పొడి వెంట్రుకలకైతే అందులో కొంచెం ఏదైనా హెయిర్ ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత మనం వెంట్రుకలకు హెన్నా ను ఏ విధంగా ఉపయోగిస్తామో అదేవిధంగా పూసుకోవాలి. ఈ పేస్టును వెంట్రుకలకు మొదటి నుంచి చివరిదాకా బాగా పూసి ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి వాడాలి.
దీనిని చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా వాడవచ్చు. మగవారు కూడా ఈ ప్యాక్ ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వెంట్రుకలు నల్లగా పొడవుగా బాగా పెరుగుతాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. చుండ్రు కూడా తొలగిపోతుంది.