Plants

Hibiscus Uses in Telugu: మందారం తో ఇన్ని ఉపయోగాలా?

Hibiscus: మందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోజ్ అని అంటారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. పూలు పెద్దవిగా కనిపిస్తాయి. ఈ పూలు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. సుహాసనను కలిగి ఉండవు. మందారం పూలు చాలా రకాలుగా ఉంటాయి. తెలుపు,పసుపు ,కాషాయం ,మరియు ముద్దమందారం ,వివిధ రంగులో ఉంటాయి.

ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. సైంటిఫిక్ నేమ్ “హైబిస్కస్ రోజా సైన్సెనిస్స్ ” సాధారణ పేరు చైనా గులాబీ. సంస్కృతంలో జావా, జపా,అరుణ అని పిలుస్తారు.మరియు కరోలస్ లిన్నేయస్ అంటారు
. దీనిలో సుమారు 200-220 కు జాతులు ఉన్నాయి.

మందారం అనేది ప్రపంచంలోనే ఉష్ణ మండలం మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాలకు చెందినది. మొక్కకు సరైన సూర్య కాంతి మరియు తేమ కల్పించాలి. మొక్క పెరగడం అనేది మట్టి నాణ్యతను బట్టి ఉంటుంది. సేంద్రియ పోషకాలు కలిగిన మట్టి తీసుకోవాలి.  వేసవి కాలం మరియు వసంతకాలంలో మందారం మొక్క చాలా అనుకుగా  పెరుగుతుంది. మందారం మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. మందారం మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల శుభ సూచికంగా భావిస్తారు. ఈ మందారం మొక్కలు వివిధ కలర్లలో ఉంటాయి.

Hibiscus Uses in Telugu
Hibiscus Uses in Telugu

తెలుపు, పసుపు, కాషాయం, గులాబీ, ముద్దమందారం అనే పలురకాలుగా ఉంటాయి. వీటి మకరందాన్ని పుష్పాలు అందంగా ఉన్న కీటకాలు పక్షులు వీటిని వీటి మకరందాన్ని ఆకర్షించవు. ఈ మందారం మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మందారం పులటీలో అధికంగా ఉంటాయి. మెక్సికోలో మందార పువ్వులను మిఠాయిలలో ఉపయోగిస్తారు. కొందరు అలంకరణ కోసం వీటిని ఉపయోగిస్తారు. ఈ మొక్క జుట్టు పెరుగుదలకు మరియు చర్మ సౌందర్యం కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆనందం ,ఐశ్వర్యం కలుగుతుంది.

జీవితంలో అనేక సమస్యలను దూరం చేస్తాయి. సూర్య దోషాన్ని తొలగించడం కోసం ఈ మొక్కలను ఉపయోగిస్తారు. పిల్లల చదువుకోవడానికి కోసం ఈ మందారం పూలు ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క వివిధ భాగాలు భారత దేశంలో ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటితో జాములు, సూపులు, సాస్లను తయారు చేసుకోవచ్చు. కర్కాడే అని పానీయం తయారీలో ఈజిప్టు ప్రాంతం వారు ఈ మందారం చెట్టు పువ్వులను ఉపయోగిస్తారు. ఈ మొక్కలో విటమిన్లు ,ఖనిజాలు ,అధికంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కడుపు క్యాన్సర్ , లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడంలో కూడా ఈ మొక్కలను ఉపయోగిస్తారు. ఈ మొక్కల టీ త్రాగడం వల్ల బరువు తగ్గుతారు. ఈ మొక్కల టీలో విటమిన్c, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటీ tea తీసుకోవడం వల్ల పేగు కదలికలను క్రమబద్ధీకరణం చేస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. జుట్టు సంరక్షణలో కీలక పాత్ర వహిస్తుంది ఈ మందారం చెట్టు. మందారం పువ్వుల్ని ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి.

ఈ పొడిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో ఏర్పడే పొత్తికడుపు నొప్పి ,తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రెండు కప్పుల కొబ్బరి నూనెను తీసుకొని దానిలో రెండు చెంచాల మందారం పువ్వుల పొడిని వేసి మరిగించుకోవాలి. నూనె మరిగించుకోవడం వల్ల రంగు మారిపోతుంది. కొద్దిసేపు చల్లార్చుకుని సీసాలో వేసుకుని ప్రతిరోజు తలకు పూసుకుంటే వెంట్రుకలు నల్లగా వస్తాయి. వెంట్రుకలు నల్లగా ఉండడం కోసం ఈ మందార పువ్వుల పొడిని తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ ఆవనూనె కలిపి తలకు రాసుకోవాలి ఒక 30 నిమిషాల తర్వాత తల స్థానం తేలికపాటి షాంపుతో చేయాలి .దీనివల్ల జుట్టు నలుపు రంగులోకి వస్తుంది.

మందారం పువ్వు గురించి: మందారం పూలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. జుట్టు సంరక్షణలోనూ మరియు జుట్టును ఒత్తుగా పెరుగుదలకు మరియు దృఢంగా ఉండడానికి ఈ పూలు ఉపయోగపడతాయి. జుట్టు రాలడం మరియు చుండ్రును కూడా తగ్గిస్తాయి. చుండ్రును నివారించడంలో కూడా ఈ పూలను ఉపయోగిస్తారు. గుప్పెడు మందారమాకులను తీసుకోవాలి మరియు చెంచా మెంతులను తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా పేస్టు చేసుకోవాలి.

ఈ పేస్టుకు చెంచా పెరుగును కలిపి తలకు పట్టించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మందారం పూలు ఆహార పదార్థాలతో కూడా కలిసి తీసుకుంటారు. పిండాలు మూత్రపిండాలు ,గొంతు నొప్పి, రక్తపోటు ,శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఈ మందారం పూలను ఉపయోగిస్తారు. విటమిన్ సి ,క్యాల్షియం ,ఫైబర్ ,ఐరన్, నైట్రోజన్, ఫాస్పరస్ ,ఆక్సిలిక్ యాసిడ్, పూలలో లభిస్తాయి. హెర్బల్,టి తయారీలో కూడా వీటి పూలను ఉపయోగిస్తారు. తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. హెయిర్ ప్రాబ్లం కి ,స్కిన్ కేర్ కి విటిపూలను ఉపయోగిస్తారు. పసిఫిక్ దీవుల్లోని సలాడ్లలో వీటి రేకులను ఉపయోగిస్తారు. మెక్సికోలో,మిఠాయిలను అలంకరించడానికి వీటి పూలను ఉపయోగిస్తారు. కొన్ని వంటకాలు కూడా వీటి పూలను వాడుతారు.

Mandaram Side effects:

హైపో టెన్షన్ కలిగి ఉన్నావారు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం పై అనేక హానికరమైన ప్రభావం పడుతుంది. కొంతమంది వ్యక్తులలోగుండె దడతోపాటు, మైకము ,వికారం వంటివి కలుగుతాయి. మందారం పూలలో అధిక స్థాయిలో అల్యూమినియం ఉంటుంది. కాబట్టి మూత్రపిండ సమస్యలుగా ఉన్న రోగులు ,అదిక,
అల్యూమినియం తీసుకోవడం వల్ల హానిక కలుగుతుంది. గర్భధారణ సమయంలో పిండాభివృద్ధి మరియు నాడి సంబంధిత రుగ్మతల పై ప్రభావం చూపిస్తుంది. కొంతమంది మందారం ను ఉపయోగించడం వల్ల అలర్జీ కలుగుతుంది .అలాంటివారు హైబిస్కస్ ని వెంటనే నిలిపివేయాలి.

Hibiscus Uses in Telugu ఉపయోగాలు:

ఈరోజులలోశిరోజాల, సౌందర్య పోషణలో మందారం పువ్వులు ,ఆకులు వాడుతారు. మందారం పువ్వులను ఎక్కువగా భారతదేశంలో పూజ కోసం ఉపయోగిస్తారు.  పసిఫిక్ ద్వీపాలలో, సలాడ్లలో, మందారం పువ్వులను వేసుకొని తింటారు. మహిళలు మందారం పువ్వులు అలంకరణ కోసం ఉపయోగిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు మందార పువ్వుల టీలో పుష్కలంగా లభిస్తాయి. మరియు శరీరంలోని కణజాలాలని రక్షణ కలగజేస్తాయి.ప్రతిరోజు మందారం పువ్వుల టీ ని తీసుకోవడం వల్ల హై బీ.పీని తగ్గించుకోవచ్చు. మరియు గుండె సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చు.

మoదారం నూనె తయారీ విధానం:

మందారం హెయిర్ ఆయిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జుట్టుని దృఢంగా ఉంచేదు కు మరియుకొల్లాజేన్  ఉత్పత్తి చేయడానికి మందారం పూలను ఉపయోగిస్తారు. 8 మందారం పువ్వులు, 8 మందారం ఆకులు, ఒకలీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి, మందారం పువ్వులు మరియు మందారమాకులను తెంచుకొని బాగా నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి.కొన్ని కరేపాకు రెమ్మలు శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొన్ని మెంతులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందు తీసుకున్న  కొబ్బరి నూనెను తీసుకొని దానిని  వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేడి చేసుకోవాలి.

దానిలో కొద్దిగా కలబంద గుజ్జును ఆయిల్ లో వేసుకొని వేడి చేసుకోవాలి.కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, కరేపాకు రెమ్మలు వేసుకోవాలి.తరువాత మందారం పువ్వుల కాడలను తుంచి మందారం పువ్వులను, మరియు మందారం ఆకులనువేసుకోవాలి.చివరగా మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని అన్నింటిని కరకర లాడేటట్లు వేయించుకోవాలి.ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్ లో ఉంచి,వేడి చేసుకోవాలి. తర్వాత చల్లబడిన ఆయిల్ ను ఒక గాజు సీసాలో లేదా డబ్బాల వేసుకొని నిలువ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకు రాసుకొని 30 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

30నిమిషాల తరువాత తేలిక పాటీ షాంపుతోతలస్నానం చేయాలి. ఇలా తయారు చేసుకున్న మందారం నూనె జుట్టుకు చాలా మేలును కలగజేస్తుంది. ఈ మందారం నూనెలో క్యాల్షియం, భాస్వరం ,మరియు ఇనుము ,వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. మరియు కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల జుట్టు రాలరాన్ని తగ్గిస్తుంది. చుండ్రును తొలగించడంలో కూడా మందారం పూలు ఉపయోగిస్తారు. మందారం పేస్టు జుట్టుకు పట్టించుకోవడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

టీ గురించి:

మందారం ఆకులతో తయారు చేసిన టీ ని వివిధ దేశాలలో ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. మరియు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సహజ మూత్రవిసర్జన జరగడానికి సహాయం కోసం షుగర్ వేసుకోకుండా దీనిని ఉపయోగిస్తారు. మానసిక స్థితిమెరుగుపరచడం కోసం మరియు డిప్రెషన్ నుండి కోల్పోకోవడం కోసo ఈ మందారం టీ ని ఉపయోగిస్తారు. మందారం ఆకుల టీ చెడు కొలెస్ట్రాల్ సాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మoదరం ఆకుల టీ తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గు తగ్గడానికి ఉపయోగిస్తారు.

మందారమాకుల టీ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మందారమాకుల టీ తీసుకోవడం వల్ల జలుబు తొందరగా తగ్గుతుంది. మందారమాకులలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మందారమాకుల టీ తాగడం వల్ల కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఈ ఆకుల టీ తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలో తగ్గించడంలో మహిళలకు ఉపయోగపడుతుంది.  రక్తపోటునుతగ్గించడం కోసం ఈ ఆకుల టీం ని తీసుకుంటారు.

టీ ని తయారు చేయడానికి ముందుగా కొన్ని మందారం పువ్వులను తీసుకోవాలి.తర్వాత 2గ్లాసు లనీటిని బాగా మరిగించుకోవాలి. అలాగే మరిగించుకున్న నీటిలో కాడాను తీసివేసి మందార పువ్వులను వేసుకోవాలి. తరువాత నాలుగు పుదిన ఆకులను వేసుకోవాలి. ఒక ఇంచు అల్లం ముక్కను కట్ చేసి వేసుకోవాలి.చివరగా స్టౌ బంద్ చేసి చెక్క ముక్కను వేసుకోవాలి.కొద్దిగా చల్లార్చిన తర్వాత ఒక స్పూన్ నిమ్మకాయ రసం మరియు ఒక స్పూన్ తేనె కలుపుకొని మందారమాకుల టీ ని వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్ వేసుకొని త్రాగాలి.

దీనినిహైబిస్కస్ హెర్బల్ టీ అంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి కలిగి ఉంటాయి. ఆఫ్రికాలో  హైబిస్కస్,హెర్బల్ టీ ని ఉపయోగిస్తారు. హైబిస్కస్ హెర్బల్tea ప్రతిరోజు త్రాగడం వల్ల శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ,రక్తపోటు ,డయాబెటిస్, మూతపిండాలు ,గొంతుకు సంబంధించిన వ్యాధులకు దూరం చేస్తుంది. పొడిబారిన ,చిక్కుబడే జుట్టు కోసం ,హైబిస్కస్ కషాయాలను కలిగిన కండిషన్లు వాడడం వల్ల జుట్టు సున్నితంగా ,మృద్ధువుగా, తయారవుతుంది.

నష్టాలు:

తక్కువ రక్తపోటు కలిగి ఉన్న వ్యక్తులు హాబిస్కస్ ను సేవించడం ద్వారా అది వారి ఆరోగ్యం పై అనేక హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది .కొంతమంది వ్యక్తుల్లో గుండె దడతో పాటు ,మైకము ,వికారం వంటి కలుగుతాయి . మందారం పువ్వులలో అధిక స్థాయిలో అల్యూమినియం కంటెంట్ కలిగి ఉంటుంది. కాబట్టి మూత్రపిండా సమస్యలు ఉన్నవారు అధికoగా తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో పిండాభివృద్ధి మరియు నాడీ సంబంధిత రుగ్మతలపై ప్రభావాన్ని కలిగిస్తుంది. కొందరు హైబిస్కస్ తీసుకోవడం వల్ల ఎలర్జీలను కలిగిస్తుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button