Honda Activa 7G: టీజర్ రిలీజ్ చేసిన హోండా
హోండా మోటర్ బైక్ సంస్థ భారతీయ మార్కెట్లో కి కొత్త అప్డేట్ తో యాక్టివా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ఒక కూడా విడుదలయ్యింది. ఆ సమయంలో హోండా సంస్థ దీని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
అంతేకాకుండా ఇప్పుడు దీనికి సంబంధించిన మరొకటి కూడా విడుదల చేయడం జరిగింది. ఉన్న సంస్థ దీని గురించి విడుదల చేసిన కొత్త టీజర్ ప్రకారంగా ఇది రాబోయే యాక్టివా 7జి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
దీని గురించి ఎటువంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఇందులో కొత్త కలర్ ఆప్షన్ లో కూడా వచ్చే అవకాశం ఉందని ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. హోండా మోటార్ బైక్ యొక్క ప్రముఖమైన స్కూటర్ మోడల్ అయినటువంటి యాక్టివా ఇప్పుడు మరిన్ని అప్డేట్లతో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధం చేయబడుతుంది.
ఈ యాక్టివా ప్రియులను ఆకటుకునే విధంగా ఉంటుంది. త్వరలోనే అధికారకంగా యాక్టివా యొక్క సమాచారాన్ని వెల్లడి చేస్తారు. హోండా యాక్టివా అనేది 6G 2020 సంవత్సరం జనవరి నెలలో మార్కెట్లో ప్రవేశపెట్టారు.
ఆ సమయంలోనే యాక్టివా 6G ఆధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఈ వీరియంట్ మళ్ళీ అప్డేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్లో హోండా యాక్టివా అనేది రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది.
ఇవి హోండా యాక్టివా 125 మరియు హోండా యాక్టివా 6జి ఈ రెండు వినియోగదారులను ఆకట్టుకొని మంచి అమ్మకాలతో దూసుకెళ్తుంది. హోండా మోటార్ బైక్ కొత్త యాక్టివా స్కూటర్ ని మరిన్ని అప్డేట్లు ఆధునిక ఫీచర్లతో విడుదల చేసే అవకాశం ఉంది అని అంచనా.
ఇప్పటికీ భారతీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ వాహనాలను అప్డేట్ ఫీచర్లతో చేస్తున్నారు అదేవిధంగా హోండా కూడా తమ కస్టమర్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే హోండా యాక్టివా ప్రియులకు రానున్న రోజుల్లో అప్డేట్ యాక్టివాను ఉపయోగించే అవకాశం ఉంది. హోండా యాక్టివా 6జి ఇంజన్ సిసి 109.
ఇది ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. హోండా యాక్టివా 125 ఇంజన్ సిసి 124. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ యొక్క గరిష్ట శక్తి 8.18 బిహెచ్పి, దీని యొక్క గరిష్ట టార్కు 10.3 nm ను ఉత్పత్తి చేస్తుంది. కావున ఇది మంచి పనితీరును కనపరుస్తుంది.
హోండా యాక్టివాలో తొలిసారిగా సాధారణ స్టార్ట్ కు బదులుగా సైలెంట్ ఏసీజి స్టార్టర్ ఉపయోగిస్తుంది. హోండా యాక్టివా 6g భారతీయ మార్కెట్లో ఆరు వేరువేరు రంగులలో అందుబాటులో ఉంది. హోండా యాక్టివా 125 మాత్రం ఐదు వేరువేరు రంగులలో ఉంది.
రాబోయే యాక్టివా కొత్త స్కూటర్ ఎన్ని రంగులలో ఉంటుందో అనేది ఇంకా వెల్లడిపరచలేదు. అయితే ఇది ఇలా ఉండగా హోండా మోటార్ బైక్ కంపెనీ తమ యాక్టివా స్కూటర్ ని ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుందని సమాచారం.
హోండా యాక్టివా కంపెనీ 2023లో ఎలక్ట్రిక్ వేరియంట్ లో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంటుకు సంబంధించిన వివరాలు కంపెనీ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా తెలిపారు.