Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Imran khan:పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల దాడి

Imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్, ఇమ్రాన్ ఖాన్ పై ఈరోజు కాల్పులు జరిగాయి. ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో జరిగిన ర్యాలీపై కాల్పులు జరిపిన సంఘటనలో ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ గాయపడి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

అతని కాలికి బుల్లెట్ తగలడంతో గాయమైంది. ఈయన పార్టీ ఈ దాడిని ఇమ్రాన్ ఖాన్ పై చేసిన హత్య ప్రయత్నం గా అభివర్ణించింది. ఈయన 2018 వ సంవత్సరంలో ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత తన నాయకత్వాన్ని సహచరులకు అప్పగించడం జరిగింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల దాడి
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల దాడి

సైన్యంపై విశ్వాసం కోల్పోయి ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలగిన ఏడు నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. పదవి నుంచి తొలగిపోయిన తర్వాత ఈయన సైన్యం మరియు ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐ ఎస్ ఐ జోక్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని సైన్యము, ఐఎస్ఐ దెబ్బతీస్తున్నాయని ఈయన ఆరోపించడం జరిగింది.

ఈరోజు జరిగిన ఈ కాల్పులపై పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ కాల్పులను పూర్తిగా ఖండించారు. ఈ సంఘటనపై పోలీసులను, స్థానిక పరిపాలన నుండి వెంటనే నివేదిక కోరాలని అంతర్గత మంత్రి రాణా సన్నావుల్లాను ఆదేశించారు.

గుజ్రాన్ వాలా పట్టణంలోని రిసెప్షన్ క్యాంపుకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగినట్లు స్థానిక న్యూస్ చానల్స్ వెల్లడించాయి. లాంగ్ మార్చ్ లో పాల్గొన్న సమయంలో అతనిపై కాల్పులు జరిగినట్లు తెలిసింది.ఈ సంఘటన జఫరాలిఖాన్ చౌక వద్ద జరిగింది. ఈ కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ కాల్పుల్లో మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాలుకి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే కట్టు కట్టి ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈయన ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఈ ఘటనను తనను హత్యాయత్నం చేసే ప్రయత్నం గా అభివర్ణించింది. ఈయన పదవి నుంచి తొలగిపోయిన ఏడు నెలల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker