Karthika masam: కార్తీకమాసం 2022. ఈ తేదీ నుండి: సోమవారం, 10 అక్టోబర్ ఈ తేదీ వరకు: మంగళవారం, 8 నవంబర్. ధర్మరాజు ప్రశ్న ప్రతిష్టించిన నిమ్మచెట్టు శివలింగం.
కార్తీక మాసం అంటేనే శివునికి విష్ణువుకి ఎంతో ప్రీతి. నెల మొత్తం పూజలు చేసి, పాప పరిహారం చేసుకునేది ఈ కార్తీకమాసంలోనే. అలాంటి కార్తీక మాసంలో శివ భక్తులు మాల ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తిక స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. వీళ్లే కాక హిందువులలోని ఆడవారు కూడా కార్తీక మాసాలలో కార్తీక్ స్నానాలు ఆచరించి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో వేడుకుంటారు. ఈ మాసంలో చాలామంది భక్తులు శివాలయాలు దర్శించి, పుణ్యస్నానాలు చేసి పాప పరిహారం చేసుకుంటారు.
అలా సందర్శించే ఆలయాలలో స్వయంగా ధర్మారాజు నిమ్మచెట్టుతో శివలిగం చేసి ప్రతిష్టించిన నిమ్మచెట్టు శివలింగాన్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ఇదొక్కటే కాక చాలా ప్రత్యేకతలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనదేశంలో పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందినవి కొన్ని అయితే, ప్రసిద్ధి చెందినవి చాలానే ఉన్నాయి. ఇక పోతే ఆంధ్రప్రదేశ్లో చాలా పురాతన ఆలయాలు ఉన్నా, వాటి ప్రత్యేకత తెలియక చాలామంది దర్శించుకోవడానికి వెళ్లకుండా ఉన్న వాటిలో జగన్నాథ గట్టు ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని నిర్మించడం వెనక చాలా పెద్ద కథ ఉంది. అంతేకాకుండా కార్తీకమాసంలో తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఈ జగన్నాథ గట్టు శివాలయం.
జగన్నాథ గట్టు శివాలయం:
ఈ ఆలయం కర్నూల్లోని బి తాండ్రపాడు లో ఒక ఎత్తైన కొండపైన ఉంది. కర్నూలు నుండి నంద్యాలకు వెళ్లేదారిలో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల దాటగానే ఈ కొండకు వెళ్లే దారి ఉంది. ఆ ఆలయంలో లింగానికి ఉన్న చరిత్ర వలన ఈ జగన్నాథ గట్టు ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవులలో ఒకడైన భీముడు తీసుకొని వచ్చాడని పురాణ కథల ద్వారా తెలుస్తుంది. ఈ శివలింగం ఎత్తు ఆరడుగులు రెండు అడుగుల వెడల్పుతో ఉంటుంది.
జగన్నాథ గట్టు శివాలయం ప్రాముఖ్యత:
జగన్నాథ గట్టు ఆలయానికి సుమారు 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సంగమేశ్వర ఆలయాలలోని రూపాల సంగమేశ్వర ఆలయం ఇక్కడికి తరలించడంతో ఈ కొండపై ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొండమీద శివాలయం గురించి ఇప్పటికి చాలామందికి తెలియదు. ఇక్కడ శివాలయం నిర్మించడానికి ఆధారం గల కథ తెలుసుకుందాం.
పూర్వం పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన జూదంలో పాండవులు ఓడిపోయి రాజ్యాన్నంత కౌరవులకు అప్పగించి, అరణ్యవాసం వెళ్లారు. ఇలా పాండవులు శ్రీశైలం వెళ్లే దారిలో 7 నదులు కలిసిన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ, ఇక్కడ సప్త నదులు కలిసే ప్రాంతం సంగమేశ్వరం కాబట్టి, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకుని భీముడిని శివలింగాన్ని తీసుకొని రమ్మని చెప్పి కాశీకి పంపుతాడు ధర్మరాజు. అనుకున్న సమయానికి భీముడు రాకపోయేసరికి, విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి ధర్మరాజు నిమ్మ చెట్టుతో ఒక శివలింగాన్ని తయారుచేసి అక్కడ ప్రతిష్టించాడని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత భీముడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని తీసుకొని రాగానే, దానిని కూడా ఇక్కడే ప్రతిష్టించాడు. కాలక్రమేనా సంగమేశ్వరంలో ఉండే రెండు శివలింగాలలో ఒకటి అయిన రూపాల సంగమేశ్వర ఆలయం జగన్నాథ కట్టుకు తరలించడంతో, సంగమేశ్వరంలో ఉండాల్సిన రెండిటిలో, ఒకటి సంగమేశ్వరంలో, మరొకటి జగన్నాథ గట్టులో ఉన్నాయి. ఇంతటి చరిత్ర ఉన్న ఈ జగన్నాథ గట్టు ఆలయం చరిత్ర ఇప్పటివరకు చాలామందికి తెలియదు.
ఆలయం విశేషాలు:
ఆలయంలో పలికి వెళ్ళగానే నటరాజు ఆనందతాండవం చేస్తున్నా శివుని శిల్పాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఆలయ గోపురానికి రెండు వైపులా ఉన్న శిల్పకళలు అందరినీ ఆచర్యపరుస్తాయి. ఈ గుడి లోపల కి వెళ్లే ముందు పెద్ద బసవేశ్వరుడి విగ్రహం, అలాగే గుడి లోపల ఆవరణంలో ఆదిశేషుడు పడగలు విప్పిన విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆలయంలో చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దీని వలన మనసుకి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అదేవిధంగా గుడిని సందర్శించడానికి వచ్చినవారు కూర్చోవడానికి ఆలయ అధికారాలు అధికారులు అన్ని సదుపాయాలు చేశారు.
జగన్నాథ గట్టు దగ్గర చూడవలసిన ప్రదేశాలు:
శివాలయానికి దగ్గరలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఆలయానికి వెనుక కొంత దూరంలో ఉంది. ఈ విగ్రహం 50 అడుగుల ఎత్తైనది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కర్నూలు నగరం అంతా కనిపిస్తుంది. అంతేకాకుండా బెంగళూరు, హైదరాబాద్ నేషనల్ హైవే చాలా బాగా కనిపిస్తుంది. ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్లే దారిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ కూడా ఉంది. ఈ ఆలయానికి రావడానికి కర్నూలు నుంచి బస్సు సౌకర్యం ఉంది. అదేవిధంగా కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి దారి ఉంది. ఈ రైల్వేస్టేషన్ ద్వారా కూడా జగన్నాథ కట్టు ఆలయానికి వెళ్ళవచ్చు.