Srisailam:Karthika Masam 2022: శ్రీశైలంలో మొదలైన కార్తీక మాసం శోభ.
దీపావళి మరుసటినాడు వచ్చే శరదృతువులో పాడ్యమి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనది. మాసం అంటే నెల. కార్తీక మాసం ఒక నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు చాలా మంచి రోజులుగా భావించి, శివకేశవులకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ కార్తీకమాసం శివునికి, విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.
అందువలన ఈ మాసంలో శివకేశవులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేయాలనుకునేవారు, శివుని మాల కాని, వైష్ణవమాల కానీ ధరించేవారు, నదులలో పుణ్యస్నానాలు ఆచరించాలి అనుకునేవారు, నోములు నోచేవారు, ఇలా చాలామంది హిందువులు ఈ కార్తీకమాసం కోసం ఎదురు చూస్తుంటారు. 26వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీకమాస శోభ మొదలయ్యింది. ఈ కార్తీకమాసంలో నది స్థానాలు చేస్తే ,ఎంతో పుణ్యం వస్తుంది.
కార్తీక స్నానాలు ఎలా చేయాలి?
వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తీర్థయాత్రలకు వెళ్లేవారు, మాలను స్వీకరించేవారు, నది తీరాల్లో పవిత్ర స్నానాలను ఆచరించాలి అనుకునేవారు, నోములకు, ఏదైనా మంచి పని ప్రారంభించాలి అనుకునేవారు, వ్యాపారంలో ముందడుగు వేయాలని అనుకునేవారు, అలాంటి చాలా మంది ఈ కార్తిక మాసం కోసం ఎదురుచూస్తారు. ఈ కార్తీకమాసంలో మహిళలు భక్తితో పూజలు చేస్తూ, దేవాలయాలలో, ఇంటి గుమ్మాల దగ్గర కార్తీకదీపం ఉంచుతారు. 26వ తేదీ నుండి ప్రారంభమైన కార్తీక మాసం, నవంబర్ 23వ తేదీ వరకు, కార్తీక పౌర్ణమి తో పూర్తవుతుంది.
ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల వారికి కార్తీకమాసం అంటే, ముందుగా గుర్తు వచ్చేది, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇది శ్రీశైలంలో ఉంది. ప్రస్తుతం శ్రీశైలం కార్తీక శోభ ప్రారంభమైంది.
శ్రీశైలంలో 26 నుంచి నవంబర్ 23 వరకు జరిగే కార్తీక మాసం ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ ఉత్సవాలను చూడటానికి, అదేవిధంగా కార్తీకమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకునేవారు, చాలామంది భక్తులు ప్రపంచం మొత్తం నుంచి వస్తూ ఉంటారు. అందువలన కార్తీకమాసంలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
ఆలయం ఈఓ లవన్న అద్యక్షంలో అధికారులు భక్తులకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. స్వామివారి సన్నిధిలోని నాగుల కట్టా ప్రాంగణం వద్ద ప్రతిసారి దీపారాధనలు చేసేవారు. అయితే ఈ ఏడాది నాగుల కట్ట వద్ద దీపారాధనను రద్దుచేసి, ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉన్న ఉత్తరం మాడవీధులలో భక్తులు దీపారాధనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా వారి సౌకర్యం కోసం అనేక ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా శ్రీశైలంలో ఉన్న అనేక ఆలయాలు కూడా ఎంతో విశిష్టమైనవి. అలాగే శ్రీశైలం లో ఉన్న శివాజీ ఆలయం, మల్లమ్మ కన్నీరు, పాలధార పంచదార, హటకేశ్వరం, చెంచులక్ష్మి మ్యూజియం, రుద్ర పార్క్, ఇవేకాక చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.