ఒక యువతి జీవితాన్ని నిలబెట్టిన స్పందన ఫిర్యాదు

ఒక యువతి జీవితాన్ని నిలబెట్టిన స్పందన ఫిర్యాదు

జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పందనతో ఒక యువతికి సరైన సమయంలో న్యాయం

జిల్లా పోలీసు ఉన్నతాధికుల చొరవతో ఒక్కటైన ప్రేమ జంట

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నఒక కానిస్టేబుల్, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు బాగానే సాగింది. కానీ కానిస్టేబుల్ కు మరో డబ్బున్న యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో కానిస్టేబుల్ ఆ యువతిని దూరం పెడుతూ వచ్చాడు. అయితే ఆ యువతి నేరుగా జిల్లా ఎస్పీ వద్దకు వచ్చి స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఫక్కీరప్ప వెంటనే స్పందించి.. కానిస్టేబుల్ తీరు మార్చుకునేలా చర్యలు చేపట్టారు.

అయితే ఆ కానిస్టేబుల్ తిరుపతి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సరిగ్గా తిరుపతికి వెళ్తుండగా ఆ యువతికి సమాచారం అందింది. వెంటనే ఆ యువతి జిల్లా ఎస్పీ వద్దకు వచ్చి పరిస్థితి వివరించింది. చివరి క్షణంలో ఆ కానిస్టేబుల్ కు జిల్లా ఎస్పీ చొరవ కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతే కాకుండా కొందరు పెద్దల సమక్షంలో కసాపురంలో పెళ్లి కూడా చేశారు. దీంతో ఆ ప్రేమ సుఖాంతమైంది. ఇక్కడ గమనించాల్సింది… జిల్లా ఎస్పీ చొరవ గురించి. బాధిత యువతి ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించారు. ఆయన అలా స్పందించడం వలనే యువతి జీవితం నిలబడింది. జిల్లాలో జరుగుతున్న స్పందనలో ఇచ్చే ఫిర్యాదులకు ఎంత స్పందన ఉంటుందో ఇదొక ఉదాహరణ…

Show More

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker