Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Lulu mall: లులు మాల్ కి పోటెత్తిన జనం

Lulu mall: పేద ధనిక తేడా లేకుండా ఒక్కసారిగా ఈ మాల్ లో జనాలు పోటెత్తారు. దీనికి కారణం ఆ మాల్ 50% డిస్కౌంట్ ప్రకటించడం. అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజామున వరకే ఈ ఆఫర్ ఉంటుందని తెలపడంతో జనాలు ఒక్కసారిగా మాల్ పైకి ఎగబడ్డారు.ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్. దీని ప్రధాన కార్యాలయం అబుదాబి నగరంలో కలదు. ఈ షాపింగ్ మాల్ 34 దేశాల్లో తమ యొక్క శాఖలను కలిగి ఉంది. ఈ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మశ్రీ యూసుఫ్ అలీ గారు.

ఈ మాల్ ఆరబ్ దేశాలలోమిక్కిలి ప్రసిద్ధి చెంది ఫోర్బ్స్ టాప్ 100 కంపెనీలలో లులు గ్రూప్ మూడో స్థానంలో నిలిచింది. ఈ లులూ మాల్ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో సుమారు 9 సంవత్సరంల కింద తమ యొక్క కార్యకలాపం ప్రారంభించింది.

ఈ షాపింగ్ మాల్ ద్వారా ద్విచక్ర వాహనాలు,కార్లు మొదలైనటువంటి విదేశీ బ్రాండ్ల వస్తువులను, సరుకులను, దుస్తులను నాణ్యతతో అందిస్తుంది .   మాల్ లో సందర్శకులకు, కొనువారికి ఆటవిడుపుగా ఐస్ స్కేటింగ్ రింక్ లాంటివి, వినోద సవారీలు, మాల్ యొక్క పార్కింగ్ స్థలం అత్యాధునిక ఆటోమేటిక్ పార్కింగ్ గైడ్ అండ్ సిస్టం కలిగి ఉంది ఇక భారతదేశంలో త్రివేండ్రం, లక్నో, బెంగళూరులలో ఈ మాల్స్ ప్రారంభించడం జరిగింది.

ఈ మాల్స్ లో జులై ఒకటి 2002 నుండి జూలై  20 2022 వరకు ఫ్యాషన్ ఎలక్ట్రానిక్ గ్రోసరీస్ మరియు నిత్య అవసర వస్తువులు అన్నియు కూడా 50%  ఆఫర్ ను ప్రకటించడం అయింది

Rs 3600 విలువచేసే వస్తువులు కొంటే ఫ్రీ గిఫ్ట్ ఓచర్ Rs 3600  ఓచర్ లభిస్తుంది. మాల్ సాధారణ సమయాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker