Mahindra Atom Ev: 4 వేరియంట్స్ ఇవే
Mahindra Atom Ev: మహేంద్ర కంపెనీ చిన్న ఎలక్ట్రికల్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ మహేంద్ర ఆటమ్ అనే పేరుతో వస్తుంది. మహేంద్ర కంపెనీ చిన్న ఎలక్ట్రిక్ కారును త్వరలోనే విడుదల చేయనుంది.
సంస్థలలో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న మహేంద్ర 2020 ఆటో ఎక్స్పోల్ ఈ కారును ప్రదర్శించింది. కోవిడ్ 19 కారణంగా ఈ కారు ఆవిష్కరణ కొంత ఆలస్యం అవుతుంది. అయితే త్వరలోనే కంపెనీ ఈ వాహనాన్ని తీసుకువస్తుంది.
మహీంద్రా ఆటమ్ మార్కెట్లోకి వస్తే భారతదేశంలో ఫ్రిస్ట్ ఎలక్ట్రిక్ క్వాడ్రి సైకిల్ ఇదే అవుతుంది. ఇటీవలనే ఈ వాహనానికి అప్రూవల్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఓల్డ్ సర్టిఫికెట్స్ పరంగా చూస్తే ఈ వాహనాన్ని నాన్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఉంచారు.
అయితే ఈ వాహనాన్ని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విభాగం లోకి తెచ్చారు. మహీంద్రా ఆటమ్ కారు నాలుగు వేరియంట్ లలో వస్తుంది. ఈ వేరియన్లలో కేవలం కే1, కే 2, కే 3, కే 4, అనే వేరియంట్ లు ఉన్నాయి. కే 1, కే 2 వేరియంట్లలో 7.4 kWh, 144 Ah బ్యాటరీ తో వస్తాయి.
అదేవిదంగా మహీంద్రా ఆటమ్ కే 3, కే 4 వేరియంట్ లలో 11.1kWh, 216 Ah బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది. కే 1, కే 2 వేరియంట్లను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 78km నుండి 80km రేంజ్ ను అందిస్తుంది.
కే 3, కే 4 వేరియంట్ లు అయితే సింగిల్ చార్జీలో 100 Km ల రేంజ్ ను అందిస్తాయి. కే 1, కే 3 ఎయిర్ కండిషన్ ఫీచర్లతో మార్కెట్లోకి రావచ్చు, నాన్ ఏసి వేరియంట్ వల్లన ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
హెడ్ ల్యాంప్స్, పెద్ద స్క్రీన్, యూనిక్యూ గ్రిల్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే ఫ్రంట్ విండో కూడా పెద్దదిగా ఉంది, ఈ కారు చూడడానికి చిన్నగా ఉన్న 4 సీట్లు ఉంటాయి వాణిజ్య అవసరాల కోసం ఈ వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు.
మహీంద్రా నుంచి రానున్న ఆటో చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రారంభం 3 లక్షలు ఉంటుంది. కస్టమర్ మార్కెట్లో దీనికి పోటీ ఇచ్చి వాహనాలు లేవు. భవిష్యత్తులో ఏ కంపెనీ అయినా ఇలాంటి వాహనాలను తీసుకొస్తుందేమో చూడాలి.
బజాజ్ కంపెనీ పోటీగా వాహనాన్ని తీసుకురావచ్చు. కాగా మరోవైపు మహేంద్ర అండ్ మహేంద్ర కార్లకు మార్కెట్లో ఇప్పుడు ఫుల్ డిమాండ్ కూడా ఉంది. కొత్త స్కార్పియో, ఎక్స్యువి 700 వంటి మోడల్స్ విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. వేటి వేటి పీరియడ్ కూడా ఏకంగా రెండు సంవత్సరాలు వరకు ఉంది. అంటే వీటి డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.