Mercedes Benz EQE : భారత దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా!
Mercedes Benz EQE : ఎప్పుడు భారతదేశంలోకి వస్తుందో తెలుసా!. Mercedes-Benz EQE సెలూన్ అనే కారు భారతదేశంలో 2022 చివరలో లేదా 2023లో ప్రారంభించబడుతుంది. ప్రస్తుతానికిMercedes-Benz EQE గురించి కొన్ని వివరాలు మాత్రమే విడుదల చేశారు. అంతేకాకుండా స్టార్టర్స్ కోసం వచ్చే సంవత్సరంలో రియల్ వీల్ డ్రైవ్ ఈక్ 350 వస్తుంది. అదేవిధంగా త్వరలోనే ఆల్ వీల్ డ్రైవ్,AMG మోడల్స్ ను కూడా తీసుకురానుంది.EQE 350, Mercedes-Benz EQE 90 KWH బ్యాటరీ ఉంది. దీని యొక్క శక్తి288bhp ఉంది.
దీని యొక్క టార్క్ 530nm ఉత్పత్తి చేస్తుంది. దీనిలో సింగిల్ మోటార్ ను అందించారు. అదేవిధంగా WLTP ప్రకారం EQE ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 660 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 170KW వరకు వేగంగా చార్జ్ అవుతుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ప్లగ్ ఉంది. దీని యొక్క ఎలక్ట్రిక్ మోటార్ ను క్లైమ్ అయిన 35 నిమిషాలలో 10 శాతం నుండి 80 శాతం వరకు టాప్ అప్ చేయగలుగుతుంది.
EQE సెలూన్ యొక్క ఎక్కువ పని తీరు గల వర్షన్ 671bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు అని కంపెనీ నివేదిక తెలుపుతుంది. Mercedes-Benz EQE ఇది ఏయిర్ కంట్రోల్ మరియు ఫ్యూచర్ వాతావరణానికి అనుగుణంగా ఉండటానికి సహాయపడుతుంది. బయట నుండి వచ్చి దుమ్ము ధూళి కలుషితమైన గాలిని ఫిల్టర్ చేస్తుంది. అంతేకాకుండా వైరస్,బ్యాక్టీరియాలను తగ్గించుటలో ఇది సహాయపడుతుంది. ఇది 10 శాతం నుండి 100% చార్జ్ చేయడానికి 9.5 గంటల సమయం పడుతుంది.
దీనికి DC ఫాస్ట్ ఛార్జింగ్ 170kw కూడా ఉంది. దీనిలో 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. దీని యొక్క విలువ 70 లక్షల నుండి 90 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇది భారతదేశంలో తాత్కాలికంగా ఏప్రిల్ 2023 లో ప్రారంభిస్తుంది. ఇది ఎరుపు మరియు తెలుపు రంగులలో వస్తుంది. ఇది ఆటోమేటిక్ గేర్ తో వస్తుంది. దీనిలో విండోస్ వంటి కంట్రోల్స్ అన్ని డ్రైవర్ దగ్గర ఉంటాయి.