Money savings tips: తక్కువ ఫండ్స్ తో ఎక్కువ డబ్బును పొందగలిగే మార్గాలు ఇవే!
Money savings tips: తక్కువ ఫండ్స్ తో ఎక్కువ డబ్బును పొందగలిగే మార్గాలు ఇవే!
కోటీశ్వరులు కాకపోయినా కనీసం అవసరాలన్నీ తీర్చుకోవాలని సంతోషంగా ఆనందంగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు అయితే ఇలాంటి కలలు చాలానే కట్టారు. అలాంటి వారికి ఒక చిన్న ఉపాయం. మీ దగ్గర లక్షలకు లక్షలు లేకపోయినా, మీరు ఈ ఆలోచన ప్రకారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మీరు కన్న కలలను నెరవేర్చుకోవచ్చు. దీనికోసం ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. డబ్బు ఖర్చు చేయడం, అలాగే పొదుపు చేయడంలో మనం క్రమశిక్షణగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఒక కోటి వరకు డబ్బును కూడా పెట్టుకోవచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్:
డబ్బును కూడా పెట్టడానికి డబ్బు తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స వచ్చేలా చూసుకోవాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రాబట్టొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ లో వడ్డీ శాతం ఆరు శాతం ,నుండి 10 శాతం వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ శాతం ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా డబ్బులు ఎక్కువగా పొదుపు చేయవచ్చు. మీరు పెట్టిన దానికన్నా సగం ఎక్కువ డబ్బు తిరిగి పొందవచ్చు.
స్టాక్ మార్కెట్:
ప్రస్తుతం బాగా రన్ అవుతూ, రిస్క్ ఉన్నప్పటికీ లాభాల పంట పండించేది స్టాక్ మార్కెట్ ఒక్కటే. ఎందుకంటే అందులో షేర్స్ ను తక్కువలో ఉన్నప్పుడు తీసుకొని, దానిని గమనిస్తూ మీ డబ్బుకు తగ్గ ప్రతిఫలం రాగానే అమ్మి, వాటి ద్వారా పొదుపు చేయవచ్చు. దీనివల్ల ఖర్చు లేకుండా మీ డబ్బు మీకు వస్తుంది. అలాగే ప్రాఫిట్ కూడా పొందవచ్చు.
రియల్ ఎస్టేట్:
గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటి ద్వారా కూడా డబ్బులు చాలా బాగానే కూడా పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ద్వారా పెట్టుబడి పెట్టి మీరు ఆశించిన లాభం రాగానే, అమ్ముకోవడం వల్ల కూడా మీరు డబ్బులు చాలా తొందరగా, ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్:
మన డబ్బును ప్రతినెలా పొదుపు చేయడానికి చాలా ఆప్షన్లో ఉంటాయి. అందులో ఎక్కువగా రికరింగ్ డిపాజిట్, మరియు మ్యూచువల్ ఫండ్స్ వంటి ఉంటాయి. రికరింగ్ డిపాజిట్ లో తక్కువ శాతమే వడ్డీ రేట్లు ఉండి, తక్కువ డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన మ్యూచువల్ ఫండ్లో 15% వడ్డీలు ఇచ్చే ఫండ్ ను ఎంచుకోవాలి. ఈ విధంగా ఎక్కువే వడ్డీ శాతం ఉన్న ఫండ్ ద్వారా మీరు తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ ఎంత డబ్బు రిటర్న్స్ ఇస్తుందో అంచనా వేయలేము. అయితే ఎక్కువ వడ్డీ శాతం ఉన్న మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంతమేర డబ్బు ఎక్కువగా పొందవచ్చు.
ఉదాహరణకు ఒక కోటి రూపాయలు పొదుపు చేయాలని అనుకొని 15 ఏళ్ల వరకు నెలకు 15,000 డబ్బు మున్సిపల్ ఫండ్ లో పెట్టాలి. 15 ఏళ్లు అంటే 180 నెలలు. 108 నెలలకు ఒక్కొక్క నెల 15 వేల చొప్పున 180 నెలల్లో 27 లక్షలు మాత్రమే అవుతాయి. అయితే మీరు చేసిన మ్యూచువల్ ఫండ్ 15% వడ్డీ రేటు ఉంటుంది. కాబట్టి మీరు పొదుపు చేసిన 27 లక్షలకు ,15% వడ్డీ కలిపి ఒక కోటి రూపాయలు మనకు వస్తాయి. అంటే 27 లక్షలు మీరు పొదుపు చేస్తే, 74 లక్షలు వడ్డీ రూపంలో మనకు మ్యూచువల్ ఫండ్స్ వల్లే తిరిగి వెనక్కి ఇస్తారు.
ఈ విధంగా మనం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును తిరిగి పొందవచ్చు. ఈ విధంగా డబ్బును పొదుపు చేస్తే, మీరు అనుకున్న కలలను పూర్తి చేసుకోవచ్చు. మనం ఎప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అన్న, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ డబ్బును పొందవచ్చు.