Naga Shaurya: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో నాగశౌర్య నవంబర్ 20 తారీఖున వివాహం చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. బెంగళూరులోని ఒక హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లిలో భోజనాలు విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ నాగ శౌర్య వివాహం చేసుకున్న అమ్మాయి ఎవరంటే బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయినా అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
ఈనెల 20వ తారీఖున 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులోని ఒక హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.రాజరికపు స్టైల్ లో భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రకపు విధానం ట్రెండింగ్ లో ఉంది. నాగ శౌర్య కి కొంతకాలంగా అనూష శెట్టితో పరిచయం ఉంది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం వల్ల వివాహం చేసుకున్నారు.
అనూష శెట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంగళూరు దగ్గరలోని, కుందాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. అనూష ఒక ఇంటీరియర్ డిజైనర్. ఈ ఫీల్డ్ లో ఈమెకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఉమెన్ అచివర్స్ లో గుర్తింపు పొందింది. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ సర్టిఫికెట్ పొందింది.
ఈమె వ్యవస్థాపకత మరియు మార్కెటింగ్ లో మాస్టర్ డిగ్రీ ని కూడా సొంతం చేసుకుంది. డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఇండియాస్ టాప్ టెన్ ఇంటీరియర్ డిజైనర్స్ 2021 అవార్డును కూడా దక్కించుకుంది. ప్రత్యేక ఆకర్షణగా మారిన నాగశౌర్య పెళ్లి భోజనాల అరేంజ్మెంట్స్.
వీరి వివాహానికి పెద్దలు, స్నేహితులు, కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటల్లో రాయల్ వెడ్డింగ్ స్టైల్ లో నాగశౌర్య వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం వైరల్గా మారాయి.
ప్రస్తుతం మీరు పెళ్లిలో పెట్టిన భోజనాలు విషయము ఎక్కువగా ఫేమస్ అయ్యింది. పెళ్లికి వచ్చిన అతిధులకు రాచరికపు స్టైల్ లో భోజనాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో 12 రకాల వంటలు, నాలుగు రకాల స్వీట్స్ పెట్టినట్లు తెలిసింది.
టాలీవుడ్ సెలబ్రిటీస్ కు సంబంధించి త్వరలోనే హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేసే పనిలో నాగశౌర్య నిమగ్నమై ఉన్నాడు. త్వరలోనే వీరి రిసెప్షన్ జరగనుంది.