Neeraj Chopra:కామన్వెల్త్ గేమ్స్ బరిలో తప్పుకున్న నీరజ్ చోప్రా



కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాకముందే భారత్ కు తగిలిన ఎదురుదెబ్బ, దీని కారణంగా ఒక పథకాన్ని వదులుకోవాల్సిందే. కామన్వెల్త్ గేమ్స్ లో కచ్చితంగా మెడల్ సాధించే క్రీడాకారుల్లో ఇండియ స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లో దిగడం లేదు. గతవారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో జావెలిన్ త్రో ఫైనల్ లో గాయమైంది.

అతను నాలుగో త్రో తర్వాత గజ్జల్లో గాయమైన కారణంగా నొప్పి కలవడంతో అతను పట్టి కట్టుకోని పోటీపడ్డాడు. గాయం నొప్పి కలవడంతో నీరజ్ చోప్రా అసౌకర్యంగా చివరి రెండు త్రోలను పౌల్ గా నమోదు చేయడం జరిగింది. నీరజ్ కి ఎం ఆర్ ఐ స్కాన్ సోమవారం అమెరికాలో తీయించగా, దానిని వైద్యులు పరిశీలించి గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. దాని కారణంగా నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ బరిలో నుంచి తప్పుకోవడం జరిగింది.



ఈ మేరకు భారత్ ఒలంపిక్ సంఘం (ఐఓఏ) జనరల్ సెక్రెటరీ రాజీవ్ మొహతాకు నీరజ్ చోప్రా సమాచారం తెలిపాడు. గురువారం మొదలుకానున్న కామన్వెల్త్ గేమ్స్ లో ప్రారంభ వేడుకల్లో నీరజ్ ఇండియా బృందానికి పతాకధిరిగా వ్యవహరించాల్సింది. నీరజ్ చోప్రా బరిలో లేకపోతే భారత ఒలంపిక్ సంఘం కొత్త ఫ్లాగ్ బేరర్ ను ఎంపిక చేయనుంది. గత సంవత్సరం టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో రజత పథకం గెలిచాడు. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. ఈ సారి కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడా బృందం ఏ పథకాలు సాధిస్తుందో చూడాలి.