ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బాగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల వరల్డ్ ఫైనల్ ఈవెంట్ లో 22 ఏళ్ల సిడ్నీ మెక్లఫ్లిన్ రెస్ మొదలైన వెంటనే ట్రాక్ పై వాయువేగంతో దూసుకెళ్లింది. ఒక్కొక్క హర్డిల్ ను అవలీలగా దాటి వేస్తూ, ఒక్కో ప్లేయర్ నీ వెనుకకినీడుతూ అమెరికా మహిళా అథ్లెట్ సిడ్నీ మెక్‌లాఫ్లిన్ తన పేరిట ఎవరు ఊహించని సమయంలో లక్ష్యానికి చేరి నాలుగో సారి ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది.
అమెరికాకు చెందిన మహిళ సిడ్ని మెక్‌లాఫ్లిన్ 50.68 సెకంన్ల లో 400 మీటర్ల గమ్యానికి చేరి మొదటిసారి బంగారు పతకం సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.వరల్డ్ రికార్డ్ సాధించినందుకు సిడ్నీ మెక్‌లాఫ్లిన్ కి లక్ష డాలర్లు (79 లక్షల 84 వేలు) ప్రైజ్ మనీ గా ఇచ్చారు.
ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్ ; 52.27 సెకన్లు) రజతం, దాలియా మెహమ్మద్ (అమెరికా;53.13 సకన్లు) కాంస్యం సాధించారు. గోల్డ్ మెడల్ సాధించే క్రమంలో సిడ్నీ మెక్‌లాఫ్లిన్ గత నెల 25 న 51.41 సెకన్ల తో నెలకొల్పిన వరల్డ్ రికార్డ్ నీ సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ మెక్‌లాఫ్లిన్ వరల్డ్ రికార్డ్ లను తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం.
మహిళల జావెలిన్ త్రో డిఫెండింగ్ ఛాంపియన్ కెల్సీ బార్బర్ 66.91 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించింది. ఇండియా జావెలిన్ త్రో ప్లేయర్ అయిన అన్ను రాణి జావెలిన్ ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానం లో నిలిచింది.