Nithya Menen: మీడియా ముందు మాట్లాడిన నిత్యామీనన్
పెళ్లి వార్తలో ఎలాంటి నిజం లేదన్ననిత్యామీనన్
నిత్యామేనన్ ఈ మధ్య తన వివాహం మీద వస్తున్న వార్తల గురించి ఆమె స్పందించారు.ఈ వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు.ఆంగ్ల మీడియా తో ఆమె మాట్లాడుతూ ఏ విషయం అయిన నిజం అని తెలిశాక దానిని ప్రచారం చేయాలని మీడియాను కోరారు.మలయాళ స్టార్ హీరో తో నిత్యామీనన్ ఉన్నారని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా, పలు వెబ్ సైట్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
గత 24 గంటల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. నిత్యామేనన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలను కొట్టి పడేసింది. మొదట కన్నడ సినిమాతో నటిగా మారిన నిత్యామీనన్ “అలా మొదలైంది” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది.
తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, సన్ ఆఫ్ సత్యమూర్తి,ఒక అమ్మాయి తప్ప,జనతా గ్యారేజ్, అ!, స్కైలాబ్ ఇలాంటి విభిన్న కథా సినిమాలతో ఆకట్టుకుంది.ఈ సంవత్సరంలో వచ్చిన భీమ్లా నాయక్ లో సందడి చేసింది.ఆమె నటించిన 19(1)(a) అనే మలయాళ చిత్రం త్వరలోనే ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. నిత్యమేనన్ “తిరుచిత్రంబళం”, “ఆరామ్ తురికల్పన”అనే సినిమాలలో బిజీగా ఉంది.