Ola electric: ఆగస్టు 15 ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి కీలక విషయాలు విడుదల చేసే అవకాశం

Ola electric: ఆగస్టు 15 ఎలక్ట్రిక్ కారును గురించి కీలక విషయాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ తొలి ఎలక్ట్రిక్ కారు పై ఒక స్థలం సంవత్సరం కాలం పాటు పనిచేస్తుంది.

వచ్చే 2023 సంవత్సరంలో విడుదల చేయడం జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సమస్త దూసుకెళ్తోంది. ఓలా నుండి వచ్చిన ఓలా S1,SA pro స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ నుండి యశ్వంత్పూర్ నుంచి మరో కొత్త కలర్ మోడల్ ఆగస్టు 15 విడుదల చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ మైక్రో బ్లాగింగ్ గురించి ట్విట్టర్లో, దానికి సంబంధించిన టీజర్ ను అప్లోడ్ చేశాడు.

అయితే దీనిని లాంచ్ చేయబోతున్నారనేది భావిష్ అగర్వాల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఓలా కంపెనీ ఇటీవల కాలంలో తయారు చేసిన గ్రీనేస్ట్ EV నీ లాంచ్ చేస్తున్నామని మాత్రమే చెప్పారు. దానికి పచ్చని చెట్ల వీడియోను జత చేయటంతో ఓలా S1 pro నుంచి ఆకుపచ్చని రంగులో ఉండే అవకాశం ఉందని అంచనా.

Ola electric car

ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో 2021 సంవత్సరంలో లాంచ్ అయ్యింది దీని యొక్క ధర  1.29 లక్షలు. అయితే ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ స్కూటర్ యొక్క ధర 1.40 లక్షలకు పెంచడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రస్తుత కాలంలో భారత దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించనుంది.

ఇందులో ఓలా ఎస్1, ఎస్ 1 ప్రో లు ఉన్నాయి. ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ARAI సర్టిఫైడ్ రేంజ్ తో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 115. దీనిలో ప్రత్యేకత ఇది మూడు సెకండ్లలో 0 నుండి 100 స్పీడును అందుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు సాఫ్ట్వేర్ ని కూడా అప్డేట్ చేయడం జరిగింది.

అప్డేటెడ్ స్కూటీలలో మూవ్ os 2.0 సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ఓలా S1 pro స్కూటీ లో బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ క్రూయీజ్ కంట్రోల్ వంటి అనేక స్మార్ట్ ఫ్యూచర్ లను అందించారు. ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలోనే సంచలనం సృష్టిస్తుంది.

అంతేకాకుండా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టబోతుంది. ఆగస్టు 15 2022లో ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి వివరాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారుపై సంవత్సరం కాలంగా పనిచేస్తుంది. వచ్చే సంవత్సరం 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది అని అంచనా.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ EV ఫోర్ వీలర్ తయారు చేయడానికి ఫ్యాక్టరీ కోసం వెయ్యి ఎకరాల భూమిని సేకరించినట్లు సమాచారం. అదేవిధంగా ఇది ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రస్తుతం తయారు చేస్తుంది. ఈ ఫ్యాక్టరీ దాదాపు రెండు రెట్లు ఎక్కువ స్థలాన్ని కేటాయిస్తుందని అంచనా.

ఓలా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వస్తే ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ విభాగం మార్కెట్లో అనేక మార్పులు వస్తాయి అని మార్కెట్ నిపుణుల భావన. అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు అధికంగా పెరుగుతున్న సమయంలో ఓలా ఎలక్ట్రిక్ కారు ఆదరణ పెరగవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేయడం జరుగుతుంది.