Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

PM Kisan Amount: సొమ్మును చెక్ చేసుకోండి (pmkisan.gov.in)

రేపే రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ సొమ్ము

దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర ధర దుకాణాలను దశలవారీగా వన్ స్టాప్ సెంటర్ లాగా మార్చి వాటికి ‘పీఎం సమృద్ధి కేంద్రాలుగా’నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర ధర దుకాణాలను దశలవారీగా వన్ స్టాప్ సెంటర్ లాగా మార్చి వాటికి ‘పీఎం సమృద్ధి కేంద్రాలుగా’నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్ష సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని వీటిలో అందుబాటులో ఉంచుతారు.

ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలోని ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టర్ అప్ సదస్సు ఎగ్జిబిషన్ను,600 PM కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని తెలిపారు.
సుమారు 300 అంకుర పరిశ్రమలు తమ నవ కల్పనాలను ప్రదర్శిస్తాయన్నారు. రైతులకు ‘PM సమ్మాన్ నిధి’ 12వ విడత కింద రూ.16 వేల కోట్లను ప్రధాని విడుదల చేయనున్నారనీ, ఇప్పటివరకు రూ.2.16 లక్షల కోట్లు విడుదల చేసినట్లు అవుతుందని తెలిపారు. ‘ఒకే దేశం ఒకే ఎరువు’ఇతివృత్వంలో భారత్ యూరియా, భారత్ డిఏపి, భారత్ ఎంపీ, భారత్ ఎన్ నీకే బస్తాలను మోదీ విడుదల చేస్తున్నారన్నారు. వీటన్నిటిని భారత్ పేరుతో విడుదల చేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి అన్నారు.

స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి..

  1. ముందుగా pmkisan.gov.in వెబ్ సైట్ కి వెళ్లాలి.
  2. ఈ వెబ్ సైట్ కి కుడివైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు మీరు బెనిఫిషయరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి.
  4. మీ స్టేటస్ ని చెక్ చేయడానికి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంటే అన్ని వివరాలు నమోదు చేయాలి.
  5. ప్రక్రియను పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా 6000/-రూపాయలు లభిస్తాయి.2 వేల రూపాయల చొప్పున మూడు వాయిదాలతో చెల్లిస్తారు. ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేశారు.

పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లలేని వారు ఫోన్ ద్వారా తమ వివరాలు తెలుసుకోవచ్చు.PM కిసాన్ సమ్మాన్ యెజన లాండ్ లైన్ నెంబర్: 011-23381092,23382401.PM కిసాన్ సమ్మాన్ యెజన టోల్ ఫ్రీ నెంబర్ : 18001155266,PM కిసాన్ యెజన హెల్ప్ లైన్ నెంబర్: 155261,0120-6025109 కు కాల్ చేసి రైతులు తమ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker