SBI Account Password:ఖాతాదారులను అలర్ట్ చేస్తున్న SBI బ్యాంక్
SBI Account Password Tips: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకనగా అకౌంట్ పాస్వర్డ్ విషయంలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. అకౌంట్ పాస్వర్డ్ పెట్టుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సులభమైన బలహీనమైన పాస్వర్డ్లను పెట్టుకోరాదు,అలాగా పెట్టుకోవడం ద్వారా అకౌంటును హ్యాక్ చేసి డబ్బులు దోచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల దృష్టిలో ఉంచుకొని SBI ట్విట్టర్ ద్వారా ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకోవాలో సూచిస్తుంది. బలహీన పాస్వర్డ్ పెట్టుకోకుండా స్ట్రాంగ్ గా ఉండే పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఈ పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల మీ అకౌంట్ జాగ్రత్తగా ఉంటుంది. అలాగే భద్రంగా కూడా ఉంటుందని తెలియజేశారు.
ఎలాంటి పాస్వర్డ్ ఉండాలి:
మీ అకౌంట్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది ఉండాలి.ABCD,abcd,1234 వంటి పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అని తెలియజేశారు. బలహీనమైన పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల హ్యాకర్లు చాలా తొందరగా గుర్తిస్తున్నారు. దీనివల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలియజేశారు. పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే @_+=లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండవలెను. నెంబర్ తో పాటు క్యారెక్టర్స్ ఉంటే మీ అకౌంటు చాలా భద్రంగా ఉన్నట్లు ఉంటుంది. అలాగే మీరు పెట్టే పాస్వర్డ్ కనీసం 8 క్యారెక్టర్లు కలిగి ఉండాలి. అలాగే క్యారెక్టర్స్ లలో స్పెషల్ క్యారెక్టర్స్ ని ఖచ్చితంగా పెట్టవలెను. అలాగే మీ సుమారు మీరు 12 క్యారెక్టర్లతో పాస్వర్డ్ పెట్టుకున్న ఇంకా మంచిదే అని తెలియజేయడమైనది.
ఇలాంటి పాస్వర్డ్లు అస్సలు పెట్టకూడదు:
సాధారణంగా చాలామంది వీక్ పాస్వర్డ్ పెడుతుంటారు. అలాంటి సమయాలలో హ్యాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదం కూడా ఉన్నాయి.itislocked, thisismypassword లాంటివి ఇక మరెన్నో సింపుల్ గా ఉండే పాస్వర్డ్లను పెడుతూ ఉంటారు. ఇలాంటి పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదని SBI అందర్నీ హెచ్చరిస్తుంది. ఇలాంటి పాస్వర్డ్ పెట్టినచో వెంటనే హ్యాకర్లకు హ్యాకింగ్ చేసే అవకాశం సులువుగా అయిపోతుంది.
కీబోర్డ్ లో సింపుల్ గా ఉండే పాస్వర్డ్:
కీబోర్డులో సింపుల్ గా గుర్తుంచుకొనేలా పాస్వర్డ్ పెడుతూ ఉంటారు. అలాంటివి పాస్వర్డ్లు పెట్టుకోవద్దని SBI సూచిస్తుంది. పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండేలా పెట్టుకోవాలి. కొంచెం బెటర్ అలాగే పాస్వర్డ్ లో :), :/ లాంటి ఎమోషన్స్ ని యడ్ చేయకూడదు. ఇలాంటివి సింపుల్ గా పాస్వర్డ్ అసలు పెట్టకూడదు ఒకవేళ పెట్టినచో హ్యాకర్స్ కు చాలా సులభతరం అవుతుంది.
123456789, abcdefg లాంటి పాస్‌వర్డ్స్:
సాధారణంగా చాలామంది సింపుల్ గా గుర్తుంచుకునేలా పాస్వర్డ్లు పెడుతూ ఉంటారు.123456789, abcdefg ఇలాంటివి సులభంగా ఉంటుందని పాస్వర్డ్ పెట్టుకుంటారు. పాస్వర్డ్లు పెడితే చాలా ప్రమాదమే అని చెబుతున్నారు.ఇక DOORBELL బదులుగా DOOR8377 పాస్వర్డ్ పెడుతుంటారు. ఇలాంటివి పాస్వర్డ్ పెట్టకూడదు అని SBI అందర్నీ హెచ్చరిస్తోంది.
పుట్టిన తేదీ పాస్వర్డ్లు:
ఎక్కువమంది అకౌంట్లకు సులభంగా ఉంటుందని పుట్టిన తేదీలు పాస్వర్డ్ గా పెట్టుకుంటారు. పేరు,ఊరు పేరు రకరకాలుగా పాస్వర్డ్ గా మార్చుకుంటూ ఉంటారు. అలాంటివి పెట్టకపోవడం కూడా చాలా మంచిదని SBI సూచిస్తుంది. Ramesh@1967 లాంటివి పాస్వర్డ్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి పేరుతో పొరపాటున కూడా పాస్వర్డ్లుగా పెట్టుకోకూడదని SBI హెచ్చరిస్తోంది. పుట్టిన పేరుతో గాని సంవత్సరంతో పాటు వచ్చేలా గాని ఉన్న పాస్వర్డ్లను అస్సలు పెట్టుకోకూడదు. అయితే బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్ యాప్స్ కు మాత్రమే కాకుండా వ్యక్తిగత ఉండే అకౌంట్ కి కూడా సోషల్ మీడియాలో ఉండే అకౌంట్స్ కూడా ఇలాంటి సింపుల్ గా ఉండే పాస్వర్డ్లను పెట్టకూడదు. పాస్వర్డ్లను యొక్క విధానాలను పాటించవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుచిస్తోంది.
ఇంకా చాలా రకాల సులువుగా ఉండే పాస్వర్డ్లు గాని అసలు పెట్టుకోకండి. అలా పెట్టుకున్నట్లయితే హ్యాకర్స్ కి చాలా మీ యొక్క అకౌంట్స్ సోషల్ మీడియా గానీ హ్యాక్ చేయడానికి సింపుల్ గా అయిపోతుంది.సైబర్ క్రైమ్ నుండి తప్పించుకున్నాలంటే SBI చెప్పిన టిప్స్ అన్ని అనుసరించాలి.