CricketSports News

T20 WC PAK VS ENG:పాకిస్తాన్ పై ప్రపంచ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.

ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ మెల్బోర్న్ స్టేడియంలో జరిగింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇంకా ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆడిన ప్లేయర్స్ వీళ్లే.
ఫైనల్ మ్యాచ్ ఆడే పాకిస్తాన్ పేయర్స్–
.సంభావ్య XI:మహ్మద్ రిజ్వాన్ (wk), బాబర్ అజామ్ (c), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ Jr, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్.
ఫైనల్ మ్యాచ్ ఆడే ఇంగ్లాండ్ ప్లేయర్స్–
జోస్ బట్లర్ (c&wk), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్.
ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకుంది. మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. శ్యామ్ కర్రన్ బౌలింగ్ లో పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి 4.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి పాకిస్తాన్ 39/1 స్కోర్ చేసింది.

ఆదిల్ రషీద్ బౌలింగ్లో మహమ్మద్ హరీష్ 12 బాల్స్ లో 8 పరుగులు చేసి 7.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ 8 ఓవర్ పూర్తయ్యేసరికి 50/2 స్కోర్ చేసింది.11 ఓవర్ పూర్తయ్యేసరికి 84/2 స్కోర్ చేసింది పాకిస్తాన్. ఆదిల్ రషీద్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ నీ 28 బంతుల్లో 32 పరుగులు చేసి న తర్వాత 11.1 ఓవర్ లో అవుట్ చేశాడు. ఇప్పటివరకు ఆదిల్ రషీద్ ఈ వరల్డ్ కప్ లో రెండు వికెట్లు తీశాడు. 12 ఓవర్ పూర్తయ్యేసరికి పాకిస్తాన్ 84/3 స్కోర్ చేసింది.

పాకిస్తాన్ పై ప్రపంచ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.
పాకిస్తాన్ పై ప్రపంచ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్.

బెన్ స్టాక్స్, ఇఫ్తికార్ అహ్మద్ నీ ఆరు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే 12.2 ఓవర్ లో అవుట్ చేశాడు. 13 తర్వాత పాకిస్తాన్ స్కోర్ 90/4 గా వుంది.
14 తర్వాత పాకిస్తాన్ 98/4 స్కోర్ చేసింది. 15వ ఓవర్ తర్వాత 106/4 గా స్కోర్ ఉంది. 16 ఓవర్ పుట్టేసరికి 119/4 స్కోర్ చేసింది. పాకిస్తాన్ 17 ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. శామ్ కర్రన్ ,మసూద్ ని 28 బంతుల్లో 38 పరుగులు చేసిన తర్వాత 16.3 ఓవర్లో అవుట్ చేశాడు.సామ్ కర్రన్ 17 ఓవర్ వరకు రెండు వికెట్లు తీశాడు. జోర్దాన్ , షాదాబ్ ఖాన్ ని 14 బంతుల్లో 20 పరుగులు చేసిన తర్వాత 17.2 ఓవర్లులో అవుట్ చేసాడు.

18వ ఓవర్ పూర్తయ్యేసరికి 127/6 స్కోర్ చేసింది. పాకిస్తాన్ 19 వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వికెట్ సామ్ కర్రన్ బౌలింగ్లో కోల్పోయింది. నవాజ్ 7 బంతుల్లో ఐదు పరుగులు చేసి 18.3 ఓవర్ లోఅవుట్ అయ్యాడు. 19 ఓవర్ పూర్తయ్యేసరికి 131/7 గా స్కోర్ ఉంది. జోర్దాన్ బౌలింగ్లో వసీం ని 7 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన తర్వాత 19.3 ఓవర్ లో అవుట్ చేశాడు. లాస్ట్ ఓవర్ వరకు చూసుకుంటే జోర్డాన్ రెండు వికెట్లు తీశాడు.

ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్లో పాకిస్తాన్ బ్యాటింగ్ పూర్తయిన తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో 137/8 స్కోర్ చేసింది.138 పరువులను ఇంగ్లాండుకు టార్గెట్గా ఇచ్చింది.సామ్ కర్రాన్ ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. వరల్డ్ కప్ అందుకోవాలంటే 120 బంతుల్లో 138 పరుగులు స్కోర్ చేయాలి ఇంగ్లాండ్ .

ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి ఓవర్ లో ఏడు పరుగులు చేసింది. షహేన్షా ఆఫ్రిది చేతిలో హేల్స్ రెండు బంతుల్లో ఒక పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. రెండవ ఓవర్ పూర్తయిన తర్వాత 21/1 స్కోర్ చేసింది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ నాలుగో ఓవర్ లో మరో వికెట్ కోల్పోయింది.రౌఫ్ బౌలింగ్లో సాల్ట్ తొమ్మిది బంతుల్లో పది పరుగులు చేసి 3.3 ఓవర్ లో అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి32/2 స్కోర్ చేసింది.

ఐదో ఓవర్ పూర్తయ్య సరికి 43/2 స్కోర్ చేసింది ఇంగ్లాండ్. ఆరో ఓవర్ లో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 17 బాల్లకి 26 పరుగులు చేసి రౌఫ్ బౌలింగ్లో 5.3 ఓవర్లో అవుట్ చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 49/3 స్కోర్ చేసింది ఇంగ్లాండు. పదవ పూర్తి అయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది ఇంగ్లాండ్. 11 ఓవర్ పూర్తయ్యేసరికి 79/3 స్కోర్ చేసింది.

13వ ఓవర్లో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. షాదాబ్ బౌలింగ్లో బ్రూక్ 23 బాల్స్ లో 20 పరుగులు చేసి 12.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. 13వ ఓవర్ పూర్తయ్యేసరికి 87/4 స్కోర్ చేసింది. టి20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడ్డానికి మెల్బోర్న్ స్టేడియం కి 80462 మంది అభిమానులు వచ్చారు. 15 ఓవర్లు పూర్తయిన తర్వాత 97/4 స్కోర్ చేసింది ఇంగ్లాండ్. 16వ ఓవర్ పూర్తయ్యేసరికి 110/4 స్కోర్ చేశారు.

17 ఓవర్ పూర్తి అయ్యేసరికి 126/4 స్కోర్ చేసింది. 18 ఓవర్ పూర్తయ్యేసరికి 131/4 స్కోర్ చేసింది ఇంగ్లాండ్. 13 బంతుల్లో 19 పరుగులు చేసి 18.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో 138/5 స్కోర్ ను 19 ఓవర్లలోనే పూర్తి చేసి వరల్డ్ కప్ టైటిల్ ని అందుకుంది ఇంగ్లాండ్ జట్టు. పాకిస్తాన్ పై ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం. వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లాండ్ కు 11సంవత్సరాల తర్వాత మరల వరల్డ్ కప్ దక్కింది. లాస్ట్ వరకు కూడా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టి20 వరల్డ్ కప్ 2022 ఛాంపియన్స్ ఇంగ్లాండ్. స్టాక్స్ ప్రదర్శన ద్వారా వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ ఫాన్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button