Sports News

టి20 లో అత్యధిక వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను సాధించిన భువనేశ్వర్ కుమార్

క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ జట్టులు ప్రపంచ కప్ టైటిల్ కోసం ఆస్ట్రేలియా వేదికన పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి సూపర్ 12 జట్లను కూడా ఎంపిక చేయడం జరిగింది.

టి20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను సాధించిన టీమిండియా బౌలర్--భువనేశ్వర్ కుమార్.
టి20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతను సాధించిన టీమిండియా బౌలర్-భువనేశ్వర్ కుమార్.

అక్టోబర్ 23, ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టీమిండియా జట్టు తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో పోటీపడి విజయం సాధించి, ఈ టోర్నమెంట్ ని టీమిండియా జట్టు మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మ్యాచ్ చాలా ఉత్కంఠ గా జరుగుతున్న సమయంలో ఈ మ్యాచ్ పాకిస్తాన్ కే సొంతం అయితది అనుకున్న సమయంలో టీమిండియా జట్టును విరాట్ కోహ్లీ తన ఒంటి చేత్తో గెలిపించే ప్రయత్నం చేశాడు.

గెలిపించాడు కూడా. ఇక బౌలర్ల విషయానికొస్తే టీమిండియా జట్టులోని బౌలర్లలో ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనతను సాధించాడు. అదేంటంటే టి20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా భువి రికార్డులు సృష్టించాడు. టి20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా అక్టోబర్ 23 నా జరిగిన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ పాకిస్తాన్ కెప్టెన్ అయిన షాహిన్ అఫ్రిదిని అవుట్ చేసిన భూవి, తన 86వ టి20 వికెట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి అరుదైన రికార్డుని భువనేశ్వర్ కుమార్ సాధించాడు.

ఇప్పటివరకు టీ ట్వంటీ మ్యాచ్ లాడిన భువనేశ్వర్ కుమార్ 86 వికెట్లు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డ్ భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరుతో ఉండేది. యుజ్వేంద్ర చాహల్ 85 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం దీన్ని భువనేశ్వర్ కుమార్ క్రాస్ చేశాడు. మొన్న జరిగిన మ్యాచ్ తో చాహల్ రికార్డును భువి బ్రేక్ చేశాడు.

ప్రస్తుతం ఈ రికార్డును భువనేశ్వర్ కుమార్ అనే భారత బౌలర్ సొంతం చేసుకున్నాడు.ఇది ఇలా ఉండగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా మారిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పై, భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానికి సంబంధించి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ మ్యాచ్ చివరిదాకా క్రీజు లో నిలిచి జట్టును విజయ తీరం వైపు తీసుకెళ్లాడు.

భువనేశ్వర్ కుమార్ ఇలాంటి రికార్డ్ సాధించడం టీమిండియా అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పై విజయం సాధించడం అంటేనే అదో కిక్. చిరకాల ప్రత్యర్థి పై మళ్లీ విజయం సాధిస్తే అది వేరే లెవల్. ఇలాంటి సిచువేషన్ మళ్ళీ వచ్చింది. టీమిండియా జట్టు పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఉత్కంఠతో ఈ విజయం కోసం ఎదురు చూశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button