Sports News

T20 IND vs PAK: టీం ఇండియా జట్టు లోని 11 మంది వీరే?

T20 IND vs PAK: క్రికెట్ ఆటకు సంబంధించి టి 20 ప్రపంచకప్ 2022 ఆస్ట్రేలియా వేదికన జరగబోతున్నాయి. దీనికి సంబంధించి టీమిండియా జట్టు కూడా అనేక ప్రాక్టీస్ మ్యాచులు చేసి ప్రపంచకప్ పోరుకు సిద్ధంగా ఉంది. అయితే ఇంతకుముందు ఇండియా జట్టుకు చెందిన ఇద్దరు కీలక బౌలర్లు ప్రపంచకప్ పోటీ నుంచి శారీరక గాయాల కారణంగా వైదెలగడం జరిగింది.

టీ20 ప్రపంచ కప్2022 ఆడే టీం ఇండియా జట్టు లోని 11 మంది వీరే?
టీ20 ప్రపంచ కప్2022 ఆడే టీం ఇండియా జట్టు లోని 11 మంది వీరే?

టీమిండియా జట్టును గాయాల బెడద వెంటాడుతుంది. ఇది ఇలా ఉండగా బూమ్రా, దీపక్ చాహర్ ఇద్దరు బౌలర్లు టి20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ నుంచి వైదొలగడం జరిగింది. ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రస్తుతం తమ టీం లో ఉన్న ఇతర బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కొన్నీ వామప్ మ్యాచులు, ప్రాక్టీస్ మ్యాచులు పెట్టి ఆటగాళ్ల యొక్క పనితీరును గురించి పరీక్షించింది. ఇలా చేయడం ద్వారా అసలు పోరులో ఆడే 11మంది ఎవరు అనేది కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్ కు ఒక అవగాహన వచ్చింది. 2007 సంవత్సరం తర్వాత టీమిండియా జట్టు మరో టి20 ప్రపంచ కప్ టైటిల్ను గెలవలేదు.

ఈ సంవత్సరం ఈ ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికన జరుగుతూ ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా జట్టు బలమైన పోటీదారులలో ఒకటిగా నిలిచింది. దీనికోసం టీమిండియా జట్టు అత్యుత్తమ ఆటగాళ్లతో ఆస్ట్రేలియాను చేరుకుంది. కానీ టి20 ప్రపంచ కప్ 2022లో ఆడే టీమిండియా జట్టుకు సంబంధించి న ఆటగాళ్లు ఎవరో, ఆ 11 మంది ఎవరు మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత టీమిండియా జట్టు వెస్ట్రాన్ ఆస్ట్రేలియా తో రెండు వామప్పు మ్యాచులు ఆడి ,1 గెలిచింది. మరొకటి ఓటమి చూసింది. ఆ తర్వాత ఆ జట్టు రెండు వామప్ మ్యాచులు ఆడాల్సి ఉండగా ఆతిధ్య ఆస్ట్రేలియా తో ఆడిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది. న్యూజిలాండ్తో జరిగిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

బ్యాటింగ్ చేసే వ్యక్తుల ఆర్డర్-

టి20 ప్రపంచ కప్ 2022 కు సంబంధించి, టీమిండియా జట్టులో బ్యాటింగ్ చేసే విషయానికి వస్తే ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉంటారు అనేది ఫిక్స్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. రోహిత్ ఫార్మ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తుంది. ఇతను ప్రధాన టోర్నీలో మళ్లీ పుంజుకోవాలని ఆశిస్తుంది. కేఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ నంబర్ 3 లో ఆడనున్నాడు అలాగే సూర్య కుమార్ యాదవ్ నంబర్ ఫోర్ లో ఆడనున్నాడు. హార్దిక్ పాండ్యా ఐదవ స్థానంలో, ఇతని తర్వాత స్థానంలో దినేష్ కార్తీక్ ఆడనున్నాడు. ఇద్దరూ ఫినిషెర్స్ పాత్రలో ఉంటారు. ఈ ఇద్దరిపైనే టీమ్ ఇండియా జట్టు ఎంతో ఆధారపడి ఉంటుంది.

బౌలర్లకు సంబంధించి–

టీమిండియా జట్టు ఇద్దరు స్పిన్నర్లతో, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళుతుందా? లేదా ఇద్దరు స్పిన్నర్లకు బదులు ఒక బ్యాట్ మెన్ కు అవకాశం ఇవ్వాలనుకుంటుందా అనేది మొదటి ప్రశ్నగా మిగిలింది. మొదటి పరిస్థితిలో పాండ్యా కూడా ఉన్నందున ఆరు బౌలింగ్ ఎంపికలు జరుగుతాయి. కానీ అది రెండో స్థానంలో సాధ్యం కాదు. టీమిండియా జట్టు గానీ ఇద్దరు స్పిన్నర్లతో స్టేడియంలోకి దిగాలని నిర్ణయించుకుంటే అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరు రానున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఇద్దరు బ్యాటింగ్ కూడా చేస్తారు ఇది టీమిండియా జట్టుకు ఒక మంచి అవకాశం.

ప్రధాన స్పిన్నర్–యుజ్వేంద్ర చాహల్.

యుజ్వేంద్ర చాహల్ ప్రధాన స్పిన్నర్ గా వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లడం టీమిండియా జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఉండే మైదానాలు పెద్దవిగా ఉంటాయి. ద్వారా బ్యాట్స్మెన్లు స్పిన్నర్ లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భారీ షార్ట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వికెట్లు తీయడానికి ఇది అవకాశంగా ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలర్లలో ఎవరికి ఛాన్స్–

బూమ్రా లేడు. ఇతని స్థానంలో మహమ్మద్ షమీ వచ్చాడు. ఇతను మొదటి వామప్ మ్యాచ్లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ప్లేయింగ్ 11కోసం తన వాదనను బలంగా వినిపించాడు. ఇతనితోపాటు అర్ష్ దీప్ సింగ్ ఆట ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తుంది. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. సీనియారిటీ ప్రకారం ఆలోచిస్తే భువనేశ్వర్ ఆడేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బరిలోకి దిగే 11మంది వీరే అవచ్చు–

(కెప్టెన్ )రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా,(వికెట్ కీపర్) దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button