T20 NZ vs Ind:న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో విజయం ఎవరి ది.
క్రికెట్ ఆటకు సంబంధించి మొన్నటి వరకు టి20 వరల్డ్ కప్ 2022 జరిగింది. ఈ టోర్నమెంట్లో టీమిండియా జట్టు సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇలాంటి ఈ జట్టు ద్వైపాక్షిక సిరీస్ పై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా 3 t20 లు, మూడు వన్డేలు ఆడనుంది. దీంట్లో భాగంగా నవంబర్ 18 వ తారీకు న్యూజిలాండ్ జట్టుతో, టీమిండియా వేల్లింగ్టన్ వేదికగా పోటీ పడింది. ఈ ద్వైపాక్షిక సిరీస్ లో టీమిండియా కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు. మరి యువ ఆటగాళ్లు ఏ విధంగా రాణిస్తారో చూడాలి. ఇక నవంబర్18వ తేదీన టీమిండియా జట్టు ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్తో పోటీ పడుతుంది.
తుది జట్లు(అంచనా):
భారత జట్టు: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రిషబ్ పంత్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
ఇక ఈ రెండు జట్లుకు సంబంధించిన బలాలేంటి? బలహీనతలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఇండియాకు సంబంధించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్-
టీమిండియా కు ఉన్న మొదటి ప్లస్ పాయింట్ బ్యాటింగ్. ఈ ద్వైపాక్షిక సిరీస్ లో టీమిండియా జట్టు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ లేకుండానే బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బూమ్రా, షమీ, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండానే ఈ మ్యాచ్లు ఆడబోతుంది. ఇక ఇప్పుడున్న టీమ్ ఇండియాకు ద్వైపాక్షిక సిరీస్ లో జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. ఇతని నాయకత్వంలో కూడా టీమిండియా బలంగానే ఉంది. సూర్య కుమార్ యాదవ్ ఎలాగో ఫామ్ లోనే ఉన్నాడు. ఇతను ఫామ్ లో వచ్చాడంటే ఆ మ్యాచ్ విన్ కావడం పక్క.శుభ్ మాన్ గిల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా ఇంకోవైపు ఇలాంటి యువ బ్యాటర్స్ తమ టైం కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్ లో ఎలాగో పై చేయి ఉన్న టీమిండియా బౌలింగ్ లో కూడా బాగా రానిస్తే అన్ని మ్యాచ్లు విన్ అవ్వచ్చు.
న్యూజిలాండ్ కి సంబంధించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్-
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఈ జట్టు అటు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను బలంగానే ఉంది. ఈ జట్టుకు సంబంధించిన ఓపెనర్లుగా ఫిన్ అలెన్, డే వన్ కాన్వే చాలా బాగా రానిస్తారు.మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ కూడా బాగా ఆడతారు. బౌలింగ్ విషయానికి వస్తే ట్రె oట్ బోల్ట్ లేని లోటు బాగానే కనిపిస్తుంది.మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే ముఖ్యంగా ఆడనున్నారు. స్వదేశానికి చెందిన పిచ్ లు కాబట్టి న్యూజిలాండ్ కు ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. ఇక విజయం ఎవరిని వరిస్తుందో చూడాల్సింది.
న్యూజిలాండ్, ఇండియా రికార్డ్స్-
ఇప్పటివరకు భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు 20 సార్లు పోటీ పడ్డాయి. అయితే 11 సార్లు టీమిండియా విజయం సాధించింది. మిగతా తొమ్మిది సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే టీమిండియా దే పై చేయి.
ఇక్కడ పిచ్ కండిషన్ ఎలా ఉంటుందంటే?
ఈ మ్యాచ్ వెల్డింగ్టన్ వేదికగా జరుగుతుంది. ఇక్కడ డ్రాప్ ఇన్ వికెట్ పిచ్ ఉపయోగిస్తారు. ఈ పిక్స్ బౌలర్ల కంటే కూడా బ్యాటర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు ఎక్కువ స్కోరు చేసే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ కి వర్షం కూడా అంతరాయంగా ఉండొచ్చు.
మరి రెండు జట్లను పరిశీలించిన తర్వాత నవంబర్ 18 వ తారీకు జరిగే పాక్షిక సిరీష్ లో భాగంగా జరిగే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో న్యూజిలాండ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీమిండియా బౌలింగ్ లో కాస్త బలహీనంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్ విషయానికి వస్తే అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను బలంగానే కనిపిస్తుంది. ఏ కాకుండా స్వదేశానికి చెందిన పిచ్ లు కాబట్టి న్యూజిలాండ్ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.