శ్రీకృష్ణుడు కంసుడిని ఎందుకు వధించాడో తెలుసా?
శ్రీకృష్ణుడు కంసుడిని ఎందుకు వధించాడో తెలు సా?
హిందూ సంప్రదాయంలో కృష్ణుడి అవతారం ప్రత్యేకమైనది. మహావిష్ణువు అవతారాలలో కృష్ణావతారం ఒకటి. మహావిష్ణు అవతారాల లో రామావతారం, కృష్ణావతారం పరిపూర్ణమైనవి. ఈ రెండిటిలో మరింత పూర్ణవతారం ఏది అంటే కృష్ణ అవతారం అని చెప్పవచ్చు. కృష్ణుడు అష్టమి రోజున పుట్టాడు అందువల్ల కృష్ణాష్టమి, జన్మాష్టమని గోకులాష్టమి, అష్టమి రోహిణి, అని పిలుస్తారు మహావిష్ణువుని ఎనిమిదవ అవతారమే కృష్ణావతారం.
బాలకృష్ణనిగా, గోపాలకృష్ణునిగా రాధాకృష్ణునిగా, గీతాకృష్ణునిగా ఏ భావంతో పిలిచినా అదే భావంతో ప్రత్యక్షమయ్యే అవతారం కృష్ణావతారం. ఎవరు ఎలా పిలిస్తే అలా కనిపించడమే కృష్ణావతారం ప్రత్యేకత. లోకంలో అధర్మం ఎక్కువ అవడంతో భూదేవి, బ్రహ్మదేవులు ప్రార్థన విని భగవంతుడైన మహావిష్ణువు దేవకి వసుదేవులకు కృష్ణునిగా జన్మించాడు.
శ్రీకృష్ణుని జననం:
ద్వాపర యుగంలో మధురానగరం యాదవ రాజుల రాజధానిగా ఉండేది. యాదవ రాజులలో శూలశ్రేణుడు ప్రసిద్ధి చెందిన వాడు. ఆయన కుమారుడు శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. మధురను ఉగ్రసేనుడని రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడే కంసుడు ఆయన స్వార్థపరుడు. రాక్షసుల ప్రవర్తన కలిగిన వాడు. ఆయనకు తన చెల్లెలి దేవకి అంటే పంచప్రాణాలు, ఆమె అంటే అమితమైన ప్రేమ.దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేస్తారు. దేవకి, వసుదేవులను ఇంటికి పంపించడానికి తానే స్వయంగా రతాన్ని అలంకరించి, రథసారధిగా నడుపుతాడు.
ఆ సమయంలో ఓయి కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్లే నీ ప్రాణగండం ఉంది. ఆ బిడ్డ చేతులలో నువ్వు మరణిస్తావని అని ఆకాశవాణి చెబుతుంది. అది విన్న కంసుడు కోపంతో దేవకిని చంపబోతాడు. వసుదేవుడు నీ చెంత చెల్లెల్ని చంపుతావా, ఆమెకు పుట్టబోయే బిడ్డ వల్ల కదా నీకు మరణం, ఈమె వల్ల కాదు కదా అని అంటాడు. మాకు పుట్టిన ప్రతి బిడ్డను తెచ్చి నీకు అప్పగిస్తాను దేవకిని విడిచిపెట్టమని కోరుతాడు. అలాగేనని వారిని ఇంటికి పంపిస్తాడు. కొన్ని రోజులకు దేవకి వసుదేవులకు ఒక శిశువు జన్మిస్తుంది. వసుదేవుడు ఆ శిశువును తెచ్చి కంసునికి ఇవ్వగా, తన నిజాయితీకి మెచ్చుకొని మీకు కలిగిన ఎనిమిదవ సంతానం వల్ల కదా నాకు ఆపద, ఈ శిశువును తీసుకెళ్లి సంతోషంగా ఉండమని కంసుడు అంటాడు.
ఒకరోజు నారదుడు కంసుని వద్దకు వచ్చి నువ్వు పోయిన జన్మలో కాలమనేని అనే రాక్షసుడువి, నీ పాపాలు ఈ జన్మలో పండాయి. వసుదేవుడు రేపల్లెలో ఉండే యాదవులు దైవ వంశ సంభూతులు, దేవకి వసుదేవులకు శ్రీమహావిష్ణువు పుట్టబోతున్నాడు. అతని చేతిలో నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. అది విన్న కంసమహారాజు కోపంతో మధురానగరంలో ఉన్న దేవకి వసుధవులను తెచ్చి చెరసాలలో బందీగా ఉంచుతాడు. అక్కడ కాపలాదారులను నియమిస్తాడు. అక్కడ ఏటా సంతానం కలిగింది. ఆ బిడ్డలను కంసుడు హతమారుస్తాడు. అలా ఆరుగురు బిడ్డలను చంపేశాక దేవకి కి ఏడవ సంతానంగా ఆదిశేషుడిని గర్భం దాలుస్తుంది. దేవుని అంశం వల్ల, యోగ మాయ వల్ల దేవకి ఆదిశేషుని నందనవనంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది.
రోహిణి నందుడు రెండవ భార్య. ఇక్కడ కంసుడి భార్య రేవతికి గర్భం పోతుంది. అక్కడ రోహిణి ఆదిశేషుడి అవతారమైన బలరామునికి జన్మనిస్తుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకు దేవకి ఎనిమిదవ సారి గర్భం దాలుస్తుంది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వల్లే నాకు ఆపద అని, కంసుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని, బిడ్డ పుట్టగానే నాకు చెప్పమని సైనికులకు ఆదేశాన్ని ఇస్తాడు. మహావిష్ణువు దేవకి గర్భంలో పెరుగుతున్నాడని విషయం తెలుసుకున్న దేవతలు ,కిన్నెరలు, కిమ్పురుషులు అక్కడికి వచ్చి స్తుతిస్తూ శ్రావణమాసంలో రోహిణి నక్షత్రంలో బహులాష్టమి రోజున వృషభ లగ్నంలో శ్రీకృష్ణునికి జన్మనిస్తుందని చెబుతారు. దేవకి అష్టమి రోజున కృష్ణునికి జన్మనిచ్చింది.
కృష్ణుడు జన్మించగానే పూల వర్షం కురిసింది. దేవతా మృదంగాలు మోగాయి. శిశువు నుండి మహావిష్ణువు తన పూర్వ వైభవంతో కనిపిస్తాడు. అప్పుడు విష్ణువు వారితో మాట్లాడి కంసుడు నన్ను చంపుతాడని మీరు భయపడవద్దు నేను చెప్పినట్టు వినండి అని చెప్పి శిశువు రూపంలోకి మారతాడు. వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్టలో పడుకోబెట్టుకొని బయలుదేరగానే ఆయన చేతులకు ఉండే సంకెళ్లు తెగిపోయాయి, చెరసాల తలుపులు తనంతట అవే తెరుచుకున్నాయి, సైనికులు గాఢ నిద్రలో ఉన్నారు, వర్షం పడుతుండగా యమునా నది రెండుగా చీలి వసుదేవునికి దారిని చూపిస్తుంది.
ఆదిశేషుడు తన పడగలతో శ్రీకృష్ణునికి గొడుగుల ఉంటాడు. రేపల్లెలో నందుడి భార్య యశోద ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆయన కృష్ణుని అక్కడ ఉంచి ఆ బిడ్డను తీసుకొని తిరిగి చెరసాలకు రాగానే చెరసాల తలుపులు అవే మూసుకొని పోతాయి సంకెళ్లు వసుదేవుని చేతులకు చేరుతాయి. ఆ తర్వాత ఆ బిడ్డ ఏడుస్తుంది. ఆ ఏడుపు విని సైనికులు లేచి కంసునికి విషయం చెబుతారు. నిన్ను చంపేది మగ బిడ్డ కానీ నాకు ఆడబిడ్డ పుట్టిందని చంపవద్దని బ్రతిమాలుతుంది దేవకి. కంసుడు వినకుండా ఆ బిడ్డను చంపబోతాడు అప్పుడు ఆ శిశువు ఆకాశంలోకి వెళ్లి నిన్ను చంపే బిడ్డ నేను కాదు. వేరే చోట రేపల్లెలో నందుడు, యశోదల దగ్గర పెరుగుతుంది. అతని చేతిలో నువ్వు మరణించడం ఖాయం. నువ్వు నన్ను ఏమీ చేయలేవని చెప్పి అక్కడి నుండి మాయమవుతుంది.
కంసుడు ఆ శిశువును గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ నందుడు, యశోదరకు మొట్టమొదటిగా పుట్టిన సంతానం మగసంతానమని సంతోషించి. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టి. రేపల్లెలో పెద్ద పండుగగా జరిపించాడు. ఈ విధంగా చేసినందు వల్ల కృష్ణుడు పుట్టిన అష్టమని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారని మన పూర్వీకుల నుండి విన్న కథనం ద్వారా తెలుస్తుంది.