lang="te"> జీవో 111'పై మరికొంత సమయం. - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

జీవో 111’పై మరికొంత సమయం.



ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి

ఈ మేరకు హైకోర్టు ను కోరాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్

సమగ్ర చర్చ, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి

ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని పురపాలక శాఖ అధికారులకు సూచన

నగర సమగ్ర అభివృద్ధి పై సమీక్ష

Hyd: జీవో నెంబర్ 111పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.

సమగ్రమైన చర్చ, నిర్ధిష్టమైన ప్రణాళిక మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో జీవో 111 పై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపడానికి ఇంకా కొంత వ్యవధి ఇవ్వాల్సిందిగా గా హైకోర్టును కోరాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశం నిర్ణయించింది. ఇటీవలే ఈ కేసు విచారణ సందర్భంగా జీవో 111 పై వైఖరేమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, జంట జలాశయాల్లో కాలుష్యం నుంచి రక్షించే ఉద్దేశంతో పది కిలోమీటర్ల వరకు క్యాచ్మెంట్ ఏరియా ను బఫర్ జోన్ ప్రకటించి ఆ ప్రాంతంలోని రకాల నిర్మాణాలను నిషేధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 111 జారీ చేసింది. తాజాగా ఈ జీవో పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోసం పరిధిలోని గ్రామాల్లో, భూములు, యజమానులు స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇవ్వాలి
జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో లక్షా 32 వేల భూమి ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సుమారు జిహెచ్ఎంసి విస్తరించి ఉన్న ప్రాంతానికి సరి సమానం అని చెప్పారు. హైదరాబాద్ కు అనుబంధంగా హెచ్ఎండీఏ పరిధిలో విస్తరిస్తున్న ప్రాంతం. ఇంకొక కొత్త నగరానికి సమానమైన వర్షాలతో ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాంతాన్ని నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దు కాకపోతే జలాశయాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు.

అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటి నుండే సమగ్ర ప్రణాళికతో, గ్రీన్ జోన్ లు, సివరేజ్ మాస్టర్ ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలతో రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.