lang="te"> దళిత బంధుపై ఈ నెల 27వ తేదీన సీఎం కేసీఆర్ సమీక్ష - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

దళిత బంధుపై ఈ నెల 27వ తేదీన సీఎం కేసీఆర్ సమీక్ష



CM KCR సెప్టెంబర్ 27న దళిత బంధుపై ప్రగతిభవన్ లో సమీక్షించనున్నారు.



ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజాంబాద్, జిల్లాకు చెందిన మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లు హాజరుకానున్నారు.

మొదటగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ పథకం అమలు చేయగా, తాజాగా మరో నాలుగు మండలాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తూ నాలుగు నియోజకవర్గాల్లో ఈ నాలుగు మండలాల ను ఎంపిక చేశారు. ఆ మండలంలోని అన్ని దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందించనున్నారు.

దళితు బంధు అమలు కానున్న మండలాల్లో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో లో చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం.