కామారెడ్డి లో మంకీ ఫాక్స్ కలకలం

తెలంగాణలోని కామారెడ్డి లో మంకీ ఫాక్స్ కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్నట్టు బయటపడింది. కామారెడ్డికి చెందిన ఒక వ్యక్తి  ఈనెల 6 తేదీన కువైట్ నుంచి కామారెడ్డి కి వచ్చాడు.

సుమారు 15 రోజుల తర్వాత అతనికి జ్వరం రావడంతో సాధారణట్రీట్మెంట్ తీసుకున్నాడు.ట్రీట్మెంట్ తీసుకున్న మరుసటి రోజున అతని శరీరం మొత్తం  దుద్దుర్లు రావడంతో అనుమానంతో కామారెడ్డి లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు.ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది అతని యొక్క లక్షణాలను బట్టి మంకీ ఫాక్స్ గా అనుమానం వ్యక్తం చేశారు. అతని యొక్క రక్త నమూనాలను సేకరించి వాటిని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించడం జరిగింది.

ఆ వ్యక్తిని మంకీ ఫాక్స్ సోకిందని అనుమానంతో ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆ వ్యక్తి తో కాంటాక్ట్ అయినా సుమారు ఐదు మంది వ్యక్తులను కూడా పరీక్షిస్తున్నారు.మరియు వారందరినీ కూడా ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచారు.ఈ విషయం గురించి మాట్లాడుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు తెలంగాణలో మంకీ ఫాక్స్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని,ప్రత్యేక శ్రద్ధ చేపట్టిందని ప్రజల ఎవరు కూడా భయాందోళనలకు గురి కావద్దని తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker