రాజ్యసభ సభ్యులు జీవీల్ నరసింహారావు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ రోజు పర్యటించారు. 19 వార్డులో వ్యాక్సిన్ కేంద్రం పరిశీలించి, నరసరావుపేట రైల్వే స్టేషన్లో ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.
పల్నాడు ప్రాంత రైతులు మిర్చి మార్కెటింగ్ కోసం గుంటూరు దాకా వెళ్లాల్సి వస్తుంది కావున వారి సౌకర్యార్థం పల్నాడు ప్రాంతంలోనే మిర్చి బోర్డు ఏర్పాటు కు కృషి చేస్తామన్నారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి ప్రాంతంలో పర్యటిస్తాను
యువకులు అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొని థర్డ్ వేవ్ ఎదుర్కోవాలని కోరిన జీవిల్, నరసరావుపేట
రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే మినిస్టర్ తో మాట్లాదానన్నారు.
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల ప్రాంతంలో కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఎమ్మెల్యే గోపి రెడ్డి గారు ప్రతిపాదన చేశారు దాని గురించి దాని గురించి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి త్వరలోనే కార్యచరణ ఏర్పాటు చేస్తానని ఎంపి తెలిపారు.