Vijayawada: “టంగుటూరి ప్రకాశం పంతులు” చిత్రపటానికి నివాళి అర్పించిన Ex: నీటిపారుదల శాఖ మంత్రి

స్వాతంత్ర్య సమరయోధుడు, మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆంగ్లేయుల తుపాకులకు రొమ్ము చూపి వ్యక్తి టంగుటూరి, దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి: 23 సోమవారం ఆగస్టు 2021 ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, నాటి స్వాతంత్ర్య పోరాటంలో తుపాకీగుండుకు ఎదురుగా గుండెను నిలిపి బ్రిటిష్ వారిని గడ గడ లాడించిన ‘ఆంధ్ర కేసరి’  టంగుటూరి ప్రకాశం పంతులు గారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు.

గొల్లపూడి కార్యాలయంలో సోమవారం నాడు ఆంధ్రకేసరి 150వ జయంతిని పురస్కరించుకుని మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరాడంబరత. నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదురించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు గారి నైజమన్నారు. 

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్ర కేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని గుర్తు చేశారు. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, టిడిపి అంగనవాడి అనుబంధ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.