ప్రేమ్ ప్రేమను అంగీకరించనున్న హిమ:
సౌర్య నిరుపమ్ లకు భోజనం తీసుకొని వస్తారు హిమ ,ప్రేమ్. లోపల శౌర్య ,నిరుపమ్ నిశ్శబ్దంగా ఉండడం చూసి వీళ్ళు ఏమి మాట్లాడుకోలేదు ఏంటని వీళ్ళు ఇలా ఉంటే ఎప్పుడూ ఫ్రెండ్స్ అవుతారు అని అనుకుంటూ ఉంటారు. వాళ్లను కలపడానికి ప్రేమ్ ఒక ప్లాన్ ఆలోచించి ఇద్దరికీ కలిపి ఒకే పార్సిల్ను సౌర్యను పిలిచి ఇస్తాడు. నిరుపమ్ తనకు కావాలని అడుగుతాడు. ఈ టైంలో దొరికింది రెండే ఒకటి మీకు ఒకటి మాకు సర్దుకొని తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు హిమ, ప్రేమ్. ఇది నిన్న జరిగిన 1420 ఎపిసోడ్ కథ.
భోజనం లేనందువలన నిరుపం ఏం చేశాడో ఈరోజు తెలుసుకుందాం.
సౌర్య నిరుపముతో కలిసి, హిమ ప్రేమ్ తో కలిసి భోజనం చేయటం. సౌర్య నేను నీకు భోజనం ఇవ్వను అంటూ నేనొక్కదాన్నే ఎలా తింటాను అనుకున్నారు. ఇద్దరం కలిసి తిందాం రండి అంటూ నిరపమును పిలిచి ఇద్దరు కలిసి ప్లేట్లో తింటారు.
హిమా ,ఫ్రేములు కూడా ఒకే పార్సల్ షేర్ చేసుకొని తింట్టు క్యాండిలైట్స్ డిన్నర్ అని అనుకుంటూ ఉంటారు. నీరుపమ్, శౌర్య కలిసి భోజనం చేస్తున్నప్పుడు సౌర్య మంచిదని, నేను తనను బాధ పెట్టానని నిరుపమ్ పాత జ్ఞాపకం గుర్తుకు చేసుకుంటాడు. సౌర కూడా అదే గుర్తుకు చేసుకుంటుంది కలిసి భోజనం పంచుకుంటున్నాం కానీ జీవితం పంచుకోలేకపోతున్నామని తనమనసులో అనుకుంటుంది.
నిరుపమ్ ,ప్రేమ్ ని పిలిచి కార్లో బెడ్ షీట్ ఉందని వెళ్లి తెచ్చివ్వు అని అడగగా ప్రేమ్ తెచ్చి ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ప్రేమ్ ను, హిమ బావ మంట ఎందుకు పెడుతున్నావు అని అడుగుతుంది. ఎక్కువ చల్లగా ఉంది .ఇలాంటి ప్రదేశాల్లో జంతువులు తిరుగుతూ ఉంటాయి. మంట వేయడం వల్ల దగ్గరికి రావు అని నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో కాపాడే బాధ్యత నాది అని ప్రేమ అంటాడు. అప్పుడే నిప్పురవ్వ హిమ కంట్లో పడినట్టుగా, ప్రేమ్ తనకు హెల్ప్ చేస్తున్నట్టుగా తననే చూస్తూ ఉన్నట్టుగా కలకంటాడు.
ప్రేమ్ ప్రేమ విషయం తెలుసుకున్న హిమ: కొద్దిసేపటి తర్వాత వాళ్లు రూమ్ లో ఏం చేస్తున్నారు చూసి వస్తాను అని సెల్ ఫోన్ మర్చిపోయి అక్కడే పెట్టి వెళ్తాడు ప్రేమ. హిమ తన ఫోన్ తీసి హిమను చిన్నప్పటినుండి ప్రేమిస్తున్నాడని వీడియోను చూసి నిజం తెలుసుకుంటుంది. ఇంతలో అక్కడికి ప్రేm వచ్చి నాకు ఫోన్ ఏమైనా వచ్చిందా అని అడగగా ఫోన్లో ఉన్న వీడియోను చూశాను అంటుంది హిమ. ఈ వీడియో నీకోసమే చేశాను. నీకు పంపించాను. అప్పుడే నీ ఫోన్ పాడైందని. సమాధానం చెప్పు అంటాడు ప్రేమ్. జీవితంలో అతిపెద్ద ప్రశ్న జీవితమే జీవితం లో అనుకున్నవి జరగవు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హిమ.
నీ ప్లేస్ లో హిమ ఉంటే సర్దుకునే వాడిని అన్న నిరూపం: నిరుపమ్ నిద్రలో నుంచి లేచి నేను ఇక్కడ ఉండగా శౌర్య పడికోయింది. శౌర్యకు ధైర్యం ఎక్కువగానే ఉంది. చలిగా ఉన్నట్టుంది అని బెడ్షీట్ కప్పి వెళ్లి పడుకుంటాడు. సౌర్య లేచి మళ్ళీ బెడ్షీట్ కప్పుతుంది.
నాలాంటి పేదలకు ఇది అలవాటే ,మీరు తట్టుకోలేరు, ఇవన్నీ మీకు కొత్త అంటూ ఉండగానే నీ ప్లేస్ లో హిమ ఉంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఉంటాను. మనం ఎక్కడ ఉన్నాం కాదు ఎవరితో ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అంటాడు నిరుపమ్. సౌర్య ఏమీ మాట్లాడకుండా వెళ్లి పడుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది . నిరుపమ్, హిమ గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. తెల్లవారగానే లేచి ప్రేమను పిలుస్తూ ఉంటాడు.
ఇదిఈరోజు జరిగిన 14 21 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.