కార్తీకు గురించి మౌనితను నిలదీసిన దీప:
డాక్టర్ దగ్గరికి ఒకతను రాగానే క్యాంప్ గురించి మర్చిపోయావా, ఈరోజు డేట్ మర్చిపోయావా క్యాలెండర్ చూడమనగా ఈరోజు 22 అని అంటాడు. దీపకు కార్తీక్ తాళి కట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. సరే నాలుగు రోజుల్లో క్యాంపు పెడతామని చెప్పి వెళ్ళమంటాడు. క్యాలెండర్ చూడగానే ఎందుకు ఏడుస్తున్నావ్ అని డాక్టర్ అడగగా, మా పెళ్లి రోజు, భర్తతో సంతోషంగా ఉండాల్సిన రోజు, ఆయన చూస్తే గుర్తుపట్టకుండా ఉన్నారని దీప అంటుంది. ఇది నిన్న జరిగిన 1437 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్.
మౌనవ్రతానికి సార్ నిద్ర లేవకుండా ఉండడానికి ఈరోజుకు ఏదైనా సంబంధం ఉందా అని అనుమానించిన శివ: తెల్లవారుగానే శివ వచ్చి నిద్రపోతున్న కార్తీక్ ను తెల్లవారింది లేవమంటాడు. తెల్లవారితే నేనేం చేయాలి ,అందర్నీ నేనే లేపాలా అయినా తెల్లవారితే లేవకపోతే మీ మేడం అరిచి గోల చేసేది. అని అంటాడు కార్తీక్. మేడం మౌనవ్రతం అని రాసి ఇచ్చింది, అయినా సార్ ని తట్టి లేపేది కదా మేడం వ్రతానికి, సార్ను నిద్ర లేపకుండా ఉండడానికి ఈరోజుకు ఏదైనా సంబంధం ఉందా అని శివ ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. ఇక్కడ దీప పెళ్లిరోజు ఏర్పాటు చూసి ఏడుస్తూ కేక్ కట్ చేస్తుంది.
సౌందర్యను బెదిరించిన హిమ: సౌందర్య శౌర్య గురించి ఆలోచిస్తూ ఉండగా హిమ వచ్చి బయలుదేరండి ,సౌర్య దగ్గరికి అని చెప్పి వెళ్దాం అంటుంది. అది పిలిస్తే రాదు, నన్ను కూడా రావద్దండి అని సౌందర్య అంటుంది. ఎందుకు రాదు తప్పకుండా వస్తుందని హిమ అంటుంది. శౌర్య పట్టుదలతో ఉంటుంది, తన కోపం తగ్గేదాకా మనం వెయిట్ చేద్దాం అంటాడు ఆనందరావు. అమ్మ నాన్న శౌర్యను చూసుకోమని చెప్పిన మాటలే వినిపిస్తున్నాయి అంటూ, నేను భోజనం చేయకుండా, స్కూల్ కి వెళ్లకుండా ,నిద్రపోకుండా సౌర్యలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అన్నీ జరుగుతాయని అంటుంది. కొడుకు, కోడలు దూరమయ్యారు, సౌర్య వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది వెళ్ళిపోతే మనం ఎవరి కోసం బతకాలి అని చెంప మీద హిమను కొడుతుంది సౌందర్య. నేను చెప్పింది, సీరియస్ గానే చెప్పాను. నాకు శౌర్య కావాలి, లేకపోతే నేను బతకలేను అని హిమా అంటుంది .మనం సౌర్య దగ్గరికి వెళ్దాం అని ఆనందరావు అంటాడు.
కార్తీక్ గుర్తుపట్టకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకుంటానన్న దీప: కార్తీక్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ,మనిషిని పోలిన మనుషులు ఉంటారు, అలాంటివారు ఎంతమంది ఉన్నా నేను మిమ్మల్ని గుర్తు పడతాను, మిమ్మల్ని నా కంట పడనివ్వకుండా చేసినవాడు ఎవడు ఎందుకు మీరు నన్ను గుర్తు పట్టలేదు, అని తెలుసుకొని నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను అని నిర్ణయించుకొని ,డాక్టర్ తల్లి దగ్గరకు వచ్చి బయటికి వెళ్లి వస్తానని చెబుతుంది దీప.
ఎందుకమ్మా నీకు ఏదైనా పని ఉంటే ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు కదా అని అంటుంది డాక్టర్ తల్లి. లేదు నా భర్త కోసం వెతకడానికి వెళ్తున్నాను అంటుంది దీప. వెళ్ళిరా అమ్మ నీ ప్రేమ ఎక్కడికి పోదు, నీ డాక్టర్ బాబు నీకు కనిపిస్తాడు అని అంటుంది డాక్టర్ తల్లి. డాక్టర్ కాఫీ తెచ్చి ఇస్తాడు ,కాఫీ తాగి వెళ్ళు తప్పకుండా దొరుకుతాడని చెప్తాడు. నేనంటే ఆయనకు ఎంతో ఇష్టం, కొన్ని కారణాలు దూరం చేసిన, నేనంటే ప్రాణం ఆయన ఎప్పుడూ ఎడమవైపునే నన్ను ఉండాలని అనుకునేవారు, ఎందుకంటే గుండె ఎడమ పక్కనే ఉండేది, నీ స్థానం అక్కడే అని చెప్పి ఆయన గురించి తెలుసుకుంటాను అని వెళ్ళిపోతుంది.
అమ్మానాన్నల గురించి వెతకాలి అన్న సౌర్య: సౌర్య యాక్సిడెంట్ గురించి తలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. చంద్రమ్మ వచ్చి సౌర్య ఏడవద్దమ్మా, ఇలా ఏడుస్తే మేము సరిగ్గా చూసుకోవడం లేదు అనుకుంటారని అంటుంది. ఎవరో తెలియని ఆడపిల్లని దత్తత తీసుకొని పెంచుకునే మిమ్మల్ని ఎవరు ఏమంటారు అని సౌర్యం అంటుంది. అమ్మ నాన్నలు గుర్తుకొస్తే ఏడుపు ఆగడం లేదని అంటుంది వాళ్లు బ్రతికే ఉన్నారు ,వాళ్ళు హాస్పిటల్లో లేరు అందుకే వాళ్ళు బతుకే ఉన్నారని వాళ్ళని వెతుకుదాం అని సౌర్యం అంటుంది.
నువ్వు ఆటో నేర్చుకుంటాను అన్నావుగా, ఆటోను తెస్తాను నేర్చుకుంటూ అమ్మానాన్నలను వెతుకుదాం అని గండ అంటాడు. సరే అనిసంతోషంగా ఇంట్లోకి వెళుతుంది సౌర్య. నువ్వు ఎందుకు అలా చెప్పావు అని చంద్రమ్మ అంటుంది. అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అందుకే ఆటోను నేర్పిస్తే ఆలోచనల నుండి బయటకు వస్తుంది అని గండ అంటాడు.
ఇది ఈరోజు జరిగిన 1438 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.