కార్తీక్ కు గోరుముద్దలు తినిపిస్తున్న మోనిత, దుఃఖంలో దీప: ఈరోజు ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.
వెతకని నీ భర్త తనకే కనిపిస్తే ఏం జరుగుతుంది అని అంటుంది డాక్టర్ తల్లి. నాలుగు తన్ని నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని చెప్పి, నా గురించి అడుగుతాడని అంటుంది దీప. దాన్ని ఓవర్ యాక్షన్, ఏడుపు చూస్తే నాకు భయమేస్తుంది, అది అలా చేసిన ప్రతిసారి నాకు నా భర్తని దూరం చేస్తుందని దీప అంటుంది.
ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ 1440 ఎపిసోడ్ కార్తీకదీపం కథ.
కార్తీక్ గురించి దీప తెలుసుకుందో లేదో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
కార్తీక్ గురించి ఆలోచించమని చెప్పిన డాక్టర్ తల్లి: నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది మౌనిత గురించి కాదు. నీ భర్త గురించి, నీ భర్తను నువ్వు గుర్తుపట్టి నువ్వు వెళ్లి మాట్లాడితే, ఎవరు అని అడిగాడు కదా, అసలు ఆయన నీ భర్త నా, కాదు అతను నీ భర్త అయితే తీసుకెళ్లింది ఎవరు? ఎందుకు నీతో అలా మాట్లాడాడు. వీటి గురించి తెలుసుకో, నీ సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ తల్లి దీప కు చెబుతుంది.
ఈ మతిమరుపు ఏంటో అర్థం కావడం లేదు అని అన్న కార్తీక్: సార్ ఏమీ మాట్లాడకుండా ఎందుకలా చూస్తున్నాడో అర్థం కావడం లేదు అని ఇద్దరు లేడీ టాప్ స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కస్టమర్స్ వచ్చి మీ మేడం లేదా అని అడుగుతారు. లేరు స్టాక్ వచ్చిందని తీసుకురావడానికి వెళ్లారు అని సమాధానం ఇస్తారు. డ్రెస్సులు తీసుకున్నాం డబ్బులు ఇవ్వడానికి వచ్చామని చెబుతారు.
మేడం లేరు, సార్ కు వెళ్లి ఇవ్వమని స్టాఫ్ చెప్తారు. వాళ్ళు వచ్చి కార్తిక్ ను పిలవగానే, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? టైం అయిందా? మీ మేడం వచ్చేవరకు ఉండండి. వెళ్లి పని చూసుకోమని అంటాడు. కార్తీక్ ఇంతలో స్టాఫ్ అమ్మాయిలు వచ్చి సార్ వాళ్ళు కస్టమర్స్, డబ్బులు ఇవ్వడానికి వచ్చారని అంటారు. ఏంటో ఈ మతిమరుపు ఏమీ అర్థం కావడం లేదు, అన్ని మర్చిపోతున్నాను, డబ్బులు తీసుకోమని చెప్పిందా అని మనసులో, అనుకొని సరే డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఎంత అయింది అని అడుగుతే ఏమీ గుర్తులేదు అని అనుకొని, డ్రెస్లపై ఉంటుంది కదా అంతే ఇవ్వండి అని అంటాడు. కస్టమర్స్ 30% డిస్కౌంట్ ఉంది అన్నారు కదా అంటే అలాగే అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు.
శివను పోలీసులకు పట్టిస్తానన్న దీప: శివను దీప గుర్తుపట్టి నాటకాలు ఆడుతున్నావా, నా డాక్టర్ బాబును వెతుకుతూ ఉంటే, పక్కనే పెట్టుకొని తెలియదు అంటావా అని బెదిరిస్తుంది. నేను చెప్పలేను, చెబితే చంపేస్తారని అంటాడు. మర్యాదగా చెప్పలేదంటే, నా గొలుసు దొంగతనం చేస్తూ పారిపోతుంటే పట్టుకున్నానని పోలీసులకు అబద్ధం చెబుతానని చెప్పి బెదిరిస్తుంది దీప. ఇంతలోమోనితో వచ్చి శివ కాలర్ పట్టుకుని నీకు కార్తీక్ గురించి తెలుసా? కార్తీక్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది.
అక్కడ దీప, మోనిత ,శివ కాలర్ పట్టుకుని కొట్లాడుకుంటారు. మౌనిక దీప ను తోసేసి శివను అక్కడి నుండి తీసుకొని వెళుతుంది. ఆయన గురించి తెలుసుకునే లోపల దీన్ని ఎందుకు పంపించావు దేవుడా, ఆయన్ని నాకు కాకుండా ఇది ఏం చేస్తుందో అని దీప అనుకుంటుంది.
కార్తీక్ తో నేనే నీ భార్యను అని చెప్పిన మౌనిత: ఇక్కడ మౌనిక కార్తీక్ కు ప్రేమగా టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. కార్తీక్ వద్దు నేను చిన్నపిల్లడినా అని అంటాడు. నీకు తెలియదు నువ్వు నాకు ఎంతో అపురూపం. నీకోసం ఎన్నో జన్మల తపస్సు చేశాను. నీకోసం పడ్డ ఆరాటం, పోరాటం ఎంత చెప్పినా తక్కువే అని అంటుంది మోనిత. నీ పేరు ఏంటి అని అడుగుతాడు .మౌనిత అని చెప్పి, మనిద్దరం భార్యాభర్తలమని గుర్తుకు చేస్తుంది.
నేను బయటకు వెళ్లి వస్తాను అని అంటాడు. ఎందుకని మౌనిత వద్దు అని అంటుంది. ఎందుకు అని ప్రశ్నిస్తాడు కార్తీక్. దీపం గుర్తుకు చేసుకొని వెళ్ళకూడదని నీకు ప్రమాదం అని చెబుతుంది. ఎవరివల్ల, ఎందుకని అడిగి, నేను ఏమైనా జంతువునా, కాదు మనిషిని బయటికి వెళ్లాలి, వెళితే శివని పెట్టి పంపిస్తావు. వాకింగ్ కని వెళ్తే కారులో వెళ్ళమంటావు.
స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు అని అంటాడు కార్తీక్. నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఇంతకు నా భార్యవేనా, ఆవిడ ఎవరో డాక్టర్ బాబు అంటు నా వెంటపడుతుంది. గోడమీద ఫోటోను, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నా భార్య అనుకోవడం తప్ప నాకు ఏమీ గుర్తులేదు అంటాడు. నీకు నాకు ఏ సంబంధం లేకపోతే నిన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే నాకు వచ్చే లాభం ఏంటి? నీకేమైనా ఆస్తులు ఉన్నాయా అంటే అన్ని మర్చిపోయావు.
ఎవరైనా ప్రేమగా చూసుకునే భర్త కావాలని అనుకుంటారు గానీ ఇలా ఎప్పటికప్పుడు మర్చిపోయా భర్త కావాలని ఎవరూ కోరుకోరు. నేను నిన్ను భరిస్తున్నాను అంటే నీ భార్యను కాబట్టి అంటుంది మౌనిత. నీకు జరిగిన ప్రమాదం గురించి చెబితే నువ్వు విని తట్టుకోలేవు .ఒక్కడినే బయటికి వెళ్ళమని పంపిస్తే మతిమరుపుతో ఎక్కడ ఇల్లు మర్చిపోయి ఇంటికి వస్తావో, రావో అని సమాధానం ఇస్తుంది.
సౌర్యం ఇంటికి రమ్మని పిలిచిన ఆనందరావు: సౌర్య కోసం హిమ, సౌందర్య, ఆనందరావు తిరిగి ఇండియాకు వస్తారు. మీరు బయట ఉండండి. నేను వెళ్లి సౌర్య ను కలిసి ఇంటికి రమ్మని పిలుచుకొని వస్తానని ఆనందరావు అంటాడు. ఇంత దూరం వచ్చి దానిని చూడకుండా ఇక్కడే ఉండాలా అని సౌందర్య అంటుంది. ఇంతలో సౌర్య బయటకు వస్తుంది తనను చూసి అందరూ ఏడుస్తూ గతాన్ని గుర్తుకు చేసుకుంటారు.
యువరాణిలా పెరగాల్సిన నా మనవరాలిని ఇలా చేశావు ఏంటి దేవుడా అని దగ్గరికి వెళ్ళబోతుంది సౌందర్య. హీమ, సౌందర్య నుఆపి తాతయ్య వెళ్లి మాట్లాడుతారు అని చెప్పి మనం ఇక్కడే ఉంటే తను రాదు, మనం దూరంగా ఉండి చూద్దాం అని హిమ, సౌందర్యను తీసుకొని వెళుతుంది. శౌర్య ఆనందరావును చూసి నువ్వు ఒక్కడివే వచ్చావా? అందరినీ తీసుకొని వచ్చావా? అయినా నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది శౌర్య.
ఇక్కడికి ఎవరూ రావద్దు అన్నాను కదా అని అంటుంది. నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాము. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో అని బెంగగా ఉంది. రాకుండా, చూడకుండా ఉండలేము ఇంకా ఎన్నాళ్లు నీ కోపం. ఇంటికి వెళదాం రా అని అంటాడు. శౌర్య నేను రాను అని సమాధానం ఇస్తుంది. ఎందుకు నా మీద కోపమా అని అంటాడు. నీ మీద కోపం కాదు, ఆ హిమ మీద కోపం. ఎందుకని అడగగా, అమ్మ, నాన్నలు దూరం కావడానికి కారణం తను.
అందుకే తన మీద నాకు అంత కోపం అని సౌర్య అంటుంది. అమ్మా,నాన్నలే వచ్చి పిలిచేదాక నేను ఇంటికి రాను అని చెబుతుంది శౌర్య. అమ్మానాన్నల ఇంకెక్కడున్నారు వాళ్లు అని ఆనందరావు అంటాడు. లేదు వాళ్లు బతికే ఉన్నారు. వాళ్ళు కనిపించగానే అప్పుడు వచ్చి హిమతో మాట్లాడుతాను అని సౌర్య ఆనందరావుకు చెబుతుంది.
ఇది ఈరోజు జరిగిన 1441 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ:
కార్తీక్ మౌనిత దగ్గరే ఉన్నాడని దీపా తెలుసుకుంటుందో లేదో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.