కార్తీక్ ను కలుసుకోబోతున్న దీప:
డాక్టర్ తన తల్లికి దీపను పరిచయం చేస్తాడు. నువ్వు తొందరగా కోలుకోవాలని దేవుని ఎంతగానో కోరుకున్నాను. నీకు అలా జరిగినప్పటి నుంచి ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి నీ ప్రాణాలను నిలబెట్టాడు దేవుడు. ఈ రోజు మనకు కష్టం వచ్చిందని దేవుని తిట్టుకోకూడదు. ఏదో ఒక రోజు కచ్చితంగా ఫలితం వస్తుందని చెబుతుంది డాక్టర్ తల్లి .ఇది నిన్న జరిగిన కార్తీకదీపం 1432 ఎపిసోడ్ కార్తీకదీపం పూర్తి కథ.
తల్లి కోరిక తీర్చడంలో తప్పు లేదన్న దీప: డాక్టర్ తల్లి దీప తో మాట్లాడి ఇద్దరు వ్యక్తులను పిలిచి మంచిగా వంట చేయమని చెప్తుంది. మీ వంట తిని నాలుక చచ్చి పడిపోయింది. ఈ రోజైనా బాగా చేయండి అని చెబుతుంది. అది విన్న దీప వంట గది ఎక్కడమ్మా, నేను వంట చేస్తాను అని అంటుంది. ఎందుకని డాక్టర్ తల్లి అనగా తల్లి కోరిక తీర్చడంలో తప్పు లేదని వంటగదికి వెళ్ళిపోతుంది దీప.
సౌర్యం హైదరాబాద్ తీసుకొని వెళ్లడానికి ఒప్పించిన చంద్రమ్మ, గండ: సౌర్య దగ్గరికి తను పిన్ని బాబాయ్ అని పిలిచే చంద్రమ్మ, గండ వస్తారు. మీ బాబాయి చెప్పేది నువ్వు ఆడపిల్లవని, పెద్దింటి పిల్లవని ,ఏమీ లేని వాళ్ళ దగ్గర ఎలా ఉంటావు అని అక్కడికి వెళ్ళమంటున్నాడు అని అంటుంది. అమ్మ నాన్నలను దూరం చేసిన ఆ హిమ ఉన్న ఇంటికి నేను వెళ్ళాలని సౌర్య అంటుంది.
మేము దొంగతనం చేసి బ్రతికే వాళ్ళం. అది కూడా అంతా తీసుకోకుండా, మాకు కావాల్సింది పెట్టుకొని మిగతాది అక్కడే పెట్టేస్తాం. అలాగే తను ఒక్కదానికోసం అందర్నీ వదిలేస్తానంటే ఎలా చెప్పని గండ అంటాడు. హిమ నచ్చకపోయినా, తాతయ్య నానమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఇష్టమే కదా. అమ్మానాన్నలు దూరమయ్యారని ఇంతగా బాధపడుతున్నావు.
నువ్వు దూరమైతే వాళ్లు ఎంత బాధపడతారు కదా అని చంద్రమ్మ అంటుంది. అప్పుడు సౌర్య, సౌందర్య పిలిచిన మాటలను గుర్తుకు చేసుకుంటుంది. మాకు పుట్టిన బిడ్డ నాలుగు నెలలు ఉన్నప్పుడే చనిపోయింది. ఇప్పటికే ఏడుస్తూనే ఉన్నాము అని చంద్రమ్మ చెబుతుంది. అది విన్న శౌర్య హైదరాబాదుకు వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
ఇక్కడ దీప, అక్కడ శౌర్య హైదరాబాదుకు బయలుదేరడం: దీప చేసిన వంట తిని డాక్టర్ తల్లి దీపను మెచ్చుకుంటుంది. అప్పుడు దీపకు కార్తీక్ గుర్తుకు వచ్చి ఏడుస్తుంది. రేపు హైదరాబాదు వెళ్తున్నావు కదా అని దీపను డాక్టర్ అడుగుతాడు. వెళ్తున్నాను పిల్లలను తీసుకొని వచ్చిన తర్వాత ఆయన కోసం వెతుకుతాను అంటుంది దీప. జరిగిన యాక్సిడెంట్ ని గుర్తుకు చేసుకొని ఏడుస్తూ దీప పిల్లల గురించి ఆలోచిస్తూ బయలుదేరుతుంది.
వాళ్లను కలిసి ఆయన బ్రతికే ఉన్నారని చెప్పి, ఆయన కోసం వెతకాలి అంటుంది అనుకుంటుంది. ఇక్కడ చంద్రమ్మ, గండలు శౌర్యన్ హైదరాబాద్ కు తీసుకొని వెళ్తూ, హిమను గురించి పట్టించుకోవద్దు. నానమ్మ, తాతయ్యలను గురించి ఆలోచించు. సంతోషంగా ఉండు .ఇక్కడ ఉన్న హిమవల్లే ఇలా జరిగింది అనుకుంటున్నావు. వాళ్ల దగ్గర ఉండే ఉంటే కొంత బాధ తగ్గుతుంది.
మేము ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వచ్చి చూస్తాం అని అంటారు. సౌర్య నాకోసం అక్కడకి వచ్చి కష్టపడొద్దు. ఇక్కడే ఉండమని వారితో అంటుంది. దీప బస్సు ఎక్కి హైదరాబాదుకు ప్రయాణం చేస్తూ కార్తీక్ ను గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. చంద్రమ్మ గండ హైదరాబాదుకు వెళ్తారు.
దీపా కార్తీక్ ఫోటోలను చూస్తూ బాధపడిన సౌందర్య: ఇక్కడ సౌందర్య ఆనందరావు, అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుని ,తయారవుతూ ఉంటారు. కార్తీక్, దీప ఫోటోలను చూస్తూ ఏడుస్తూ బాధపడుతుంది. సౌర్య ఫోటోలు చూస్తూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది హిమ. ఇది ఈరోజు జరిగిన 1433 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.