సౌర్యను కలుసుకోబోతున్న దీప:
డాక్టర్ తన తల్లికి దీపను పరిచయం చేస్తాడు. నువ్వు తొందరగా కోలుకోవాలని దేవుని ఎంతగానో కోరుకున్నాను. నీకు అలా జరిగినప్పటి నుంచి ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి నీ ప్రాణాలను నిలబెట్టాడు దేవుడు. ఈ రోజు మనకు కష్టం వచ్చిందని దేవుని తిట్టుకోకూడదు. ఏదో ఒక రోజు కచ్చితంగా ఫలితం వస్తుందని చెబుతుంది డాక్టర్ తల్లి .ఇది నిన్న జరిగిన కార్తీకదీపం 1433 ఎపిసోడ్ కార్తీకదీపం పూర్తి కథ.
జరిగినదంతా కళ అయితే బాగుంటుందని అన్న సౌందర్యం: సౌందర్య బాధపడుతూ ఉండగా జరిగినదంతా కలయితే బాగుంటుంది. కార్తీక్ దీపకలవకపోయిన పర్వాలేదు, కొట్టుకున్న మన కళ్ళముందే ఉండేవారు అంటుంది. పోయిన కాలం తిరిగి రాదు, ఉన్నంతకాలం జ్ఞాపకాలు మోస్తూ కాలంతోపాటు ముందుకు వెళ్లాలి అని అంటాడు ఆనందరావు. శౌర్య దొరుకుతుందా అని హిమ సౌందర్యం అడుగుతుంది. కచ్చితంగా దొరుకుతుందని సౌందర్య చెబుతుంది. ఇల్లు కొన్నే కొన్నవాళ్లు వస్తారు, వారికి తాళం ఇవ్వమని వాచ్ మేన్ కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.
దీప కు థాంక్స్ చెప్పాలన్న సౌర్య: సౌర్య తల్లి గురించి ఆలోచిస్తూ ఒక్కసారి కనిపించమని మనసులో అనుకుంటుంది. బస్సు ఒకచోట ఆపి తినమని అంటారు. చంద్రమ్మ తిందాం రాని తీసుకొని వెళుతుంది. దీప కూడా కిందికి దిగి సౌర్య వెనకాలే వెళుతుంది. చంద్రమ్మ చిల్లర కోసం దీపన అడుగుతుంది. బిడ్డ కోసం అంటున్నారు కదా, బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే అని చెప్పి వాటర్ బాటిల్ ఇవ్వమని కొట్టు వాడితో చెబుతుంది. దీప కూడా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్లి బస్సులో కూర్చుంటుంది. చంద్రమ్మ జరిగినదంతా చెబుతుంది. వాటర్ బాటిల్ కొని ఇచ్చిన ఆవిడ ఎక్కడుంది థాంక్స్ చెప్పాలి అంటుంది. శౌర్య నిద్రపోతుందని చంద్రమ్మ అంటుంది. ఒకే బస్సులో ప్రయాణం చేసిన ఒకరినొకరు చూసుకోకుండా ప్రయాణిస్తారు దీప, శౌర్య.
దీపకు మంచి జరగాలని అన్న డాక్టర్: డాక్టర్ దగ్గరికి వచ్చి నర్స్ దీప గురించి అడుగుతుంది. హైదరాబాద్ వెళ్ళింది, తను బతికే ఉన్న విషయం పిల్లలకు తెలియాలి కదా అని అంటాడు. తన భర్త దొరకలేదు కదా అని నర్స్ అంటుంది. పిల్లలను తీసుకొని వచ్చిన తర్వాత వెతుకుతుందని చెప్పి తనకు అంతా మంచే జరగాలి అని డాక్టర్ అంటాడు.
దీపక్ థాంక్స్ చెప్పలేకపోయానని అన్న సౌర్య: అందరూ బస్సులో నుంచి దిగుతూ ఉంటారు. దీప సౌర చెయ్యి అడ్డంగా ఉందని తీసి తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చంద్రమ్మ నా బిడ్డ మీకు థాంక్స్ చెప్పాలని అనుకున్నది అని చెబుతుంది. పర్వాలేదని చెప్పి దీప కిందికి దిగి వెళ్ళిపోతుంది. అందరూ దిగిపోయారు, ఆవిడ ఏదని అడుగుతుంది ఆవిడ కిందికి దిగి దిగి వెళ్ళింది. అనగా నేను తనకు థాంక్స్ చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయానని శౌర్య బాధపడుతూ ఉంటే ,చంద్రమ్మ నీ తరఫున నేను చెప్పానులే అని అంటుంది.సౌర్య గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా హైదరాబాదుకు వచ్చాం, సౌర్య వాళ్ళ నానమ్మ తాతయ్యలను కలవబోతున్నాం, వాళ్ళు సౌర్యను చూసి ఎంతో ఆనందపడతారు, ప్రేమగా చూసుకుంటారు ఇన్ని రోజులు జరిగినదంతా మర్చిపోమని గండ అంటాడు. సౌర్యకుకోపం వచ్చి నేను ఎవరో తెలియనప్పుడు నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి అని కోప్పడుతుంది ఇది ఈరోజు జరిగిన కార్తీకదీపం 1434 ఎపిసోడ్.