Guppedantha manasu serial ఈ రోజు కథ:రిషి వసుధార క్యారేజీ తీసుకొని వచ్చిందని. ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయవా? అని అనడం. రిషి వసుధారపై చూపిస్తున్న ప్రేమకు గౌతమ్ సెట్టర్స్ వేయడం. దేవయాని వచ్చి వసుధారని తన ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పడం. రిషి వచ్చి రోడ్డుమీద ఇదంతా ఏంటి మనం వెళ్దాం రండి పెద్దమ్మ అని దేవయానిని తీసుకొని వెళ్లడం. వసుధార ను ఎందుకు దూరంగా పెడుతున్నావు? అని గౌతమ్ ప్రశ్నించడం.
దారిలో దేవయాని ఏడుస్తున్నట్టు నటిస్తూ, నీ గురించి ఎవరూ పట్టించుకోరు, మీ డాడీ పట్టించుకోడు, జగతికి బాధ్యత లేదు, నీ గురించి నేను తప్ప ఇంకెవరు ఆలోచిస్తారని చెప్పడం. ఇప్పుడు నాకేమీ కాలేదు. నేను చాలా బాగున్నాను అని రిషి అంటాడు.ఎటువంటి తగాదాలు లేవు, ఇద్దరు కలిసి పోయారు అని అనుకునే లోపే గురుదక్షిణ విషయం అంటూ మీ ఇద్దరు గొడవ పడుతున్నారని దేవయాని ప్రేమ నటించడం. జగతి మేడం మీద ఉన్న గౌరవంతోనే ఇలా ఉంది.
అంతకంటే ప్రేమ నాపై ఉంది. తప్పకుండా తను మనసు మార్చుకొని మన ఇంటికి కోడలుగా వస్తుందని రిషి చెబుతాడు. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ 585 గుప్పెడంత మనసు సీరియల్ కథ.
రిషి చెప్పిన మాటలకు దేవయాని ఎలా స్పందిస్తుందో వాళ్ళని విడదీయడానికి ఎలా ప్లాన్ చేస్తుందో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
నిన్న ఎపిసోడ్ లో జరిగిన దేవయాని రిషి ల మధ్య సంఘర్షణ నుంచి ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. నాకు నమ్మకం లేదు. నేను వెళ్లి అడిగితే ఏదేదో మాట్లాడుతుందని అని అంటుంది. మా ఇద్దరినీ ప్రేమే నిలబెట్టింది. ఆ ప్రేమే గెలిపిస్తుంది. వసుధార ఎప్పటికైనా మన ఇంటి కోడలుగా వస్తుందని రిషి చెబుతాడు.
తన నమ్మకాన్ని విడిచి పెట్టనని జగతితో అన్న వసుధార:
మహేంద్ర, జగతి కాలేజ్ దగ్గరికి రాగానే గౌతమ్ వచ్చి మాట్లాడుతాడు. రిషి గురించి అడగగానే రాత్రంతా ఇక్కడే ఉన్నాడు. వసుధార ఫోన్ చేయగానే వెళ్ళాడు అని చెబుతాడు. ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది. జగతి రిషి గురించి అడగగానే నా దగ్గరికి వచ్చారు. దేవయాని మేడం తీసుకెళ్లారని చెబుతుంది. తను నీ దగ్గరకు వచ్చిందా? ఏమైనా గొడవ చేసిందా? అని అడుగుతుంది. లేదు అని జరిగిన విషయాన్ని చెబుతుంది.
ఆవిడ ఎంత కూల్ గా ఉంటే అంత ప్రమాదం. 20 ఏళ్ల నుంచి తనను చూస్తున్నాను. మన అంచనాలకు ఒక అడుగు పైనే ఉంటారు. గురుదక్షిణ విషయంలో ఆవిడతో కూడా చెప్పించుకుంటున్నావా? నీకు అర్థం అవుతుందా? అని అంటుంది. నేను ఒకటి నమ్మాను. దాని కోసమే నిలబడుతున్నాను. అనిసమాధానం ఇస్తుంది.
ఎన్నీ గొడవలు తెస్తాయో? నీకు అర్థం కావటం లేదని? బంధాలన్నీ విడిపోతుంటే, నువ్వేమో అలా మాట్లాడుతున్నావు, జీవితం అన్నాక పట్టు,విడుపులు ఉండాలని అంటుంది. సారీ చెప్పి నేను నమ్మిన దానిని కచ్చితంగా పాటించి తిరుగుతానని అంటుంది వసుధార.ఏంటి నీ నమ్మకం. మనుషుల్లో మమతలు దూరం అవుతుంటే, ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉంటుంటే, నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. గురుదక్షిణ విషయం వదిలిపెట్టవా? అని కోపంతో అరుస్తుంది.
సారీ మేడం అని చెబుతుంది. ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను, నువ్వు వినడం లేదు, జీవితాంతం బాధపడతావు అని అంటుంది. లేదు మీరు జీవితాంతం ఆనందంగా ఉంటారని వ సు సమాధానం ఇస్తుంది. జగతి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
తనకు సహాయం చేయమని గౌతమ్ ను కోరిన వసుధార:
మీరు రిషి సార్ ఫ్రెండ్ గా మీరు నాకు సహాయం చేయాలని గౌతమ్ ను అడుగుతుంది. వాడిని చిన్నప్పటినుంచి చూస్తున్నాను. నీ పరిచయం అయ్యాక కొంచెం మారాడు. అంతేకానీ వాడు ఏదైనా మాట చెబితే దాని మీదనే నిలబడతాడు. వెనక్కి తగ్గడు. వాడి మనసు మనసుకు తగిలిన గాయం గురించి, ఈరోజు వచ్చి అమ్మ అని పిలవమంటే ఎలా అంటాడు? అని అంటాడు. దయచేసి మీరు ప్రయత్నించండి అని అంటుంది.
నేను ప్రయత్నించలేదని ఎలా అనుకున్నావు? ఈ టాపిక్ వాడితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక మెట్టు తగ్గితే బాగుంటుంది, కదా లేకపోతే మీ బద్దానికి అడ్డుగా ఉంటుందేమో ఆలోచించుకోమంటాడు. నేను ఎప్పటికీ రిషి సార్ కు దూరం కాను.
దూరమయ్యే పరిస్థితి కూడా లేదు. కానీ నేను చెప్పిన మాట మీద నిలబడతాను, తప్పకుండా విజయాన్ని సాధిస్తానని అంటుంది. ఎంత బలమైన బంధాలు, అంతే బలమైన పంథాలు కూడా ఉన్నాయని మనసులో అనుకుంటాడు.
తప్పకుండా విజయాన్ని సాధిస్తామని మహేంద్రతో అన్న వసుధార:
అసలు దీనికి కారణం నేను, నేను గురుదక్షిణ అడగకుండా ఉంటే బాగుండేది, అని మహేంద్ర అంటాడు. మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటి? మనం రిషి సార్ ,తో జగతి మేడంని అమ్మ అని పిలిపిస్తాము చూడండి అని అంటుంది. రోజు రోజుకు నమ్మకం పోయి భయం వేస్తుంది. గురుదక్షిణ అడిగినప్పుడు ఈ టాపిక్ ఇన్ని సమస్యలను తెచ్చిపెడుతుందని అనుకోలేదు! ఎందుకో నాకు టెన్షన్ గా ఉందని అంటాడు.
బంధాలు కలపడానికి మన వంతు ప్రయత్నం చేయకపోతే ఎలా? ప్రయత్నించుదాం. విజయం సాధిస్తామని అంటుంది. దేవయాని మేడం ఎన్ని కుట్రలు చేసినా, ఎప్పుడూ ఒకసారి దొరుకుతారు, తన గురించి తానే బయట పెట్టుకుంటారని, నా మాట నమ్మండి మీరు భయపడవద్దు రిషి సార్ మారతారని చెబుతుంది.
రిషి మనసు మార్చడానికి ప్లాన్ చేస్తున్న దేవయాని:
పెద్దమ్మ మీరు నా దగ్గర ఎంతసేపు ఉంటారు? అని రిషి అంటాడు. నాకు జీవితంలో ఏ కోరికలు లేవు, ఉన్నదల్లా నీ సంతోషం, నీ ప్రశాంతతే. జీవితంలో చాలా మందికి ఎన్నో ఆశలుంటాయి. కానీ నాకు రిషి సంతోషమే సంపద అని అంటుంది. నీ మనసు నాకు తెలుసు పెద్దమ్మ అంటున్నాడు.
తెలుసుకోవాల్సిన వాళ్లే తెలుసుకోవడం లేదని, జగతి వాళ్ళ ఇంకా ఇంటికి రాలేదని అని అంటుంది. మీకు ఉంది కదా, ఎవరికీ ఉన్నా లేకపోయినా బాధ లేదని అంటాడు. నీకోసం ఏమైనా తీసుకొని వస్తాను అంటుంది. మీరు తిన్నారా? అని అడుగుతాడు. నువ్వు తింటే నేను తిన్నట్టే కదా! అని చెప్పి వెళ్ళిపోతుంది.
దేవయాని గురించి నిజాలన్ని బయటపెడతానని అన్న మహేంద్ర:
ఇంటికి వెళితే రిషి తో కబుర్లు చెప్పుకోవచ్చు అని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. దేవయాని వదిన మరి ప్రమాదకరంగా మారుతున్నారని, జగతితో మహేంద్ర అంటాడు. ప్రస్తుతానికి మనం ఏమి చేయలేం ఓపికగా చూడటమే, అక్కయ్య గారి నిజ స్వరూపం రిషి కి తెలిసేదాకా వేచి ఉండాల్సిందే! మనమే నిజం బయట పెడదాం. తన గురించి నిజాలు అన్ని బయటపెడదాం అని అంటాడు. అలాంటివి వాటంతావే తెలియాలి.
మనం చెబితే అబద్ధాలు, చాడీలు అవుతాయి. తెలుసుకుంటే రిషి జీవితంలో, ఆలోచనలలో ఒక మలుపు వస్తుంది. అందువలన మనం వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతానికి మనం చేయగలిగేది ఓపికగా వెయిట్ చేయడం అంటుంది.
ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్న రిషి, వసుధార:
రిషి, వసు గురించి ఆలోచిస్తూ, ఫోన్ చేద్దామా? చేసి ఏం మాట్లాడాలి! మనసుకు బాధగా ఉన్న, హాయిగా ఉన్నా వసుధార నే గుర్తుకు వస్తుంది. తనకు ఈమధ్య ధైర్యం ఎక్కువైంది. చీర విషయంలో తను ఎంత బాగా సమర్ధించుతుందో! అని వసూ మాటలు గుర్తుకు చేసుకుంటాడు. ఇంతలో వసు కూడా రిషి గురించి ఆలోచిస్తూ, ఏం చేస్తున్నారని? అడుగుతుంది. రిషి కలుద్దామా? అని మెసేజ్ చేయ గానే, వసు కూడా కలుద్దాం. ఎక్కడ కలుద్దామని? అడుగుతుంది. నేనే నీ దగ్గరికి వస్తానని అంటాడు.
రిషికి మహేంద్ర కు మధ్య గొడవ పెట్టిన దేవయాని:
జగతి, మహేంద్ర ఇంటికి రాగానే, దేవయాని వచ్చి మీ పనులు అయిపోయాయా? అని అడుగుతుంది. వదిన రిషి అనగానే, మీరు రిషి గురించి ఆలోచించి, అడిగే తీరికే లేదు. అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారని? అంటాడు. తెలుసుకునే ప్రయత్నం చేశారా? అని అంటుంది.
మీరిద్దరూ మహానటులు అంటుంది. మా కొడుకు మేము నటించడం ఏంటని, లోపలికి వెళ్తుండగా రిషి బాగా డిస్టర్బ్ అయ్యాడు, తను ఏమి డిస్టర్బ్ చేయకండి అని అంటుంది దేవయాని. నా కొడుకు రూమ్ లోకి వెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలా అని అంటాడు.
జరిగిన విషయానికి దేవయానికి సారీ చెప్పినరిషి:
ఏంటే రిషి డోర్ తీయగానే, దేవయాని ఏడుపు నటిస్తూ, నీ కొడుకే! నీ కొడుకు అని నువ్వంటే, నా కొడుకు కాదని కదా అర్థం. నాకు, రిషికి ఎలాంటి సంబంధం లేనట్లే కదా! ప్రత్యక్షంగా రి షి ని, పరోక్షంగా నన్ను ఏడిపిస్తున్నావు! ఇంట్లో ఉండవద్దని అంటే, నేను మీ అన్నయ్య వెళ్ళిపోతాం. అని అంటుంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? అని జగతి అంటుంది.
మేము వెళ్ళిపోతాం మహేంద్ర. అని నటిస్తుంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను ఊహించలేదు. మిమ్మల్ని చూస్తుంటే, మీరు కూడా మారిపోతారేమో అని అనిపిస్తుందని. చెప్పి సారి పెద్దమ్మ నేను వెళ్తున్నాను అని అంటాడు.
మహేంద్రకు కోపం తెప్పిస్తున్న దేవయాని:
జగతి, మహేంద్రా ను ఇప్పుడే మాట్లాడకు వెళ్దాం రా అని తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి, హాయిగా ఉంది, అని దేవయాని అని అంటుంది. మహేంద్ర కోపంతో వదినా? అని అరుస్తాడు. ఏంటి వదిన, రిషి ఇంటికి రాలేదు, వచ్చాడు. మీరు ఎలా మాట్లాడాలి? తనని ఎంత అపురూపంగా చూసుకోవాలని? అంటుంది. మహేంద్ర ఏమన్నాడో, ఏం చెప్పాడో ,రిషికి తెలియకపోయినా మీకు తెలుసు కదా! అని అంటుంది జగతి.
రిషి ఎంత డిస్టర్బ్ అయ్యాడో చూడు అని అంటుంది దేవయాని.మీరే అన్ని అంటారు, మేమున్నామని నమ్మిస్తారు. మీరు చాలా గొప్ప వాళ్ళని అంటాడు మహేంద్ర. నేను గొప్పదాన్ని కాదు, మీరు గొప్పవారు, ఏం తల్లిదండ్రులని, రిషి మనసు తెలుసుకోలేరు? ఏం కావాలో తెలియదు? నేను చెబితే వినరు, మీ వల్ల రిషి ఎలా తయారవుతున్నాడు చూడండి అని అంటుంది.
జరిగిన వాటన్నిటికీ జగతే కారణమని చెప్పకనే చెబుతున్న దేవయాని:
అక్కయ్య ఏం మాట్లాడుతున్నారని జగతి అంటుంది. మహాతల్లి అంటూ, నమస్కరించి, రీషి కన్నా తల్లి, కొడుకుని వదిలేసిన తల్లి అంటూ, నిజాలే మాట్లాడుతున్నాను. రిషి సరదాగా మాట్లాడి, నవ్వుతూ పలకరించి ఎన్ని రోజులు అయ్యిందో! ఆలోచించారా? సాక్షి విషయంలో చిన్న పొరపాటు జరిగితే, మీరు సర్ది చెప్పాలి కదా, వదిలేశారు. ఇంట్లో నీ కాలు మోపాకే రిషి ఆనందాలు ఆగిపోయాయి.
కొందరు లెగ్గు మహిమఅని అంటుంది. నువ్వు వెళ్లావు! నా తిప్పలు నేను పడ్డ! మళ్లీ వచ్చావు. రిషి బాధపడుతున్నాడు! అని అంటుంది. మహేంద్ర అనవసరంగా మాట్లాడవద్దని అంటాడు. అనవసరంగా గొడవలు వద్దు, నువ్వు ఏమీ అనకు అని జగతి మహేంద్రను అంటుంది. అది సంగతి. నేను మాట్లాడితే గొడవలా ఉందా? రి షి నీ బాగా గమనించండి.
ఈ ఇంట్లో ప్రేమలు, సంతోషాలు లేవు. రిషి జీవితానికి, ప్రేమకి నేను అడ్డు అని, నేను రాక్షసి అని అనుకుంటున్నారు? నిజానికి రిషి జీవితానికి, ప్రేమకు మీరే శత్రువులు, గురుదక్షిణ ఒప్పందమే లేకపోతే ఈ పాటకి కలిసిపోయేవారు. వాళ్లకి మీరే అడ్డుగా ఉన్నారని అంటుంది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 586 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.