Guppedantha manasu serial today:మనసు మార్చుకోకపోతే కలిసి ఉండడం జరగదు అని వసుధారకు తేల్చి చెప్పిన రిషి..

Guppedantha manasu సీరియల్ ఈ రోజు కథ:మనసు మార్చుకోకపోతే కలిసి ఉండడం జరగదు అని వసుధారకు తేల్చి చెప్పిన రిషి..

జగతి వసుధారను చెంప దెబ్బ కొట్టినందుకు రిషి కోపంతో బయటికి తీసుకుని వెళ్లడం. అలాగే ఇద్దరు వారి ప్రేమకు ఏవి అడ్డుగా లేవని మాట్లాడుకోవడం. ఇక్కడ దేవయాని ధరణినిమెచ్చుకోవడం. రిషి వసు ను తన రూమ్ దగ్గర విడిచిపెట్టడానికి వచ్చి, తనతో మాట్లాడుతూ నీ జీవితంలో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు, ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత అని అడుగుతాడు.

వసుధార జగతి మేడం అని సమాధానం ఇస్తుంది. మరి నేను అని రిషి అడగగా, మీరు నేను ఒకటే. నా జీవితం మీరే అయినప్పుడు నా జీవితంలో ప్రాధాన్యత, ప్రయారిటీ అనే మాటలు ఉండవు అని సమాధానం ఇస్తుంది  ఇది నిన్న జరిగిన గుప్పెడంత మనసు సీరియల్ 583 ఎపిసోడ్.

వసు అన్న మాటలకు రిషి ఏమని సమాధానం ఇస్తాడు ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ లో నిన్న జరిగిన వసుధార, రిషి మధ్య జరిగిన సంభాషణతోనే మొదలవుతుంది.

Guppedantha manasu serial

వసుధారకు షాక్ ఇచ్చిన రిషి:

మీరే నా జీవితం అని వసుధార చెప్పిన మాటలు విని రిషి ఎవరిని బాధ పెట్టకూడదని చూస్తావు. ఒక విషయంలో ఎందుకు గొడవ. ఇంత దూరం అని అంటాడు రిషి. దూరం ఎక్కడుంది. గొడవ కాదు అభిప్రాయం ఉంది అంటుంది. మీ మేడం అంశాన్ని వద్దంటే ఎందుకు బంధం, గురుదక్షిణ ఒప్పందాన్ని మర్చిపోమంటే ఎందుకు మర్చిపోవటం లేదని రిషి అడగగా, మీరు నన్ను మర్చిపోతారా అని అంటుంది.

నీ మనసు ఏది చెబితే అది వింటావు. అలాగే నేను కూడా నా మనసు ఏం చెప్తే అది వింటాను. నువ్వు కూడా నీ మనసు ఏది చెప్తే అది విను అని ఒకప్పుడు నాకు చెప్పావు. నా మనసు ఒకటి అంటుంది.

నీ మనసు రెండు చెబుతుంది. గుర్తుపెట్టుకో రెండు మనసులు, ఆలోచనలు, కలిస్తేనే ఒకటి అవ్వడం. ఆలోచనలు వేరు వేరు అయితే కలవడం కష్టం. ఆలోచించు నీకు మొండితనం ఎందుకు అంటాడు. మంచి ఆలోచన కోసం పట్టుదలగా ఉండటం అని అంటుంది. ప్రతిదానిని సమర్ధించుకుంటావు. ఇలాగే ఉంటే మనం జీవితంలో కలిసి ప్రయాణం చేయలేమని అంటాడు. కలిసి ఉండలేము, కలవలేము అంటున్నారా? ఆమాట ఎలా అన్నారని అంటుంది. కావాలని అనలేదు. నువ్వే అనేలా చేసావు అంటాడు.

ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కాదనను. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, అని నాకు ఇష్టం లేని పనిని బలవంతంగా చేయించాలని అనుకుంటున్నావు అని అనగా మిమ్మల్ని మచ్చలేని మనిషిగా చూడాలనుకుంటున్నాను అని సమాధానం ఇస్తుంది. ఇదంతా ఎందుకు నీకు. ఎవరో ఒకరు ఒక మెట్టు దిగితే సరిపోతుంది కదా అంటాడు. ఆ మెట్టు ఏదో మీరే దిగండి జగతి మేడంని అమ్మ అని పిలిస్తే నాకేం వస్తుంది? ఇందులో నా స్వార్థం ఏముంది? అర్థం చేసుకోమంటుంది. అర్థమైంది నువ్వు మారవని నాకు అర్థం అయింది అని అంటాడు. ఇంకొకసారి మనం కలవలేమని అనకండి, నేను ఆ మాటను తట్టుకోలేనని అంటుంది. రిషి ఏమీ మాట్లాడకుండా కోపంతో కార్ కీస్ తీసుకొని బయటికి రాగానే,వసు కూడా వచ్చి బాయ్ అని చెబుతుంది. రిషి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.

దేవయాని ఏదో ప్లాన్ చేస్తుంది అని అన్న ధరణి:

జగతి జరిగిన విషయాన్ని తలుసుకుని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్లారు కదా! ఏం జరుగుతుందో? నాకు టెన్షన్ గా ఉందని మహేంద్ర అంటాడు. ఇంత భరించాం. ఎంత ఓపికగా ఉన్నాం. అన్ని భరించాము. చివరికి ఒక్కటయ్యారు. ఇప్పుడేంటి ఇలా జరిగిందని అంటాడు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ధరణి వస్తుంది. మహేంద్ర రిషి వచ్చాడా ?అని అడుగుతాడు. రాలేదని ధరణి సమాధానం ఇస్తుంది.

రిషి  తొందరగా ఇంటికి రాకపోతే అంత తొందరగా తన మనసు కుదుటపడుతుందని జగతి మహీంద్రా తో అంటుంది. ఇంటికి రానని అత్తగారికి ఫోన్ చేశాడని అంటుంది. పెద్ద అత్తయ్య గారి మాట తీరు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. కొత్తగా ప్రవర్తిస్తుంది. తన ప్రవర్తనకు సంబంధం లేకుండా మాట్లాడుతుంది అని అంటుంది ధరణి. అంటే అక్కయ్య ఏదో ప్లాన్ లో ఉన్నారు. మనం ఆలోచించి అడుగు వేయాలని జగతి, మహేంద్ర, ధరణి మాట్లాడుకుంటారు.

గౌతమ్ కు తన బాధను చెప్పుకున్నరిషి:

రిషి కాలేజ్ కి రాగానే గౌతమను చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. నన్ను ఫాలో అవ్వడానికి డిటెక్టివ్ ల పనిచేస్తున్నావా? ఎంత శాలరీ ఇస్తున్నారని అంటాడు. ఏంటి నువ్వు మాట్లాడేది అని అనగానే, నీకు ఎవరో చెప్పారో,ఎవరు చెప్తే వచ్చావు నాకు తెలుసు అంటాడు రి. నీకు అన్నీ తెలుసు కానీ నీ లోపల ఉన్న ఆ రెండు అక్షరాలతోని ప్రాబ్లం అని గౌతమ్ అంటాడు. నీకు ఈగో ఉంది దాన్ని పక్కన పెట్టి వసుదారని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటాడు. 32 పళ్ళు రాలిపోతాయని రిషి గౌతమ్ ను అంటారు.

Guppedantha manasu serial today

రిషి గౌతమ్ ను ఒకచోట కూర్చోమని చెప్పి, నేను చెప్పేది ప్రశాంతంగా వినమని చెబుతాడు.రిషేంద్రభూషణ్అనే నేను నా మానాన కాలేజ్ నడుపుకుంటూ, గతాన్ని మర్చిపోయిఉన్నాను.ముందుసాక్షివచ్చింది,వెళ్ళింది. వసుధార అడ్మిషన్ అంటూ వచ్చింది. ఆ తర్వాత జగతి మేడం జాబు.

ఆ తర్వాత వసుధారతో ప్రేమ. ఇవన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఇంత జరిగినా వసుదారను అంతగా కోరుకుంటున్నాను. తను మాత్రం ఇంకొక విషయానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో నా తప్పు ఏముంది? చెప్పమని గౌతమ్ ను అడుగుతాడు. ఆలోచిస్తే లేదు అని అంటాడు గౌతమ్. ఇన్ని జరిగాక నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను? ఇక్కడ నా ఇగో ఎక్కడ కనిపించింది? అని ప్రశ్నిస్తాడు.

కాలేజీలో క్లాసు లేదు కదా నాకు పెద్ద క్లాస్ తీసుకుంటున్నాడని గౌతమ్ మనసులో అనుకుంటాడు. అన్నీ మర్చిపోయి వసుధాలను పెళ్లి చేసుకోమని ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చావు, కదా ఇక్కడ ప్రశాంతత ఎక్కడుందని ?అడుగుతాడు. గౌతమ్ నన్ను వదిలేయ్ అని అడుగుతాడు. వసుధారను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.

నేను మారలేదు. ఎప్పటికీ ఒకేలా ఉన్నాను. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లే మారారు అని అంటాడు. గౌతమ్ ఇంటికి వెళదామా? అని అడిగితే నేను రానని చెబుతాడు రిషి. నువ్వు రాకపోతే నేను ఇక్కడే ఉంటానని అంటాడు. గౌతం సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రీషి.

రిషి గురించి ఆలోచిస్తున్న వసుధార:

వసుధార రిషి అన్న మాటలను గుర్తుకు చేసుకొని, తన గురించి ఆలోచిస్తూ, మాట్లాడుకుంటూ ఉంటుంది,నాకు చెంప దెబ్బ తగిలితే ,మీరు ఎక్కువ బాధ పడుతున్నారని అనుకోని ఫోన్ చేస్తుంది. మెసేజ్ చేస్తే కూడా సమాధానం ఇవ్వడు. ఇంతలో వసుధారకు జగతి మేడం గుర్తుకు వస్తుంది నన్ను కొట్టి మేడం ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో అని అనుకుంటుంది.

రిషి మనసును గాయపరిచాను అని బాధపడుతున్న జగతి:

వసుధారని కొట్టి  రిషిని గాయం చేశానని జగతి మహేంద్రా తో అంటుంది. ఇంతలో వసుధార ఫోన్ చేస్తుంది. జగతిని మాట్లాడవచ్చు కదా అని అంటాడు.వసు ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదంటుంది. మళ్ళీ ఫోన్ చేస్తుంది. జగతి మాట్లాడు మాట్లాడమనగా ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఉంటుంది. రిషి రాలేదా? అని అడగగా ఇంటికి రాలేదని సమాధానం ఇస్తుంది. 

రిషిసార్ నిజంగానే ఇంటికి వెళ్లలేదా అని వసు అనుకుంటుంది. రిషి ఎక్కడికి వెళ్ళాడు? నీకు తెలుసా? అని మహేంద్ర అడుగుతాడు. నాకు తెలియదు అని వసుధార సమాధానం ఇస్తుంది. అలాగే మేడం ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మహేంద్ర సమాధానం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తాడు.

క్యారేజీ తెచ్చింది వసుధారేనని గుర్తుపట్టిన రిషి:

రిషికి క్యారేజ్ తీసుకొని గౌతమ్ వస్తాడు. ఏంటని అడగగా క్యారేజ్ అని సమాధానం ఇస్తాడు. నేను అడిగానా అని అంటాడు. ఆకలేస్తుంది కదా అని అంటాడు. గౌతమ్ నేను చెప్పానా? అని అంటాడు. తినాల్సింది నువ్వే కాదు నేను కూడా అని అంటాడు. గౌతమ్ ఇప్పుడే తినాలా అని అడగగాఆకలిగా ఉందని గౌతమ్ సమాధానం ఇస్తాడు.

ఇద్దరు సరేనని తింటూ ఉండగా భోజనం తింటూ వసుధార వంట గుర్తుకు వస్తుంది. ఎక్కడినుంచి తెచ్చావు? ఇంటి భోజనంలా ఉందని అడుగుతాడు? కొత్తగా ఒక హోటల్ పెట్టారు నీకు తెలియదని గౌతమంటాడు.

ఈ వంట వసుధారనే చేసి తీసుకొని వచ్చిందని రిషి గుర్తుపట్టి, ఎక్కువసేపు నిలబడితే కాళ్లు నొస్తాయి. లోపలికి రమ్మని వసుధారని పిలుస్తాడు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ 584 గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కథ.