Karthika deepam serial today:దీపను గుర్తుపట్టి మౌనితకు షాక్ ఇచ్చిన కార్తీక్

దీపను గుర్తుపట్టి మౌనితకు షాక్ ఇచ్చిన కార్తీక్: ఈరోజు జరిగిన ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.

నీ మీద కోపం కాదు, ఆ హిమ మీద కోపం. ఎందుకని అడగగా, అమ్మ, నాన్నలు దూరం కావడానికి కారణం తను. అందుకే తన మీద నాకు అంత కోపం అని సౌర్య అంటుంది. అమ్మా,నాన్నలే వచ్చి పిలిచేదాక నేను ఇంటికి రాను అని చెబుతుంది శౌర్య. అమ్మానాన్నల ఇంకెక్కడున్నారు వాళ్లు అని ఆనందరావు అంటాడు. లేదు వాళ్లు బతికే ఉన్నారు. వాళ్ళు కనిపించగానే అప్పుడు వచ్చి హిమతో మాట్లాడుతాను అని సౌర్య ఆనందరావుకు చెబుతుంది. 

ఇదినిన్న జరిగిన 1441 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ:

కార్తీక్ మౌనిత దగ్గరే ఉన్నాడని దీపా తెలుసుకుంటుందో ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

అమెరికా వెళ్ళిన సంగతి నీకు ఎలా తెలుసు అని శౌర్యను అడిగినఆనందరావు: నేను ఇంటికి రావాలంటే, అమ్మానాన్నలు వచ్చిన తర్వాతనే. అయినా నన్ను గాలికి విడిచిపెట్టి మీరు అమెరికా వెళ్ళిపోయారు కదా, మళ్లీ ఎందుకు వచ్చారు అని అంటుంది.

మేము అమెరికా వెళ్ళిన సంగతి నీకు ఎలా తెలుసు అంటాడు. మీరు వెళ్లిన తర్వాత ఇంటికి వచ్చాను, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అంటుంది. మీరు ఎప్పుడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయారో, అప్పుడే నన్ను మర్చిపోయారు అని  అనగా, వెళ్ళినా నాలుగు రోజులు కూడా ఉండలేక నీకోసం వచ్చేసాము. నువ్వు రా ఇంటికి వెళదాం అంటాడు.

పిన్ని బాబాయిలు బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఆటో తీసుకొని రావడం కోసం బయటికి వెళ్లారు. నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటుంది. నీకోసం ఇవన్నీ తీసుకొని వచ్చాను తీసుకోమంటే, నాకేమీ వద్దు మీరే తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇంట్లోకివెళ్ళిపోతుంది.

దీపను గుర్తుపట్టిన ఆనందరావు: 

దీప, మౌనిత శివను తీసుకెళ్లిన విషయం గుర్తుకు చేసుకొని ఆయన దగ్గరికి వెళుతుంది. ఆయన ఎన్నిసార్లు తిట్టినా అలాగే చేస్తుందని, అనుకుంటూ ఆటోలో వెళుతుంది. ఆనందరావు వాళ్ళు కారులో శౌర్య గురించి ఆలోచిస్తూ వస్తారు. ఆటో కారుకు ఎదురుగా వెళుతుంది. దీపను చూసి,కారు ఆపి కిందికి దిగి చూస్తూ ఉంటాడు. సౌందర్య ఏమైందని అడిగితే దీప కనిపించింది అని చెబుతాడు. ఎవరినో చూసి పొరపడి ఉంటారని సౌందర్య అంటుంది. దీప లేదు. లేని మనిషి ఎలా వస్తుందని చెప్పి ఇలాగే నాకు కూడా కార్తీక్ అనిపించాడు అది బ్రమ అంటుంది.

మౌనిత గుర్తుకు వస్తే ,నువ్వు కూడా గుర్తుకు వస్తావు అని దీప కు చెప్పిన డాక్టర్: దీపకు, డాక్టర్ టెస్టులు చేస్తాడు. డాక్టర్ బాబు ఎప్పుడైనా చెక్ చేయాలని ఈ మిషన్ తెచ్చేవారు. ఆయన నా చేయి పట్టుకోగానే గిలిగింతలు అయి చూడనిచ్చేదాన్ని కాదు .

మళ్ళీ నర్సును పిలిపించి చూసేవారు. అని గతంలో జరిగిన దాని గురించి చెబుతుంది దీప. ఆయనతో తిరిగే వాడిని పట్టుకొని తెలుసుకునే లోపే మౌనిత వచ్చి తీసుకెళ్ళింది అంటుంది. తను నీకు నిజం తెలుస్తుందని తీసుకొని వెళ్ళిందా? లేక తనకు మాత్రమే తెలియాలని అలా చేసిందా అని అంటాడు డాక్టర్.  ఎప్పుడైనా దానిని ఒకటే లక్ష్యం. ఆయనని నాకు దూరం చేయాలని అంటుంది. తనకే దొరికిన నీకు నష్టం లేదు అంటాడు డాక్టర్.

ఆయన నాకు కనిపించడం ఎంత ముఖ్యమో, అలాగే దానికి కనిపించకుండా ఉండడం అంతే ముఖ్యం అంటుంది. నిన్ను గుర్తుపట్టలేని వాడు తనని ఎలా గుర్తుపడతాడు అని అంటాడు. ఒకవేళ గుర్తుపడితే ఏం జరుగుతుంది అని దీపను అడుగుతాడు. ఏముంది నాలుగు తన్ని నా గురించి అడుగుతాడు అంటుంది. ఒకవేళ మోనిత గుర్తుకు వస్తే, నువ్వు కూడా గుర్తుకు వస్తావు. తన గురించి మర్చిపోయి, డాక్టర్ బాబు గురించి ఆలోచించు అని డాక్టర్ అంటాడు.

దీపను గుర్తుకు చేసుకున్న కార్తీక్: ఇక్కడ కార్తీక్ ఆలోచిస్తూ దీప గుర్తుకు వచ్చి దీప అని పిలుస్తాడు. అది విన్న మౌనిత షాక్ అయ్యి ,ఎందుకు దీప అని కలవరిస్తున్నాడు? గతం గుర్తుకు వచ్చిందా? నా మందులు పనిచేయడం మానేశాయా? అని మనసులో అనుకుని దగ్గరికి వచ్చి చూస్తుంది. నేను ఏమన్నా అన్నానా దీప అని కార్తీక్ మోనితను అడుగుతాడు. మోనిత ఏమి మాట్లాడకుండా నన్ను దీప అని పిలుస్తున్నాడు ఏంటి? అనుకొని నన్నే పిలిచావు, ఇక్కడ నేను ఉంటే ఇంకా ఎవరిని పిలుస్తావు అని అంటుంది. కార్తీక్ నీ పేరు ఏంటి? అని మళ్ళీ అడుగుతాడు.

మోనిత అని పిలిచావు అంటుంది. తల నొప్పిగా ఉంది కొంచెం మర్దన చేయమని కార్తీక్ అడగగా, ఈయన తల ఆయన మర్దన చేసుకుంటేనే దీప అనే పేరు గుర్తుకొచ్చింది.

అదే నేను చేస్తే మొత్తం గుర్తుకు వస్తుందని మనసులో అనుకొని, ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఫోన్ వచ్చినట్టు నటిస్తూ మెటీరియల్ తెచ్చుకోవడానికి వెళ్తున్న అంటుంది మోనిత. సరే నేను కూడా బయటికి వెళ్లి వస్తాను అంటాడు. బయటికి వద్దని అంటుంది .ఎప్పుడు నాలుగు గోడల మధ్య బంధిస్తావు అని అంటాడు.

 ఆరోగ్యం బాగాలేదని సమాధానం ఇస్తుంది. ఎప్పుడు అలాగే మాట్లాడతావు, ఏదో ప్రాణం పోయినట్లు చేస్తావు అని అంటాడు. నీ ఆరోగ్య పరిస్థితి అలాంటిది, నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

శౌర్యకు మన మీద కోపం తగ్గేంతవరకు వెయిట్ చేద్దాం అన్న సౌందర్య: సౌర్య మన దగ్గరికి రాదు అని హిమ అంటుంది. మనసు మారితే అలా జరగదు అని సౌందర్యం అంటుంది. శౌర్య గురించి ఆలోచించి తలనొప్పిగా ఉంది అంటుంది. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు హిమ అని చెప్పి, మీరు ఏం ఆలోచిస్తున్నారో అంటుంది.

మనం బలవంతంగా అయినా శౌర్య తీసుకొని వచ్చుంటే బాగుండేది అంటాడు. బలవంతంగా తెస్తే ఎలా ఉంటుంది. మనం కాపలా కాయలేం. మళ్లీ వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా గుర్తుకు వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాం. ఈసారి వెళ్తే అసలు మనకు కనిపించదు. ఎప్పటికైనా మనసు మారి రావాల్సిందే అని సౌందర్య అంటుంది.

 ఇది ఈరోజు జరిగిన కార్తీకదీపం 1442 ఎపిసోడ్ కార్తీకదీపం సీరియల్ కథ.

మౌనిత దగ్గరే కార్తీక్ ఉన్నాడని దీప ఏ విధంగా తెలుసుకుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.