Tollywood: టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నారు. టాలీవుడ్ లో ఎంతో కాలం నుంచి కొనసాగిస్తూ, తమకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటున్నారు. అయితే స్టార్స్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు సినిమాను బట్టి తమకిచ్చే రెమ్యూనరేషన్ పెంచుతుంటారు. కొందరు ఇండస్ట్రీలో తమకున్న డిమాండ్ ను బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ, అమాంతం తమ రెమ్యూనరేషన్ను పెంచుకుంటున్నారు.

తాజాగా ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, తమ రెమ్యూనరేషన్ను పెంచారని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకుని, అమాంతం తమ రెమ్యూనరేషన్ను పెంచిన హీరోల గురించి తెలుసుకుందాం.

రామ్ చరణ్: రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరుత సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వారసత్వంగా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. అంతేకాకుండా RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దీంతో ఈయన తన రెమ్యూనరేషన్ ను పెంచాడు. రామ్ చరణ్ నటించే ఒక్కొక్క సినిమాకు నలభై కోట్లు తీసుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రమ్యనరేషన్ తీసుకుంటున్న వారిలో ఆరవ స్థానంలో ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్: నందమూరి తారక రామారావు. అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్. ఎన్టీఆర్ కూడా తన తాత, తండ్రి వారసత్వంగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఎన్టీఆర్ చిన్నప్పటినుండి బాల నటుడిగా సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా తెరపైకి వచ్చాడు. తన ఫస్ట్ సినిమాకు మూడు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ సినిమాకు ముందు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత తన రెమ్యూనరేషన్ పెంచాడు. ప్రస్తుతం 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. టాలీవుడ్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఐదవ స్థానంలో నిలిచాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతోమంది ప్రజాదరణ కలిగిన వ్యక్తి. జనసేన పార్టీ అధ్యక్షుడు. రాజకీయాల కంటే ముందు స్టార్ హీరో. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు.స ఇండియాలోని భారత దేశంలో స్టార్ టాప్ ఐదుగురు హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు.

సినిమాకు కొంతకాలం దూరంగా ఉన్నా, 2021లో వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటించాడు. టాలీవుడ్ లో ఉన్న హీరోలు సినిమాల రిజల్ట్స్ ఆధారంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈయన మాత్రం సినిమాతో సంబంధం లేకుండ, 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా హరీష్ శంకర్” భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో కూడా నటించబోతున్నాడు. టాలీవుడ్ లో కోట్లలో పారితోషకం తీసుకుంటున్న కొంతమంది హీరోలలో ఈయన ఒకరు. ఎక్కువ పారితోషకం తీసుకుంటూ, టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో నాలుగవ స్థానంలో ఉన్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

అల్లు అర్జున్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తాత, తండ్రి వారసత్వంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. బన్నీ కూడా 1985లో వచ్చిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తర్వాత 2003లో వచ్చిన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరో రేంజ్కు ఎదిగాడు.పాన్ ఇండియా హీరో ఇమేజ్ను పొందిన తర్వాత, తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. ప్రస్తుతం ఒక సినిమాకు తన రెమ్యూనరేషన్ 60 కోట్లు తీసుకుంటున్నాడు. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో మూడవ స్థానంలో నిలిచాడు.

మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి స్టార్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ తనయుడు. వారసత్వంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే 1979లో నీడ అనే సినిమా ద్వారా బాల నటుడిగా నటన ప్రారంభించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా 8 సినిమాలలో నటించాడు. 1999లో

రాజకుమారుడు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈయనకు ఫ్యాన్ ఇండియా ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంటుంది. ఈయన సినిమా కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తుంటారు. అంతే కాకుండా మహేష్ తో కలిపి సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. మహేష్ తో సినిమా తీస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయని ఒక నమ్మకం కూడా ఉంది. తాజాగా మహేష్ సర్కార్ వారి పాట సినిమా తర్వాత తన పారితోషకాన్ని పెంచాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు 70 నుంచి 80 కోట్లు తీసుకుంటున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో రెండవ స్థానంలో ఉన్నాడు.

prabhas

ప్రభాస్: పాన్ ఇండియా హీరో ఇమేజ్ను తన సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ 2002లో ఈశ్వర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రభాస్ కూడా తన పెదనాన్న కృష్ణంరాజు వారసత్వంగా సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు. ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.

బాహుబలి వన్ భారత చరిత్ర చలనచిత్ర రంగంలో ఇంతవరకు ఏ సినిమా వసూలు చేయలేని కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా 1000 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ సినిమా మొత్తం ప్రపంచమంతా 2 వేల కోట్లు వసుళ్లను రాబట్టిన మొదటి తెలుగు సినిమా. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోలలో అందరికంటే ముందంజలో ఉన్నాడు. బాహుబలి తర్వాత తీసిన సినిమాలు అంతగా రాణించలేదు. అయినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు.

తనతో సినిమాలు చేయటానికి పాన్ ఇండియా దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. ప్రస్తుతం ఈయన ఒక సినిమాకు 100 కోట్ల నుండి 120 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుండి అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు.